జో రూట్స్ : సచిన్ రికార్డు కోసం ఆడట్లేదు..

Joe Root : ఇంగ్లాండ్ క్రికెటర్ జో రూట్ శ్రీలంకతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలోనూ సెంచరీలు సాధించి అదరగొట్టాడు. దీంతో అతను త్వరలోనే సచిన్ టెండూల్కర్ రికార్డులను బద్దలు కొడతాడని క్రికెట్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. 

ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ అదరగొడుతున్నాడు. అద్బుతమైన ఆటతో రికార్డుల మోత మోగిస్తున్నాడు. వరుసగా సెంచరీల మోత మోగిస్తూ లెజెండరీ ప్లేయర్ రికార్డులను బద్దలు కొట్టడానికి ముందుకు సాగుతున్నాడు. లార్డ్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ సూపర్ స్టార్ బ్యాటర్ జో రూట్ క్రికెట్ రికార్డు పుస్తకాల్లో తన పేరును లిఖించుకున్నాడు. 

ఈ మ్యాచ్ లో రెండు సెంచరీలతో అనేక రికార్డులు సాధించాడు. జో రూట్ తన 34వ టెస్ట్ సెంచరీని సాధించాడు, టెస్ట్ క్రికెట్ లో ఇంగ్లాండ్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా అలెస్టర్ కుక్ రికార్డును బద్దలు కొట్టాడు.

ఇంగ్లాండ్, శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లండన్‌లోని లార్డ్స్ మైదానంలో జరిగింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 427 పరుగులు చేయగా, శ్రీలంక 196 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లాండ్ తరఫున జో రూట్ 143 పరుగులు, అట్కిన్సన్ 118 పరుగులు చేశారు. 231 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 251 పరుగులకు ఆలౌటైంది.

రెండో ఇన్నింగ్స్‌లోనూ జో రూట్ సెంచరీ (103) సాధించాడు. దీంతో శ్రీలంకకు 483 పరుగుల లక్ష్యం నిర్దేశించింది ఇంగ్లాండ్. ప్రస్తుతం ఆ జట్టు 178/5 పరుగులతో ఆటను కొసాగిస్తోంది. దాదాపు ఇంగ్లాండ్ విజయం ఖాయమనే చెప్పాలి.


టెస్ట్ క్రికెట్‌లో అద్భుతమైన ఫాంలో ఉన్న జో రూట్ ఇప్పటివరకు 12,377 పరుగులు చేశాడు. రూట్ ఇదే ఫామ్‌ని కొనసాగిస్తే టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ (15,921) రికార్డును త్వరలోనే బద్దలు కొట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం క్రికెట్  ఆడుతూ అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో జోరూట్ అగ్రస్థానంలో ఉన్నాడు. 

ఈ 33 ఏళ్ల క్రికెటర్ ప్రస్తుతం ఈ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ 34 సెంచరీలతో సహా 12,377 పరుగులు చేశాడు. 10,000 పరుగుల క్లబ్‌లోకి ప్రవేశించిన ఏకైక యాక్టివ్-క్రికెటర్ ఇతడే. అత్యధిక టెస్టు క్రికెట్ పరుగుల సచిన్ రికార్డును బద్దలు కొడతాడని చాలామంది భావిస్తున్నారు. సచిన్ టెండూల్కర్ టెస్టు క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్. తన కెరీర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 15,921 పరుగులు సాధించాడు. 

అయితే, సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొడతాడని జో రూట్ గురించి చర్చసాగుతున్న క్రమంలో ఈ ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. సచిన్ రికార్డును బద్దలు కొట్టడం గురించి స్పందించిన జో రూట్, "నేను ప్రస్తుతం సచిన్ టెండూల్కర్ రికార్డును దృష్టిలో పెట్టుకుని ఆడటం" లేదన్నాడు.

"నా జట్టుకు ఎంతవరకు సహాయం చేయగలనో అంతవరకు చేస్తాను. నా జట్టు విజయమే నాకు ముఖ్యం. క్రికెట్ రికార్డులను బద్దలు కొట్టడం కాదని" జో రూట్ అన్నాడు. ప్రస్తుతం జోరూ చేసిన  ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

ఇంకా జోరూట్ మాట్లాడుతూ.. "నా ప్రయాణం ఎంత దూరం వెళ్తుందో ఇప్పుడే చెప్పలేను. చివరిలో చూద్దాం. ప్రతిసారి సెంచరీ చేసినప్పుడు కొత్త ఉత్సాహం వస్తుంది. కానీ సెంచరీ కంటే నా జట్టు గెలిచినప్పుడు ఇంకా ఎక్కువ సంతోషం కలుగుతుంది'' అని అన్నాడు.

కాగా, టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. టెండూల్కర్ తన కెరీర్‌లో 15,921 పరుగులు చేశాడు. అయితే, రెడ్ బాల్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 యాక్టివ్ బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో విరాట్ కోహ్లీ ఒక్కడే ఉన్నాడు.

జాబితాలో జో రూట్ తర్వాత ఆస్ట్రేలియాకు చెందిన స్టీవ్ స్మిత్ టెస్ట్ క్రికెట్‌లో 32 సెంచరీలతో సహా 9,685 పరుగులతో ఉన్నాడు. అద్భుతమైన బ్యాటింగ్ శైలి ఉన్న ఈ 35 ఏళ్ల క్రికెటర్ ప్రస్తుతం టెస్టు ఆటగాళ్లలో అత్యధికంగా 57 సగటు కలిగి ఉన్నాడు.

ఆ తర్వాత టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. ఈ 35 ఏళ్ల క్రికెటర్ టెస్టుల్లో 29 సెంచరీలతో సహా 8,848 పరుగులు చేశాడు. అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 254* పరుగులు. ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ఫిట్‌నెస్ ఉన్న ఆటగాళ్లలో ఇతను ఒకడు. మరో 3-4 సంవత్సరాలు ఈ ఫార్మాట్‌ను ఆడే అవకాశం ఉంది.

Latest Videos

click me!