కేన్ మామని ఎలా వాడాలో మాకు బాగా తెలుసు... గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశీష్ నెహ్రా కామెంట్...

First Published Dec 25, 2022, 3:33 PM IST

ఐపీఎల్ 2023 మినీ వేలంలో కేన్ విలియంసన్‌ని బేస్ ప్రైజ్ రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్. గత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా రూ.14 కోట్లు తీసుకున్న కేన్ విలియంసన్, 2023 సీజన్‌లో బేస్ ప్రైజ్‌కి ఆడబోతున్నాడు...

Image credit: PTI

ఐపీఎల్ 2018 సీజన్‌లో కెప్టెన్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుని ఫైనల్ చేర్చిన కేన్ విలియంసన్, బ్యాటుతో 735 పరుగులు చేసి అదరగొట్టాడు. అయితే ఆ తర్వాత 2020-22 సీజన్లలో కేన్ మామ నుంచి ఆశించిన పర్ఫామెన్స్ రాలేదు...
 

Kane Williamson

గత సీజన్‌లో 13 మ్యాచులు ఆడిన కేన్ విలియంసన్, 19.64 సగటుతో 216 పరుగులు చేశాడు. టీ20ల్లో పెద్దగా చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్న కేన్ మామ, గుజరాత్ టైటాన్స్‌లో రిజర్వు బెంచ్‌కే పరిమితం అవుతాడని అనుకున్నారంతా. అయితే గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశీష్ నెహ్రా మాత్రం డిఫరెంట్ ఆన్సర్ ఇచ్చాడు...

Image credit: Getty

‘కేన్ విలియంసన్ లాంటి సీనియర్ ప్లేయర్ రావడంతో టీమ్‌కి ఎంతో అనుభవం చేరుతుంది. అతను ఇప్పటికే ప్రపంచస్థాయిలో తనని తాను నిరూపించుకున్నాడు. ఐపీఎల్‌లో రెండు మూడు సీజన్లు సరిగ్గా ఆడనంత మాత్రాన అతని సత్తా తగ్గిపోదు..

కేన్ విలియంసన్‌ లాంటి ప్లేయర్‌ని బేస్ ప్రైజ్‌కే దక్కించుకోవడం మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. కేన్ విలియంసన్ కోసం మిగిలిన ఫ్రాంఛైజీలు పోటీపడతాయని అనుకున్నాం. కనీసం రూ.6-8 కోట్ల వరకైనా వెళ్తాడని ఆశించాం. కానీ బేస్ ప్రైజ్‌కే కేన్ లాంటి ప్లేయర్ వచ్చేశాడు...

కేన్ విలియంసన్‌ని వన్‌డౌన్‌లో ఆడించాలని అనుకుంటున్నాం. హార్ధిక్ పాండ్యా నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. పర్సులో మన దగ్గర ఎంతుందో చూసుకుని, ఎలంటి ప్లేయర్లు కావాలో తెలుసుకుని వేలానికి వెళ్లాలి. మేమూ అదే చేశాం...

మాకు కావాల్సిన ప్లేయర్లను కొన్నాం, ఇంకా మా పర్సులో డబ్బులు ఉన్నాయి. మేం కామెరూన్ గ్రీన్, బెన్ స్టోక్స్, సామ్ కుర్రాన్ వంటి ప్లేయర్ల కోసం పోటీపడకూడదని ముందే అనుకున్నాం...’ అంటూ కామెంట్ చేశాడు గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశీష్ నెహ్రా..
 

click me!