అంబటి రాయుడు నాతో బాగానే మాట్లాడతాడు, నన్ను త్రీడీ ప్లేయర్ ఎందుకు అంటున్నారో... విజయ్ శంకర్ కామెంట్...

First Published May 17, 2021, 12:46 PM IST

2019 వన్డే వరల్డ్‌కప్ సమయంలో టీమ్ సెలక్షన్‌పై, సెలక్టర్ల తీరుపై రేగిన చిచ్చు అంతా ఇంతా కాదు. పట్టుమని 10 టెస్టులు ఆడిన అనుభవం కూడా లేనివాళ్లని సెలక్టర్లుగా పెట్టి, 120 కోట్ల మంది ఆశలతో ఆటలాడుతున్నారంటూ తీవ్రస్థాయిలో దుమారం రేగింది...

మిడిల్ ఆర్డర్‌లో, ముఖ్యంగా నాలుగో స్థానంలో అద్భుతంగా రాణిస్తున్న అంబటి రాయుడిని వన్డే వరల్డ్‌కప్‌కి ఎంపిక చేయకపోవడం తీవ్ర వివాదాస్పదమైంది. అదే సమయంలో అంబటి రాయుడు వేసిన ట్వీట్, హాట్ టాపిక్ అయ్యింది...
undefined
అంబటి రాయుడిని కాదని విజయ్ శంకర్‌ను ఎంపిక చేయడానికి కారణం ఉందని, అతను బ్యాటింగ్, బౌలింగ్‌లోనే కాకుండా ఫీల్డింగ్‌కూడా బాగా చేస్తాడని... మూడు రకాలుగా జట్టుకి ఉపయోగపడతాడని కామెంట్ చేశాడు అప్పటి సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్...
undefined
దీంతో అంబటి రాయుడు... ‘టీమిండియా మ్యాచెస్ చూసేందుకు త్రీడీ గ్లాసెస్ ఆర్డర్ చేశా’ అంటూ వేసిన ట్వీట్, చాలా పాపులర్ అయ్యింది. అప్పటి నుంచి విజయ్ శంకర్‌ను అందరూ ‘త్రీడీ ప్లేయర్’ అంటూ పిలవడం మొదలెట్టారు...
undefined
సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచుల్లో విజయ్ శంకర్ రాణించకపోయినా, అప్పుడో ఇప్పుడో ఒక మ్యాచ్‌లో పర్ఫామెన్స్‌తో రాణించినా... ఆఖరికి అంబటి రాయుడు అదరగొట్టినా సరే... ‘త్రీడీ ప్లేయర్’ పేరు ట్రెండింగ్‌లోకి వచ్చేస్తూ ఉంటుంది...
undefined
‘నాకు త్రీడీ ప్లేయర్ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలీదు. అంబటి రాయుడు, నేను బయట కలుసుకున్నప్పుడు బాగానే మాట్లాడుకుంటాం. వ్యక్తిగతంగా మా ఇద్దరికీ ఎలాంటి విభేదాలు లేవు. రాయుడు వేసిన ఒక్క ట్వీట్ వైరల్ కావడంతో అందరూ అలా పిలవడం మొదలెట్టారు...
undefined
అతనిపై నాకు ఎలాంటి పగ, ద్వేషం లేవు. కొన్నిరోజుల క్రితం ఢిల్లీలో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా రాయుడిని కలిసా. మేమిద్దరం చాలా సేపు మాట్లాడుకున్నాం కూడా...
undefined
నన్ను అంబటిరాయుడిత ఎందుకు పోలుస్తారో కూడా నాకు అస్సలు అర్థం కాదు. మేం బ్యాటింగ్ చేసే పొజిషన్లు వేరు, మా బ్యాటింగ్ స్టైల్ వేరు. అదీ కాకుండా నేను ఆల్‌రౌండర్‌ని...
undefined
నన్ను త్రీడీ ప్లేయర్ అని పిలిచే చాలామందికి నేను ఏ పొజిషన్‌లో బ్యాటింగ్ చేస్తానో కూడా తెలీదు. కేవలం సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తూ ఆనందాన్ని పొందుతూ ఉంటారు...’ అంటూ కామెంట్ చేశాడు విజయ్ శంకర్...
undefined
జనాలు ఏమనుకుంటున్నారో తాను పట్టించుకోనని, వారి ఆలోచనను మార్చే ప్రయత్నం కూడా వేస్టని మానుకున్నానని చెప్పుకొచ్చిన విజయ్ శంకర్, తాను జాక్వస్ కలీస్, షేన్ వాట్సన్‌లా జట్టుకి ఉపయోగపడతానని చెప్పడం కొసమెరుపు...
undefined
click me!