కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఛీటింగ్ చేసి గెలిచాడా?... డగౌట్ నుంచి వాటిని చూసి...

First Published Apr 28, 2021, 8:33 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడిన తర్వాత పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. అయితే ఈ మ్యాచ్‌లో కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఛీటింగ్ చేశాడని ఆరోపిస్తున్నారు పంజాబ్ కింగ్స్ అభిమానులు. దీనికి కారణం మ్యాచ్ సమయంలో మోర్గాన్ చేసిన ఓ పని...

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్. కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, దీపక్ హుడా, పూరన్ వంటి భారీ హిట్టర్లున్న జట్టును 20 ఓవర్లలో 123 పరుగులకే కట్టడి చేసింది కేకేఆర్.
undefined
ప్యాట్ కమ్మిన్స్, శివమ్ మావి, సునీల్ నరైన్, ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ప్రసిద్ధ్ కృష్ణ 3 వికెట్లు తీయగా నరైన్, ప్యాట్ కమ్మిన్స్‌లకి చెరో 2 వికెట్లు దక్కాయి. శివమ్ మావి 4 ఓవర్లలో 13 పరుగులు మాత్రమే ఇచ్చి, క్రిస్‌గేల్‌ను డకౌట్ చేశాడు.
undefined
అయితే కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో కేకేఆర్ డగౌట్ నుంచి అతనికి సంకేతాలు అందాయి. ఎప్పుడూ పెన్ను, ప్యాడ్‌తో ఏదో రాస్తున్నట్టు కనిపించే కేకేఆర్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్, ఎనలిస్ట్ నాథన్ లీమన్ ‘54’ అంటూ ఉన్న ఫ్లకార్డును కెప్టెన్ మోర్గాన్‌కు చూపించారు.
undefined
ఫీల్డింగ్‌లో మార్పుల గురించి ఇలా చేసి ఉంటారని, మ్యాచ్ నడుస్తున్న సమయంలో డగౌట్ నుంచి ఇలా సంకేతాలు ఇవ్వడం క్రీడాస్ఫూర్తికి విరుద్దమని మండిపడుతున్నారు క్రికెట్ అభిమానులు.
undefined
ఇంతకుముందు కూడా కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో కూడా ఇలాగే ఛీటింగ్ చేసి దొరికాడు ఇయాన్ మోర్గాన్. ఆ మ్యాచ్‌లో 3C, 4E అని రాసి ఉన్న బోర్డులను డగౌట్ నుంచి మోర్గాన్‌కి సంకేతాలు ఇవ్వడం స్పష్టంగా కెమెరాల్లో కనిపించింది.
undefined
అందుకే తనకి అలవాటైన దొంగాటను ఐపీఎల్‌లో కూడా వాడాడని, వెంటనే కేకేఆర్ కెప్టెన్సీ నుంచి ఇయాన్ మోర్గాన్‌ను తొలగించాలంటూ విమర్శలు, ట్రోలింగ్ కూడా మొదలైంది...
undefined
అయితే భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం ఇయాన్ మోర్గాన్ చేసిన దాంట్లో తప్పేమీ లేదంటున్నాడు. డగౌట్ నుంచి సంకేతాలు ఇవ్వడం గేమ్ ప్లాన్‌లో భాగమని, కావాలంటే సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌ను లోపలికి తెచ్చి కెప్టెన్ వెళ్లి సలహాలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపాడు.
undefined
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 40 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేసిన ఇయాన్ మోర్గాన్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టుకి విజయాన్ని అందించాడు. మొదటి మ్యాచ్‌ తర్వాత నాలుగు మ్యాచుల్లో ఓడిన కేకేఆర్, రెండో విజయాన్ని అందుకుంది.
undefined
click me!