South Africa vs England: దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. ఇప్పటికే వన్డే, టీ20 సిరీస్ ముగియగా ఈనెల 17 నుంచి బ్రిటీష్ జట్టుతో టెస్టులు ఆడాల్సి ఉంది.
ఇంగ్లాండ్ తో పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ లను ముగించుకుని సుదీర్ఘ ఫార్మాట్ (టెస్టులు) కు సిద్ధమవుతున్న దక్షిణాఫ్రికా జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కీలక పేసర్ కగిసొ రబాడా గాయం కారణంగా ఈ సిరీస్ ఆడటం అనుమానంగానే ఉంది.
26
టెస్టు సిరీస్ కంటే ముందే సఫారీలు.. ఐర్లాండ్ తో రెండు టీ20 లు ఆడాల్సి ఉంది. ఇటీవలే ఇంగ్లాండ్ తో ముగిసిన మూడు వన్డేలు, మూడు టీ20లలో విశ్రాంతి తీసుకున్న రబాడా.. గాయం బారిన పడ్డాడు. దీంతో అతడు ఐర్లాండ్ తో సిరీస్ నుంచి తప్పుకున్నాడు.
36
రబాడా గాయాన్ని పరిశీలించిన దక్షిణాఫ్రికా వైద్య బృందం అతడు కొన్నాళ్లు విరామం తీసుకుంటేనే మంచిదని తెలిపింది. సుమారు ఆరు వారాలైనా అతడికి విశ్రాంతి అవసరమని వైద్యులు తేల్చినట్టు తెలుస్తున్నది. ఇదే నిజమైతే గనక ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ కు ముందు సఫారీలను కోలుకోలేని ఎదురుదెబ్బ తాకినట్టే.
46
ఐర్లాండ్ తో రెండు టీ20లు ముగిశాక సౌతాఫ్రికా.. ఆగస్టు 17 నుంచి ఇంగ్లాండ్ తో మూడు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడనున్నది. 17 నుంచి 21 వరకు తొలి టెస్టు, 25 నుంచి 29 వరకు రెండో టెస్టు, సెప్టెంబర్ 8 నుంచి 12 వరకు మూడో టెస్టు జరగాల్సి ఉంది.
56
ఈ సిరీస్ లో రబాడా లేకపోతే ఇంగ్లాండ్ ను కట్టడి చేయడం సఫారీలను సవాలే. అసలే బ్రెండన్ మెక్ కల్లమ్ ఇంగ్లాండ్ టెస్టు కోచ్ బాధ్యతలు చేపట్టాక ఆ జట్టు పట్టపగ్గాల్లేకుండా దూసుకుపోతున్నది. స్వదేశంలో ఆ జట్టును కట్టడి చేయాలంటే రబాడా వంటి పేసర్ అవసరం సఫారీలకు ఎంతైనా ఉంది.
66
ఇక ఇంగ్లాండ్ పై టీ20 సిరీస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రత్యేకంగా అభినందించింది. సుమారు 13 ఏండ్ల తర్వాత ఇంగ్లీష్ గడ్డపై సిరీస్ గెలిచిన ఆనందంలో ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపించింది. ఈ విజయ యాత్ర టెస్టులలోనూ కొనసాగాలని ఆశించింది.