వరల్డ్ కప్‌కి 20 మంది ఏం సరిపోతారు! వాళ్లందరినీ తీసుకోండి... రోహిత్ శర్మకు ఇర్ఫాన్ పఠాన్ సలహా...

First Published Jan 10, 2023, 12:51 PM IST

10 ఏళ్లుగా వరుసగా ఐసీసీ టోర్నీల్లో విఫలమవుతూ వస్తోంది భారత జట్టు. ధోనీ, విరాట్ కోహ్లీతో పాటు నయా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఐసీసీ టైటిల్ గెలవలేకపోయాడు. అయితే స్వదేశంలో జరుగుతున్న టోర్నీ కావడంతో వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో టీమిండియానే ఫెవరెట్‌గా బరిలో దిగుతోంది...

Image credit: Getty

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ కోసం 20 మంది ప్లేయర్లను షార్ట్ లిస్ట్ చేశామని, వీరిని రొటేషన్ పద్ధతిలో ఆడిస్తామని ఇప్పటికే ప్రకటించాడు బీసీసీఐ సెక్రటరీ జై షా. ఆ 20 మంది ప్లేయర్లు వీళ్లేనంటూ ఓ లిస్టు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది...

అయితే వన్డే వరల్డ్ కప్ కోసం 20 మంది ప్లేయర్లు ఏ మాత్రం సరిపోరని అంటున్నాడు భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్. ‘వరల్డ్ కప్‌ టోర్నీకి ఇంకా 9 నెలల సమయం ఉంది. కేవలం 20 మంది ప్లేయర్లను తీసుకుని, వారినే రొటేట్ చేస్తూ.. మిగిలిన ప్లేయర్లను పట్టించుకోకపోవడం ఏ మాత్రం కరెక్ట్ కాదు...

Rohit Sharma

రాహుల్ ద్రావిడ్‌తో పాటు వీవీఎస్ లక్ష్మణ్, బ్యాటింగ్ కోచ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌లు భారత జట్టుతో కాంట్రాక్ట్ కలిగి ఉన్నారు. వీరిని కరెక్టుగా వాడుకోండి. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో 33 మంది ప్లేయర్లు ఉన్నారు. వీరందరినీ వన్డే వరల్డ్ కప్‌ కోసం పరిగణనలోకి తీసుకోండి...

సెంట్రల్ కాంట్రాక్ట్ లేని ప్లేయర్లు బాగా ఆడితే వారిని కూడా లిస్టులో చేర్చండి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సిరీస్‌కి ఇద్దరు ముగ్గురు ప్లేయర్లు గాయపడుతున్నారు. ఏ ప్లేయర్ కూడా పూర్తిగా అందుబాటులో ఉండడం లేదు...

20 మందిని మాత్రమే సెలక్ట్ చేస్తే, వారిలో ఐదారుగురు గాయపడినా అనుకున్న రిజల్ట్ రాబట్టలేరు. కాబట్టి షార్ట్ లిస్టును పెంచండి, టీమ్‌కి కావాల్సిన ప్లేయర్లను కరెక్టుగా ఎంచుకోండి.. అప్పుడు 9 నెలల కాలంలో ఫామ్‌లో లేని ప్లేయర్లను, గాయపడిన ప్లేయర్లను పక్కనబెట్టి టీమ్‌ని తయారుచేసే వీలు దొరుకుతుంది...

irfan pathan

ఫామ్‌లో లేని ప్లేయర్లను వారి గత రికార్డుల కారణంగా ఆడించాల్సిన అవసరం టీమిండియాకి లేదు. ఎందుకంటే టీమ్‌లో అవకాశం కోసం ఎదురుచూస్తున్నవాళ్లు చాలామంది ఉన్నారు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్..  

click me!