ఆల్‌టైమ్ బెస్ట్ ఐపీఎల్ టీమ్ ఇదేనంటున్న జోస్ బట్లర్... ఆ ఇద్దరు జట్టులో లేకపోయినా...

First Published May 17, 2021, 2:51 PM IST

ఇంగ్లాండ్ ప్లేయర్ జోస్ బట్లర్ సామర్థ్యం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనదైన రోజున ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించగల సత్తా ఉన్న ప్లేయర్లలో జోస్ బట్లర్ ఒకడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో ఓ అద్భుత సెంచరీ కూడా బాదాడు బట్లర్...

ఐదేళ్లుగా ఐపీఎల్ ఆడుతున్న జోస్ బట్లర్, 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయ సెంచరీతో అదరగొట్టాడు. ఈ సీజన్‌లో ఏడు మ్యాచుల్లోనే 254 పరుగులు చేసిన బట్లర్, ప్రస్తుతం స్వదేశంలో ఉన్నాడు...
undefined
తాజాగా తన దృష్టిలో ఆల్‌టైం బెస్ట్ ఐపీఎల్ టీమ్‌ను ప్రకటించాడు జోస్ బట్లర్. ఈ జట్టులో తన పేరును కూడా చేర్చుకున్న బట్లర్, రోహిత్ శర్మతో పాటు తాను ఓపెనింగ్ చేసేలా జట్టును ఎంపిక చేసుకున్నాడు...
undefined
రోహిత్ శర్మ, జోస్ బట్లర్ ఓపెనర్లుగా వస్తే, వన్‌డౌన్‌లో భారత సారథి విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కి వస్తాడు. అతని తర్వాత ఆర్‌సీబీకి చెందిన ‘మిస్టర్ 360’ ఏబీ డివిల్లియర్స్‌కి తన జట్టులో చోటు కల్పించాడు బట్లర్...
undefined
ఐదో స్థానంలో మహేంద్ర సింగ్ ధోనీకి చోటు దక్కింది. ధోనీని తన జట్టుకి వికెట్ కీపర్‌‌గా, కెప్టెన్‌గా ఎంచుకున్నాడు జోస్ బట్లర్.
undefined
ధోనీ తర్వాత ఆరో స్థానంలో విధ్వంసకర బ్యాట్స్‌మెన్, ఆల్‌రౌండర్ కిరన్ పోలార్డ్ బ్యాటింగ్‌కి వస్తాడు. పోలార్డ్ తర్వాత భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బ్యాటింగ్‌కి వస్తాడు.
undefined
వీరితో పాటు భారత సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌కి జోస్ బట్లర్ టీమ్‌లో చోటు దక్కింది. అలాగే భారత సీనియర్ పేసర్లు భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా ఇద్దరికీ తన జట్టులో చోటు కల్పించాడు జోస్ బట్లర్...
undefined
వీరితో పాటు ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్న లసిత్ మలింగాను పేసర్‌ను ఎంచుకున్నాడు. భారత బెస్ట్ బ్యాట్స్‌మెన్, బౌలర్లకు తన జట్టులో చోటు కల్పించిన జోస్ బట్లర్... ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లుగా ఉన్న సురేశ్ రైనా, శిఖర్ ధావన్‌లను పట్టించుకోలేదు.
undefined
అలాగే ఐపీఎల్‌లో మంచి ట్రాక్ రికార్డు ఉన్న రషీద్ ఖాన్‌కి బదులుగా హర్భజన్ సింగ్‌ను తీసుకోవడం కూడా ఆశ్చర్యాన్ని కలిగింది. అయితే ఐపీఎల్‌లో భజ్జీకి కూడా 150+ వికెట్లు ఉన్న విషయం మరిచిపోకూడదు..
undefined
నలుగురు విదేశీ ప్లేయర్ల నిబంధన కారణంగా ‘యూనివర్సల్ బాస్’ క్రిస్‌గేల్‌కి కూడా తన బెస్ట్ ఐపీఎల్‌ టీమ్‌లో చోటు కల్పించలేకపోతున్నట్టు తెలిపాడు జోస్ బట్లర్...
undefined
జోస్ బట్లర్ ఆల్‌టైం బెస్ట్ ఐపీఎల్ టీమ్: జోస్ బట్లర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్, మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), కిరన్ పోలార్డ్, రవీంద్ర జడేజా, హర్భజన్ సింగ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా, లసిత్ మలింగ
undefined
click me!