తగ్గేదేలే, వాళ్లు మాటలతో ఆడితే, మేం ఆటతోనే గెలుస్తాం... ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్...

First Published Aug 24, 2021, 4:16 PM IST

లార్డ్స్ టెస్టులో ఘోర పరాజయం తర్వాత మూడో టెస్టులో విజయంతో కమ్‌బ్యాక్ ఇస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్. గత ఆరు టెస్టుల్లో విజయాన్ని అందుకోలేకపోయిన ఇంగ్లాండ్ జట్టు, అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చి సిరీస్ సొంతం చేసుకుంటుందని అంటున్నాడు జో రూట్...

రెండు జట్ల మధ్య పోటీలా కాకుండా, రెండు టీమ్స్ యాటిట్యూడ్, ఇగో మధ్య వార్‌లా నడిచింది లార్డ్స్ టెస్టు. ఐదో రోజు నడిచిన హై డ్రామా, మ్యాచ్‌నే మలుపు తిప్పేసింది... జో రూట్ చేసిన కొన్ని ఊహాత్మక తప్పిదాలు, టీమిండియాకి కలిసొచ్చాయి...

‘రెండో టెస్టులో ఓడినా, మూడో టెస్టులో గెలిచి కమ్‌బ్యాక్ ఇవ్వగల సత్తా మాలో ఉంది. ఇక్కడ ప్రతిదీ ఆటతోనే ముడిపడి ఉంటుంది. మేం మా గేమ్ ప్లాన్ ప్రకారం ఆడితే, కచ్ఛితంగా బెస్ట్ రిజల్ల్ రాబట్టగలుగుతాం...

ఆట గురించి తప్ప మిగిలిన విషయాల గురించి ఆలోచించి, మనసును పాడుచేసుకోవాలని అనుకోవడం లేదు. మేం ఎంతో నిబద్ధతతో ఆడాం. మా ఆటలో నిజాయితీ ఉంది. మాలోని ప్రతీ ఒక్క ప్లేయర్‌లో నిజాయితీ ఉంది...

మేమంతా కలిసి ఎంతో గొప్పగా ఆడగలం. విరాట్ టీమ్ ఎలా ఆడతారో, వాళ్లని అలాగే ఆడనివ్వండి. మేం అవన్నీ పట్టించుకోకుండా క్రీజులో మా బెస్ట్ ఇవ్వడానికే కట్టుబడి ఉంటాం..

భిన్నమైన సందర్భాల్లో ఒక్కొక్కరు ఒక్కోలా వ్యవహరిస్తారు. మేం వారిని రెచ్చగొట్టి తప్పుచేశాం. అయితే ఆ తప్పు నుంచి ఓ గుణపాఠం నేర్చుకున్నాం. ఇప్పుడు టీమిండియాతో ఎలా ఆడాలో మాకు బాగా తెలిసింది...

వాళ్లు మాటలతో ఆడితే, మేం అలాగే చేయాలని ప్రయత్నించి తప్పు చేశాం. టెస్టు సిరీస్‌లో ఇంకా మూడు టెస్టులు మిగిలే ఉన్నాయి. ఇంకా చాలా ఆట మిగిలి ఉంది. కమ్‌బ్యాక్ ఇవ్వడానికి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాం... ’ అంటూ తెలిపాడు ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్...

‘మూడో టెస్టులో డేవిడ్ మలాన్ బరిలో దిగబోతున్నాడు. అతనికి టాప్ 3లో ఎంతో అనుభవం ఉంది. టెస్టు క్రికెట్‌లో ఎన్ని మ్యాచులు ఆడాడనే విషయం పక్కనబెడితే, అంతర్జాతీయ కెరీర్‌లో అతని అనుభవం మాకు బాగా ఉపయోగపడుతుంది..

ఆస్ట్రేలియా సిరీస్‌లో డేవిడ్ మలాన్ సక్సెస్ అయ్యాడు... అలాగే సాదీక్ మహ్మద్ కూడా చాలా ఏళ్లుగా అన్ని ఫార్మాట్లలో అదరగొడుతున్నాడు... 

టెస్టు క్రికెట్‌లో భారీ భాగస్వామ్యాలు నమోదుచేయడం చాలా అవసరం. ఇద్దరు ప్లేయర్లు, క్రీజులో కుదురుకుపోతే మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగలరు. అయితే ఇంగ్లాండ్‌లో ఇన్నింగ్స్ మొదలెట్టడమే చాలా కష్టమైన పని..’ అంటూ కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్...

click me!