ఆ సత్తా రూట్ కు ఉంది కానీ అదే సమస్య : సచిన్ రికార్డులను అధిగమించడంపై టీమిండియా మాజీ క్రికెటర్ కామెంట్స్

Published : Jul 07, 2022, 07:12 PM IST

ENG vs IND T20I: ఇటీవలే ముగిసిన ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ లో రూట్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. అంతేగాక రెండున్నరేండ్లుగా 11 సెంచరీలు చేసి కోహ్లి, స్మిత్ (27 సెంచరీలు) లను అధిగమించాడు. 

PREV
17
ఆ సత్తా రూట్ కు ఉంది కానీ అదే సమస్య : సచిన్ రికార్డులను అధిగమించడంపై టీమిండియా మాజీ క్రికెటర్ కామెంట్స్

తన కెరీర్ లోనే అత్యద్భుత ఫామ్ లో ఉన్నాడు ఇంగ్లాండ్ మాజీ సారథి  జో రూట్. ముఖ్యంగా టెస్టులలో అతడు వీరవిహారం చేస్తూ సెంచరీల మీద సెంచరీలు బాదుతున్నాడు. ఈ క్రమంలో అతడు సచిన్ రికార్డుల పై కన్నేశాడు. 

27

టెస్టు క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ రికార్డు క్రికెట్ పుస్తకాలలో సువర్ణక్షరాలతో లిఖించి ఉంది.  ఈ రికార్డును బద్దలుకొట్టడం ప్రస్తుత క్రికెట్ లో జో రూట్ వల్లే అవుతుందని టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్. 

37

తాజాగా అతడు ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘టెస్టులలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలుకొట్టే అవకాశాలు జో రూట్ కు ఉన్నాయి. ఆ సత్తా కూడా అతడికి ఉంది. అతడికి ఇప్పుడు 31 ఏండ్లు. 

47

అయితే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ప్లేయర్ల క్రికెట్ కెరీర్ లు సుదీర్ఘకాలం కొనసాగవని మనకు తెలిసిన విషయమే. కానీ రూట్ మరో ఐదారేండ్లు క్రికెట్ ఆడి  అతడు ఇదే ఫామ్ ను కొనసాగిస్తే మాత్రం అప్పుడు అతడు సచిన్ రికార్డులను అధిగమించే అవకాశాలు మెండుగా ఉంటాయి..’ అని తెలిపాడు. 

57

ఇండియాతో ఇటీవలే ముగిసిన ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ లో రూట్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈ సిరీస్ లో రూట్.. 737 పరుగులు సాధించాడు. అంతేగాక రెండున్నరేండ్లుగా 11 సెంచరీలు చేసి కోహ్లి, స్మిత్ (27 సెంచరీలు) లను అధిగమించాడు. ఫ్యాబ్-4 ఆటగాళ్లుగా పిలవబడే విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్సన్ లలో ఇప్పుడు రూట్ మిగతా ముగ్గురికంటే ముందున్నాడు.

67

టెస్టులలో అత్యధిక పరుగుల రికార్డు విషయానికొస్తే.. టీమిండియా దిగ్గజం  సచిన్ టెండూల్కర్  తన కెరీర్ లో 200 టెస్టులు ఆడి 15,921 పరుగులు సాధించాడు.

77

 ఇక జో రూట్.. 121 టెస్టులలో 10,458 పరుగులు చేశాడు. మాస్టర్ బ్లాస్టర్ అత్యధిక పరుగల రికార్డులను అధిగమించాలంటే రూట్.. ఏడాదికి వెయ్యి పరుగులకు తగ్గకుండా వరుసగా ఐదేండ్లు ఇదే ఫామ్ ను కొనసాగించాలి.

Read more Photos on
click me!

Recommended Stories