జో రూట్ రికార్డు సెంచరీ... సిరాజ్, సామ్ కుర్రాన్ మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్...

First Published Aug 7, 2021, 9:36 PM IST

ఇంగ్లాండ్, ఇండియా మధ్య జరుగుతున్న తొలి టెస్టు డ్రా దిశగా సాగేలా కనిపిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 95 పరుగుల ఆధిక్యం లభించినా... రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగిన జో రూట్, టీమిండియా చేతుల్లోనుంచి టెస్టును దాదాపు లాగేసుకున్నాడు...

ఓ వైపు వికెట్లు పడుతున్నా, మరో ఎండ్‌లో బౌండరీల మోత మోగించిన జో రూట్... 159 బంతుల్లో 14 ఫోర్లతో సెంచరీ మార్కును అందుకున్నాడు. జో రూట్‌కి ఇది టెస్టుల్లో 21వ సెంచరీ...

టీమిండియాపై అత్యధిక సెంచరీలు చేసిన ఇంగ్లాండ్ ప్లేయర్‌గా నిలిచిన జో రూట్... 2001లో నాలుగో సెంచరీ బాదాడు. 2018 నుంచి అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు జో రూట్...

జో రూట్‌కి గత మూడేళ్లలో ఇది 8వ సెంచరీ కాగా, కేన్ విలియంసన్, విరాట్ కోహ్లీ, మోమినుల్ హక్ ఏడేసి సెంచరీలు చేశారు.. స్వదేశంలో 2018 తర్వాత సెంచరీ చేయడం ఇదే తొలిసారి...

2018 ఇండియా, ఇంగ్లాండ్ టూర్‌లో 125 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన జో రూట్, మళ్లీ మూడేళ్ల తర్వాత టీమిండియాపైనే స్వదేశంలో సెంచరీ మార్కు అందుకున్నాడు...

మరో ఎండ్‌లో మహ్మద్ సిరాజ్, సామ్ కుర్రాన్ మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ నడిచింది. సిరాజ్ బౌలింగ్‌లో ఓ బౌండరీ బాదాడు కుర్రాన్... ఆ తర్వాత సిరాజ్ బంతి వేయడానికి సిద్ధమైనా, కుర్రాన్ మాత్రం పొజిషన్‌లో రావడానికి ఆలస్యం చేశాడు...

దీంతో ఆవేశానికి లోనైన సిరాజ్, ఓ బౌన్సర్‌తో కుర్రాన్‌ను భయపెట్టాడు. ఆ తర్వాత కుర్రాన్‌ దగ్గరికి వెళ్లి ఏదో అన్నాడు. ఆ తర్వాతి బంతి కూడా అలాంటి బంతే వచ్చింది. అప్పుడు కూడా సిరాజ్, కుర్రాన్ మధ్య మాటల యుద్ధం నడిచింది...

సిరాజ్ మరీ ఆవేశపడుతుండడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ అతనికి సర్ది చెప్పాడు. ఆ తర్వాత సిరాజ్ ఓవర్‌లో మరో బౌండరీ బాదాడు సామ్ కుర్రాన్... 

ఇప్పటికే రెండో ఇన్నింగ్స్‌లో 180+ పరుగుల ఆధిక్యాన్ని సాధించింది ఇంగ్లాండ్. చేతిలో మరో నాలుగు వికెట్లు ఉన్నాయి. ఎలా చూసినా ఇంగ్లాండ్ జట్టు 250+ స్కోరు చేసేలా కనిపిస్తోంది. నాలుగో ఇన్నింగ్స్‌లో ఈ స్కోరు సాధించడం టీమిండియా చాలా కష్టంగా మారనుంది. 

click me!