ఇలా అయితే ఐదో టెస్టులో కూడా కష్టమే... రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు వాళ్లకి కూడా...

First Published Sep 7, 2021, 4:14 PM IST

ఇంగ్లాండ్ టూర్‌లో ఎవరు ఆడినా, ఆడకపోయినా రవిచంద్రన్ అశ్విన్ నాలుగు టెస్టు మ్యాచులు మిస్ అవుతాడని ఏ క్రికెట్ ఫ్యాన్ కూడా ఊహించి ఉండడు. రోహిత్, పూజారా, ఆఖరికి వైస్ కెప్టెన్ అజింకా రహానేను అయినా తప్పిస్తారని ఆశించారు, కానీ అశ్విన్ లేకుండా నాలుగు టెస్టులు ఆడేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు...

విన్నింగ్ కాంబినేషన్ పేరుతో మూడో టెస్టులో, ఆ తర్వాత నాలుగో టెస్టులోనూ రవిచంద్రన్ అశ్విన్‌కి తుదిజట్టులో చోటు కల్పించలేదు విరాట్ కోహ్లీ...

నాలుగో టెస్టులో కూడా అశ్విన్ లేకుండా గెలిచేసి, ఓవల్‌లో 50 ఏళ్ల తర్వాత తొలి విజయాన్ని అందుకుంది. దీంతో ఆఖరి టెస్టులో కూడా అశ్విన్ ఆడడం అనుమానంగా మారింది...

రెండో టెస్టు గెలిచిన తర్వాత విన్నింగ్ కాంబినేషన రిపీట్ చేసిన విరాట్ కోహ్లీ, ఐదో టెస్టులోనూ అదే ఫార్ములాను కొనసాగించే అవకాశం ఉంది...

ఇదే జరిగితే ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ లేకుండానే టెస్టు సిరీస్ మొత్తం పూర్తి అవుతుంది. అలాగే శుబ్‌మన్ గిల్ గాయపడడంతో ముందు ఓపెనర్‌గా అనుకున్న మయాంక్ అగర్వాల్‌కి కూడా ఒక్క ఛాన్స్ కూడా దొరకదు...

వీరితో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్, టెస్టు స్పెషలిస్టు ప్లేయర్ హనుమ విహారి, స్పిన్నర్ అక్షర్ పటేల్ కూడా నిరాశగా వెనక్కి రావాల్సిందే...

వీరిందరి పరిస్థితి ఒకలా ఉంటే... పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి మరోలా ఉంది. శ్రీలంక టూర్‌లో ఉన్న ఈ ఇద్దరినీ ఏరీకోరీ, సెలక్టర్లతో గొడవ పడీ మరీ ఇంగ్లాండ్‌కి రప్పించుకున్నాడు విరాట్ కోహ్లీ...

కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఫెయిల్ అయితే మంచి ఫామ్‌లో ఉన్న పృథ్వీషాని రోహిత్ శర్మతో పాటు ఓపెనర్‌గా ఆడించాలని అనుకున్నాడు విరాట్ కోహ్లీ...

సూర్యకుమార్ యాదవ్‌ను మిడిల్ ఆర్డర్‌లో ఉపయోగించాలని భావించాడు. అయితే శ్రీలంక టూర్‌లో కృనాల్ పాండ్యాకి కరోనా పాజిటివ్ రావడంతో వీరి రాక ఆలస్యమైంది. ఈ లోపు కెఎల్ రాహుల్ సక్సెస్ కావడం జరిగిపోయాయి...

అన్నింటికీ మించి మిగిలిన ప్లేయర్లతో పోలిస్తే తన ప్రదర్శనే దారుణంగా ఉండడంతో మిడిల్ ఆర్డర్‌లో ప్రయోగాలు చేయడానికి సాహసించలేదు విరాట్ కోహ్లీ...

ఇప్పుడు విరాట్ కోహ్లీ ఖాతాలో రెండు హాఫ్ సెంచరీలు, మరో రెండు 40+ స్కోర్లు ఉన్నాయి. అదీకాకుండా ఛతేశ్వర్ పూజారా, రోహిత్ శర్మ నాలుగో టెస్టులో గాయపడ్డారు...

కాబట్టి పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్‌లకు ఐదో టెస్టులో అవకాశం దొరికినా ఆశ్చర్యపోనక్కర్లేదు. లేదంటే వీరి ఎంపికే వృథా అవుతుంది. లేకపోతే ఈపాటికే ఈ ఇద్దరూ ఇంగ్లాండ్ టూర్‌లో టైం వేస్ట్ చేసేకంటే, యూఏఈ వెళ్లిపోయి ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ చేసుకునేవారు...

విదేశాల్లో మంచి రికార్డు ఉన్న టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ హనుమ విహారికి తుదిజట్టులో చోటు దక్కడం మాత్రం అనుమానంగానే మారింది. వాస్తవానికి జడేజా స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చే విహారి, ఇంగ్లాండ్‌ టూర్‌కి కౌంటీ మ్యాచుల్లో కూడా పాల్గొన్నాడు.

అయినా అతనికి ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్‌తో పాటు ఆ తర్వాత నాలుగు టెస్టుల్లోనూ అవకాశం దక్కలేదు. సిడ్నీ టెస్టులో గాయంతో బాధపడుతూ, నొప్పిని భరిస్తూ నాలుగు గంటల పాటు వికెట్లకు అడ్డుగా నిలబడి పోరాటం చేసిన హనుమ విహారి, ఇలా తుదిజట్టులో చోటు కోసం ఆశగా ఎదురుచూడాల్సి రావడం నిజంగా దురదృష్టకరం. 

click me!