క్రీజు దాటితే, తల పగలకొడతానని షోయబ్ అక్తర్ బెదిరించాడు... రాబిన్ ఊతప్ప షాకింగ్ కామెంట్..

First Published May 17, 2021, 1:18 PM IST

పాక్ మాజీ పేసర్, ‘రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌’ షోయబ్ అక్తర్, క్రికెట్ క్రీజులో ఎంత దురుసుగా ప్రవర్తించేవాడో క్రికెట్ ఫ్యాన్స్‌కి గుర్తుండే ఉంటుంది. ముఖ్యంగా దాయాదులు ఇండియా, పాకిస్తాన్‌‌ల మధ్య షోయబ్ అక్తర్ రాష్ బిహేవియర్ చూసి, భారతీయుల రక్తం ఉడికిపోయేది. తాజాగా అక్తర్‌తో తనకి జరిగిన చేదు అనుభవాన్ని గుర్తుచేసుకున్నాడు రాబిన్ ఊతప్ప.

2007లో పాకిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో జరిగిన సంఘటనను ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నాడు భారత సీనియర్ క్రికెటర్ రాబిన్ ఊతప్ప...
undefined
‘గౌహతిలో మ్యాచ్ ఆడుతున్నాం. అక్కడ వాతావరణం చాలా భిన్నంగా ఉంటుంది. మిగిలిన ప్రాంతాల్లో కంటే అక్కడ ముందుగానే చీకటి పడుతుంది. అప్పట్లో 34 ఓవర్లు ఆడిన తర్వాత కూడా కొత్త బంతి ఇచ్చేవాళ్లు కాదు... పాత బాల్‌తోనే బౌలింగ్ చేసేవాళ్లు...
undefined
టీమిండియా విజయానికి ఇంకా 25 బంతుల్లో 12 పరుగులు కావాలి. క్రీజులో నాతో పాటు ఇర్ఫాన్ పఠాన్ ఉన్నాడు. అప్పుడు అక్తర్ బౌలింగ్‌కి వచ్చాడు. ఓ భయంకరమైన యార్కర్‌ వేశాడు.
undefined
దాదాపు 154 కి.మీ. వేగంతో దూసుకొచ్చిన ఆ బంతిని నేను ఆపగలిగాను. ఆ తర్వాతి బంతి లో ఫుల్‌టాస్... ముందుగానే ఫుల్‌టాస్ వేస్తాడని ఊహించిన నేను, దాన్ని బౌండరీకి పంపించాను. అప్పటికే మా విజయం దాదాపు ఖరారైపోయింది...
undefined
విజయానికి 3 పరుగులే కావాల్సిన సమయంలో క్రీజు దాటి బయటికి వచ్చి బౌండరీ బాదాను. అక్తర్ వేసిన ఆ బంతి, నా బ్యాటు అంచుకు తగిలి బౌండరీకి దూసుకెళ్లడంతో ఆ వన్డేలో మేం విజయం సాధించాం...
undefined
అయితే నాలుగో వన్డేకి ముందు నేను, కొందరు భారత క్రికెటర్లతో కలిసి మ్యాచ్‌కి ముందు కబుర్లు చెప్పుకుంటున్నాం. అప్పుడు షోయబ్ భాయ్ నా దగ్గరకి వచ్చాడు.
undefined
గౌహతిలో బాగా బ్యాటింగ్ చేశావని మెచ్చుకున్నాడు. నా బౌలింగ్‌లో నువ్వు క్రీజు దాటి, బయటికి వచ్చి షాట్ ఆడావు. బాగుంది, కానీ ఇంకోసారి అలా ఆడడానికి ట్రై చేయకు...
undefined
ఎందుకంటే ఇంకోసారి క్రీజుదాటితే, నేను వేసే భీమర్‌కి నీ తల పగలొచ్చు అంటూ బెదిరించాడు... ఆ తర్వాత అక్తర్ బౌలింగ్‌లో క్రీజు దాటి బ్యాటింగ్ చేసేందుకు భయపడ్డాను... ’ అంటూ చెప్పుకొచ్చాడు రాబిన్ ఊతప్ప.
undefined
35 ఏళ్ల రాబిన్ ఊతప్ప, టీమిండియా తరుపున 46 వన్డేలు, 13 టీ20 మ్యాచులు ఆడాడు. మొత్తంగా 1100+ పరుగులు చేసిన ఊతప్ప, చివరిసారిగా 2015లో అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత ఫామ్ కోల్పోయి జట్టుకి దూరమయ్యాడు.
undefined
ఐపీఎల్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల తరుపున ఆడిన రాబిన్ ఊతప్పని, ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. అయితే మొదటి ఏడు మ్యాచుల్లో ఊతప్పకి ఆడే అవకాశం రాలేదు.
undefined
click me!