త్రీ ఫార్మాట్ ప్లేయర్‌కి వాళ్లతో పోలికేంటి! కోహ్లీ రేంజ్ వేరు... ఆకాశ్ చోప్రాకి కౌంటర్ ఇచ్చిన ఇషాంత్ శర్మ

Published : Jul 14, 2023, 05:15 PM IST

41 ఏళ్ల జేమ్స్ అండర్సన్, యాషెస్ సిరీస్‌లో ఆడుతుంటే.. 34 ఏళ్ల భారత సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మ మాత్రం ఇండియా - వెస్టిండీస్ టెస్టు సిరీస్‌కి కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. 100కి పైగా టెస్టులు ఆడిన ఇషాంత్ శర్మ, రెండేళ్లుగా భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడు...  

PREV
17
త్రీ ఫార్మాట్ ప్లేయర్‌కి వాళ్లతో పోలికేంటి! కోహ్లీ రేంజ్ వేరు... ఆకాశ్ చోప్రాకి కౌంటర్ ఇచ్చిన ఇషాంత్ శర్మ
Ishant Sharma and Virat Kohli

‘టీమ్‌లో సీనియర్ ప్లేయర్‌గా ఉన్నప్పుడు కచ్ఛితంగా పరుగులు చేయాల్సిందే. లేకపోతే జూనియర్లు కూడా మీరు సీనియర్‌గా ఉండి ఏం లాభమని ప్రశ్నిస్తారు. విరాట్ కోహ్లీ కచ్ఛితంగా పరుగులు చేయగలడు. అతని మెంటల్ పొజిషన్‌ కూడా బాగుంది..

27

విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఎంతో మంది కుర్రాళ్లను జట్టులోకి తీసుకొచ్చాడు. రిషబ్ పంత్ కానీ సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ వంటి మిగిలిన వాళ్లు కానీ  టీమ్‌లో సెటిల్ అవ్వడానికి అతనే కారణం..

37
James Anderson and Ishant Sharma

కుర్రాళ్లకు టెక్నిక్‌ని నమ్ముకోమని సలహా ఇచ్చేవాడు విరాట్ కోహ్లీ. ఎన్ని సార్లు ఫెయిల్ అయినా జట్టులో చోటు ఉంటుందని భరోసా ఇచ్చాడు. ఓ ప్లేయర్‌కి కెప్టెన్ అండ ఉండడం కంటే ఇంకేం కావాలి...

47

విరాట్ కోహ్లీ, ఫ్యాబ్ 4లో ఉండడానికి అర్హుడు కాదని మీరు (ఆకాశ్ చోప్రా) అన్న మాటలను నేను విన్నాను. నా అభిప్రాయం ప్రకారం విరాట్ కోహ్లీకి ఫ్యాబ్ 4 అవసరం లేదు, కానీ ఫ్యాబ్ 4 అంటూ ఉంటే దానికి విరాట్ కోహ్లీ అవసరం కచ్ఛితంగా ఉంటుంది..
 

57
Virat Kohli

టెస్టుల్లో మాత్రం బాగా ఆడిన వారిని ఫ్యాబ్ 4 అంటున్నారు. మరి వన్డే, టీ20ల్లో కూడా అదరగొట్టే విరాట్ కోహ్లీ ఏమనాలి? నా ఉద్దేశంలో అతను ఫ్యాబ్ 1. కోహ్లీకి మరెవ్వరూ సాటి రారు. త్రీ ఫార్మాట్  ప్లేయర్‌‌తో పోటీ పడాలంటే మిగిలిన వారిలో కూడా ఆ సత్తా ఉండాలి...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మ.. 

67
Virat Kohli

‘గత మూడేళ్లుగా విరాట్ కోహ్లీ టెస్టు యావరేజ్ 26 మాత్రమే. అంతకుముందు అతను బాగా ఆడినా ఇప్పుడు అతను ఫ్యాబ్ 4లో లెక్కించడానికి పనికి రారు. ఇప్పుడున్నది ఫ్యాబ్ 3 మాత్రమే. ఫ్యాబ్ 4లో కోహ్లీ కంటే డేవిడ్ వార్నర్‌ని పెట్టడం కరెక్ట్’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు ఆకాశ్ చోప్రా.. 

77
Virat Kohli

2016 నుంచి 2019 మధ్య 10 వేల అంతర్జాతీయ పరుగులు చేసిన ఏకైక బ్యాటర్ విరాట్ కోహ్లీ. కొందరు వన్డే, టీ20ల్లో పరుగులు చేస్తే, మరికొందరు బ్యాటర్లు టెస్టుల్లో బాగా సక్సెస్ అయ్యారు. కానీ విరాట్ కోహ్లీ మాత్రం మూడు ఫార్మాట్లలో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చి, ‘దశాబ్ద క్రికెటర్’గా ఐసీసీ అవార్డు దక్కించుకున్నాడు..

Read more Photos on
click me!

Recommended Stories