టెస్టు కెప్టెన్‌గా జో రూట్‌కి ఇది 27వ విజయం. ఇంగ్లాండ్ తరుపున అత్యధిక టెస్టు విజయాలు అందుకున్న సారథిగా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు జో రూట్...
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాగన్ 26 టెస్టు విజయాలు అందుకోగా, అలెస్టర్ కుక్, ఆండ్రూ స్ట్రాస్ చెరో 24 టెస్టుల్లో విజయాలను అందుకున్నారు. ఈ విజయంతో జో రూట్, మెకేల్ వాగన్ రికార్డును అధిగమించాడు..
లీడ్స్‌లో ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోవడం భారత జట్టుకి ఇది రెండో సారి. 1959లో ఇలాగే ఇన్నింగ్స్ తేడాతో ఓడింది టీమిండియా.
. ఈ స్టేడియంలో వరుసగా మూడు టెస్టుల్లో ఓడిన టీమిండియా, ఆ తర్వాత ఓ మ్యాచ్ డ్రా చేసుకుని, వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచింది... ఈ మ్యాచ్‌తో విజయాలకు బ్రేక్ పడింది.
2002లో సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో ఇన్నింగ్స్ తేడాతో టెస్టు మ్యాచ్ గెలిచిన టీమిండియా, 19 ఏళ్ల తర్వాత విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఆడిన టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోవడం విశేషం...
గత 8 టెస్టుల్లో ఐదు మ్యాచుల్లో ఓడి, రెండు మ్యాచులు డ్రా చేసుకున్న ఇంగ్లాండ్‌కి ఏడు మ్యాచుల తర్వాత దక్కిన తొలి విజయం ఇది...