అద్భుతమైన ఫామ్‌లో ఉన్న జానీ బెయిర్ స్టోను సామ్ కుర్రాన్ అవుట్ చేశాడు. 5 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసిన చేసిన బెయిర్ స్టో, సామ్ కుర్రాన్ బౌలింగ్‌లో దీపక్ చాహార్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
22 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను డేవిడ్ వార్నర్, మనీశ్ పాండే కలిసి ఆదుకున్నారు. గత ఇన్నింగ్స్‌ల్లో నెమ్మదిగా బ్యాటింగ్ చేయడంతో వచ్చిన విమర్శలతో జట్టులో చోటు కోల్పోయిన మనీశ్ పాండే, ఈ మ్యాచ్‌లో మొదటి నుంచే దూకుడు చూపించాడు.
మనీశ్ పాండే, డేవిడడ్ వార్నర్ కలిసి రెండో వికెట్‌కి 108 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ దశలో ఐపీఎల్‌లో 50వ హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న డేవిడ్ వార్నర్, టీ20ల్లో 10 వేల పరుగులు పూర్తిచేసుకున్నాడు.
అంతేకాకుండా ఐపీఎల్‌లో 200 సిక్సర్లు కూడా పూర్తిచేసుకున్న డేవిడ్ వార్నర్, 55 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 57 పరుగులు చేసి లుంగి ఇంగిడి బౌలింగ్‌లో జడేజాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
వార్నర్ అవుటైన ఓవర్‌లోనే భారీ షాట్‌కి ప్రయత్నించిన మనీశ్ పాండే, డుప్లిసిస్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌కు పెవిలియన్ చేరాడు. 46 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 61 పరుగులు చేసి అవుట్ అయ్యాడు మనీశ్ పాండే...
శార్దూల్ ఠాకూర్ వేసిన 19వ ఓవర్‌లో మూడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 20 పరుగులు రాబట్టిన కేన్ విలియంసన్.. 10 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 26 పరుగులు చేయగా సామ్ కుర్రాన్ బౌలింగ్‌లో వరుసగా ఓ ఫోర్, సిక్సర్ బాదిన కేదార్ జాదవ్ 4 బంతుల్లో 12 పరుగులు చేశాడు.