క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఆల్ రౌండర్.. సీఎస్కే మాజీ ప్లేయర్ డ్వేన్ బ్రావో

First Published | Sep 1, 2024, 10:14 AM IST

Dwayne Bravo  : వెస్టిండీస్ మాజీ స్టార్ ఆటగాడు డ్వేన్ బ్రావో క్రికెట్ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ డ్వేన్ బ్రావో

వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. 40 ఏళ్ల ఈ క్రికెటర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో 'ప్రస్తుతం జరుగుతున్న కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) 2024 సీజన్ తన చివరి ప్రొఫెషనల్ టోర్నమెంట్ అవుతుందని' పేర్కొన్నాడు. 

టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ డ్వేన్ బ్రావో ప్రస్తుత సీజన్ తర్వాత సీపీఎల్ నుంచి రిటైర్ కానున్నాడు. అక్టోబర్లో 41వ ఏట అడుగుపెట్టనున్న బ్రావో సీపీఎల్ 2024లో ట్రిన్బాగో నైట్రైడర్స్ జట్టు సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ తో బాసెటెర్రెలో జరిగే తొలి మ్యాచ్ కు కొన్ని గంటల ముందు ఈ విషయాన్ని వెల్లడించాడు.

సక్సెస్ ఫుల్ ప్లేయర్ డ్వేన్ బ్రావో

ఐపీఎల్ తర్వాత వెస్టిండీస్‌లో జరిగే కరేబియన్ లీగ్‌పై బ్రావో దృష్టి సారించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అద్భుతమైన ప్రయాణం చేశాడు. విజయవంతమైన ప్లేయర్ గా చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టుకు అనేక విజయాలు అందించాడు. ఐపీఎల్ లో చెన్నై జట్టు 4 సార్లు ట్రోఫీని గెలుచుకోవడంలో బ్రావో కీలక పాత్ర పోషించాడు.

రెండేళ్ల ముందు ఐపీఎల్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20 క్రికెట్ అత్యుత్తమ బౌలర్లలో ఒకరు. టీ20 క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌౌలర్ గా రికార్డు సాధించాడు.  578 టీ20 మ్యాచ్‌లు ఆడిన బ్రావో మొత్తం 630 వికెట్లు తీసుకుని టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అంతేకాకుండా 441 ఇన్నింగ్స్‌లలో 6970 పరుగులు చేసి టీ20ల్లో అగ్రశ్రేణి ఆల్‌రౌండర్‌గా నిరూపించుకున్నాడు.   


ఇది చాలా గొప్ప ప్రయాణం : డీజే బ్రావో

"ఇది చాలా గొప్ప ప్రయాణం. ఈ సీజన్ నా చివరిది. నా కరేబియన్ సీపీఎల్ ముందు నా ఫైనల్ ప్రొఫెషనల్ టోర్నమెంట్ ఆడేందుకు నేను ఎదురు చూస్తున్నాను" అని బ్రావో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. బ్రావో ప్రస్తుతం సీపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్. 103 మ్యాచ్ లలో 22.40 సగటుతో 128 స్ట్రైక్‌ రేటు, ఎకానమీ రేటు 8.69 తో తన కెరీర్ ను కొనసాగిస్తున్నాడు.

అంతకుముందు, యూఏఈలో జరిగిన 2021 టీ20 ప్రపంచ కప్‌లో వెస్టిండీస్ ముందుగానే నిష్క్రమించిన తర్వాత బ్రావో తన టీ20 కెరీర్ కు వీడ్కోలు పలికాడు. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత బ్రావో సీపీఎల్ టీ20 క్రికెట్ కు వీడ్కోల్ పలుకుతున్నట్టు తెలిపాడు. దాని తర్వాత 2023లో బ్రావో ఐపీఎల్ నుండి రిటైర్ అయ్యాడు. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్‌గా మారాడు. 
 

టీ20 లో 500 వికెట్లు తీసిన తొలి ప్లేయర్ డ్వేన్ బ్రావో

సీపీఎల్ లో విజయవంతమైన ప్లేయర్ గా ముందుకు సాగుతున్నాడు. టీకేఆర్ తో కలిసి మూడు టైటిళ్లతో పాటు మొత్తం ఐదు టైటిల్స్ సాధించడంలో ఉన్నాడు. టీకేఆర్ తో కలిసి నాలుగో టైటిల్‌తో తన సీపీఎల్ కెరీర్‌ను ముగించాలని బ్రావో భావిస్తున్నాడు. అతను 2021లో పేట్రియాట్స్‌కు కెప్టెన్‌గా ముందుండి 2017, 2018లో టీకేఆర్ కు బ్యాక్-టు-బ్యాక్ టైటిల్స్‌ ను అందించాడు.

 500 టీ20 వికెట్లు తీసిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా కొనసాగుతున్న బ్రావో తన స్వదేశంలో, తన ప్రజల సమక్షంలో క్రికెట్‌కు వీడ్కోలు పలకడం అతనికి మరపురాని క్షణంగా మిగిలిపోతుంది. 

బ్రావో 2008లో ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. 5 హాఫ్ సెంచరీలు కూడా సాధించాడు. అత్యధిక ఐపిఎల్ స్కోరు 70* పరుగులు. డ్వేన్ బ్రావో తన ఐపీఎల్ కెరీర్ లో 120 ఫోర్లు, 66 సిక్సర్లు బాదాడు. ఐపీఎల్ లో మొత్తం 161 మ్యాచ్ లను ఆడాడు. డ్వేన్ బ్రావో ఐపీఎల్ లో 1560 పరుగులు చేశాడు. 183 వికెట్లు తీసుకున్నాడు. 

బ్రావో

సీపీఎల్ సీఈవో పీట్ రస్సెల్ బ్రావోకు వీడ్కోలు శుభాకాంక్షలు తెలుపుతూ.. "2013లో మా టోర్నీ ప్రారంభమైనప్పటి నుండి డ్వేన్ మా టోర్నమెంట్‌లో భాగమైనందుకు మేము చాలా కృతజ్ఞులమై ఉన్నాము. లీగ్‌ను ఈ రోజులా చేయడంలో అతని సహకారం ఎనలేనిది" అని తెలిపాడు.

అలాగే, "సీపీఎల్ క్రీడలో అతిపెద్ టోర్నీలలో ఒకటిగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. డ్వేన్ ఉత్సాహం, అద్భుతమైన వ్యక్తిత్వం దానిని ముందుకు తీసుకురావడంలో ఎంతగానో వారి కృషి తోడ్పడింది.

టీ20లో 'సర్ ఛాంపియన్' భారీ పాత్రను కొనసాగిస్తాడని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాము. క్రికెట్ ముందుకు సాగుతుంది.. తర్వాతి అతని క్రికెట్ ప్రయాణానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము" అని తెలిపాడు. 

Latest Videos

click me!