ఏబీ డివిల్లియర్స్ నా హీరో, కానీ ఆ సంఘటన తర్వాత అతనంటే గౌరవం పోయింది...

Published : Aug 07, 2021, 04:09 PM IST

సౌతాఫ్రాకి క్రికెట్‌ను జాతివివక్ష వివాదం, కొద్దికొద్దిగా కమ్మేస్తోంది. ఇప్పటికే కొన్నాళ్లుగా సరైన విజయాలు అందుకోలేక ఆపసోపాలు పడుతున్న సఫారీ జట్టు, ఇప్పుడు జాత్యాహంకార ఆరోపణలతో చిక్కుల్లో పడింది. జాతివివక్ష ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో సఫారీ క్రికెట్ లెజెండ్స్ గ్రేమ్ స్మిత్, ఏబీ డివిల్లియర్స్ వంటి వాళ్లు ఉండడం విశేషం...

PREV
112
ఏబీ డివిల్లియర్స్ నా హీరో, కానీ ఆ సంఘటన తర్వాత అతనంటే గౌరవం పోయింది...

సఫారీ క్రికెట్‌లో ప్రక్షాళనలు తీసుకొచ్చేందుకు సోషల్ జస్టీస్ అండ్ నేషన్ బిల్డింగ్స్ ద్వారా మాజీ క్రికెటర్లు ఎదుర్కొన్న అనుభవాలను, అవమానాలను రికార్డు చేస్తోంది హియరింగ్స్ కమిటీ...

212

2015 అక్టోబర్‌లో సౌతాఫ్రికా జట్టు, భారత్ పర్యటనకి వచ్చింది. ఆ సమయంలో తుది జట్టులో తనని ఆడించకుండా, అప్పటి సౌతాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిల్లియర్స్ అడ్డుకున్నాడంటూ ఆరోపించాడు మాజీ బ్యాట్స్‌మెన్ ఖాయా జొండో...

312

2015 అక్టోబర్‌లో సౌతాఫ్రికా జట్టు, భారత్ పర్యటనకి వచ్చింది. ఆ సమయంలో తుది జట్టులో తనని ఆడించకుండా, అప్పటి సౌతాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిల్లియర్స్ అడ్డుకున్నాడంటూ ఆరోపించాడు మాజీ బ్యాట్స్‌మెన్ ఖాయా జొండో...

412

‘కెప్టెన్ (ఏబీ డివిల్లియర్స్) నన్ను పిలిచి, నేను జట్టులో లేనని చెప్పాడు. అయితే నన్ను పక్కన పెట్టాలనే నిర్ణయం, తాను మాత్రమే తీసుకున్నానని... అందుకే తానే బాధ్యత వహిస్తానంటూ నాకు ఏదో వివరణ ఇవ్వడానికి ప్రయత్నించాడు...

512

అప్పుడు ఏబీడీ చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. నాకు ఏబీ డివిల్లియర్స్ అంటే ఎంతో ఇష్టం. నా క్రికెట్ హీరో అతనే... కానీ ఆ సంఘటన తర్వాత అతనిపై నాకున్న గౌరవం మొత్తం పోయింది...

612

తన నిర్ణయం ఎందుకు సరైనదో చెబుతూ ఇచ్చిన వివరణలో ఒక్కటీ కరెక్ట్ అనిపించలేదు. ఆ సంఘటన తర్వాత నేను జట్టు నుంచి దూరంగా ఉన్నా. జట్టుకి నా అవసరం లేదని తేలిపోయింది...

712

నా స్థానంలో జట్టులోకి వచ్చిన ప్లేయర్లు, ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని ప్రపంచ క్రికెట్‌లో స్టార్‌గా ఎదగడం కళ్లరా చూడడం చాలా బాధగా అనిపిస్తుంది. నా స్థానంలో డీన్ ఈల్డర్ జట్టులోకి వచ్చాడు...

812

ఆ రోజు నేను మ్యాచ్ ఆడి ఉంటే, నేనేంటో ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం దక్కి ఉండేది. అది జరిగి ఉంటే, ఐపీఎల్‌లో నాకు అవకాశాలు వచ్చేవి... ’ అంటూ సంచలన వ్యాక్యలు చేశాడు ఖాయా జొండో...

912

ఖాయా జొండో ఆరోపణల్లో వాస్తవం ఉందని సౌతాఫ్రికా మాజీ సెలక్టర్ హుస్సేన్ మానఖ్ కామెంట్ చేయడం, సపారీ బోర్డు సభ్యులను ఆశ్చర్యానికి గురి చేసింది...

1012

‘ఖాయా జొండో, తన జట్టులో ఉండకూడదని ఏబీ డివిల్లియర్స్ భావించాడు. అందుకే ఏ మాత్రం అనుభవం లేని జొండో, భారత జనాల ముందు పెద్దగా రాణించలేడని చెప్పాడు...

1112

ఫామ్‌లో లేకపోయినా డేవిడ్ మిల్లర్‌కి మరో అవకాశం ఇద్దామని చెప్పాడు. డేవిడ్ మిల్లర్‌కి అప్పటికి పెద్దగా అంతర్జాతీయ అనుభవం లేదు, కానీ ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చాడు...

1212

జేపీ డుమినీ గాయపడడంతో ఆ స్థానంలో జొండోకి ఆడించాలని మేం భావించాం. కానీ డీన్ ఇల్గర్‌నే ఆడించాలని ఏబీ డివిల్లియర్స్ భావించాడు...’ అంటూ కామెంట్ చేశాడు హుస్సేన్ మానఖ్...

click me!

Recommended Stories