లక్నో సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్‌గా జస్టిన్ లాంగర్... కేకేఆర్‌కి వెళ్లనున్న గౌతమ్ గంభీర్?

Published : Jul 14, 2023, 08:06 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆరంగ్రేటం చేసిన లక్నో సూపర్ జెయింట్స్, రెండు సీజన్లలోనూ ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించగలిగింది. అయితే రెండు సీజన్లలోనూ ఎలిమినేటర్ మ్యాచుల్లో ఓడి నాలుగో స్థానానికే పరిమితమైంది. దీంతో ఐపీఎల్ 2024 సీజన్ ఆరంభానికి ముందు హెడ్ కోచ్‌ని మారుస్తూ నిర్ణయం తీసుకుంది లక్నో సూపర్ జెయింట్స్...

PREV
15
లక్నో సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్‌గా జస్టిన్ లాంగర్... కేకేఆర్‌కి వెళ్లనున్న గౌతమ్ గంభీర్?

గత రెండు సీజన్లలో ఎల్‌ఎస్‌జీకి హెడ్ కోచ్‌గా వ్యవహరించిన ఆండీ ప్లవర్ ప్లేస్‌లో ఆస్ట్రేలియా మాజీ హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్‌ని హెడ్ కోచ్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. 2021 టీ20 వరల్డ్ కప్ టోర్నీ గెలిచిన ఆస్ట్రేలియా టీమ్‌కి హెడ్ కోచ్‌గా వ్యవహరించిన జస్టిన్ లాంగర్, ప్రస్తుతం కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు..

25

‘ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కి హెడ్ కోచ్‌గా రాబోతుండడం ఆనందంగా ఉంది. ఈ జర్నీలో ఓ గొప్ప టీమ్‌ని నిర్మించడంలో నా వంతు పాత్ర పోషిస్తాను. టీమ్‌తో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నా..’ అంటూ కామెంట్ చేశాడు జస్టిన్ లాంగర్..

35

లక్నో సూపర్ జెయింట్స్‌కి మెంటర్‌గా వ్యవహరిస్తున్న టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌... కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి మారబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. కేకేఆర్‌కి రెండు టైటిల్స్ అందించిన గౌతమ్ గంభీర్‌ని హెడ్ కోచ్‌గా లేదంటే మెంటర్‌గా నియమించేందుకు నైట్‌రైడర్స్ యాజమాన్యం ప్రయత్నిస్తోంది... 

45
Gautam Gambhir-Nita Ambani

ఐపీఎల్ 2022 సీజన్‌లో కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో ప్లేఆఫ్స్‌కి వెళ్లిన లక్నో సూపర్ జెయింట్స్, 2023 సీజన్‌ని కూడా అతని సారథ్యంలోనే మొదలెట్టింది. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో లక్నోలో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ కెఎల్ రాహుల్ గాయపడ్డాడు..

55

ఆ తర్వాత మిగిలిన 6 మ్యాచ్‌లకు కృనాల్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించాడు. కృనాల్ కెప్టెన్సీలో కూడా మంచి విజయాలు అందుకుని ప్లేఆఫ్స్ చేరిన లక్నో సూపర్ జెయింట్స్, క్వాలిఫైయర్ గండాన్ని మాత్రం దాటలేకపోయింది..

click me!

Recommended Stories