ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ పృథ్వీషా అరుదైన రికార్డు... కోహ్లీ, రోహిత్‌లను దాటి, రిషబ్ పంత్ తర్వాత...

First Published Apr 28, 2021, 8:04 PM IST

ఐపీఎల్ 2020 సీజన్‌లో అంత చెప్పుకోదగ్గ పరుగులు చేయకపోయినా 2021 సీజన్‌లో కాస్త మెరుగైన ప్రదర్శనే ఇస్తున్నాడు ఓపెనర్ పృథ్వీషా. శిఖర్ ధావన్‌తో కలిసి తనదైన స్టైల్‌లో దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభిస్తున్న పృథ్వీ షా... ఐపీఎల్‌లో అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 18 బంతుల్లో 3 ఫోర్లతో 21 పరుగులు చేసిన పృథ్వీషా... ఐపీఎల్ కెరీర్‌లో 1000 పరుగులు పూర్తిచేసుకున్నాడు. అతి పిన్న వయసులో ఈ ఫీట్ అందుకున్న రెండో ప్లేయర్‌గా నిలిచాడు పృథ్వీషా...
undefined
పృథ్వీషా వయసు 21 ఏళ్ల 169 రోజులు కాగా, శ్రేయాస్ అయ్యర్ గైర్హజరీతో ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్‌కి సారథిగా వ్యవహారిస్తున్న రిషబ్ పంత్ 20 ఏళ్ల 218 రోజుల వయసులో ఈ ఫీట్ సాధించి అందరికంటే ముందున్నాడు.
undefined
ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కి సారథిగా వ్యవహారిస్తున్న సంజూ శాంసన్, 21 ఏళ్ల 183 రోజుల్లో ఈ ఫీట్ సాధించి, ఈ జాబితాలో మూడో స్థానంలో ఉండగా, శుబ్‌మన్ గిల్ నాలుగో స్థానంలో ఉన్నాడు.
undefined
2008 ఐపీఎల్ ఆరంగ్రేట సీజన్‌లో ఎంట్రీ ఇచ్చిన ప్రస్తుత ఆర్‌సీబీ సారథి 22 ఏళ్ల 175 రోజుల వయసులో ఈ ఫీట్ సాధించి ఐదో స్థానంలో ఉండగా, రోహిత్ శర్మ ఆరో స్థానంలో ఉన్నాడు.
undefined
విరాట్ ఎంట్రీ తర్వాత 10 ఏళ్లకు 2018లో ఐపీఎల్ కెరీర్ ప్రారంభించిన పృథ్వీషా... తన బ్యాటింగ్ స్టైల్‌తో అందర్నీ ఆకట్టుకుంటున్నా... అతని బ్యాటింగ్‌లో నిలకడలేమి స్పష్టంగా కనిపిస్తోంది...
undefined
ఆస్ట్రేలియా టూర్‌లో మొదటి టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో ఘోరంగా ఫెయిల్ అయిన పృథ్వీషా... ఆ తర్వాత జరిగిన విజయ్ హాజారే ట్రోఫీలో 800+ పైగా పరుగులు, నాలుగు సెంచరీలతో అద్భుతమైన ఫామ్‌ను అందిపుచ్చుకున్నాడు.
undefined
click me!