ఏడాదిగా ఇంట్లో ఉండి, బిడ్డను చూసేందుకు 2 రోజులు ఆగలేడా? జస్ప్రిత్ బుమ్రాని ట్రోల్ చేస్తున్న ధోనీ ఫ్యాన్స్...

First Published Sep 4, 2023, 3:12 PM IST

గత ఏడాది ఆసియా కప్ ఆరంభానికి ముందు గాయపడిన జస్ప్రిత్ బుమ్రా, కోలుకోవడానికి ఏడాదికి పైగా సమయం తీసుకున్నాడు. బుమ్రా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడతాడని రీఎంట్రీ ఇవ్వబోతున్నాడని, ఐపీఎల్ 2023 ఆడతాడని వార్తలు వచ్చినా అలా జరగలేదు...
 

ఎట్టకేలకు ఐర్లాండ్ టూర్‌లో రీఎంట్రీ ఇచ్చిన జస్ప్రిత్ బుమ్రా, ఆసియా కప్ 2023 టోర్నీలో పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడాడు. వర్షం కారణంగా పాకిస్తాన్ ఇన్నింగ్స్ ఒక్క బంతి కూడా వేయకుండానే రద్దయింది. దీంతో రీఎంట్రీ జస్ప్రిత్ బుమ్రా అసలు సిసలైన బౌలింగ్ పవర్ చూడాలని భావించిన ఫ్యాన్స్‌కి నిరాశే ఎదురైంది..

పాకిస్తాన్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత భార్య డెలివరీ కోసం స్వదేశానికి వచ్చేశాడు జస్ప్రిత్ బుమ్రా. దీంతో నేపాల్‌తో జరిగే మ్యాచ్‌కి జస్ప్రిత్ బుమ్రా అందుబాటులో ఉండడం లేదు. రీఎంట్రీ తర్వాత జస్ప్రిత్ బుమ్రా ఇప్పటిదాకా పూర్తిగా ఆడింది రెండు టీ20 మ్యాచులే...

Latest Videos


Jasprit Bumrah

నేపాల్‌తో మ్యాచ్‌ నుంచి జస్ప్రిత్ బుమ్రా వ్యక్తిగత కారణాలతో తప్పుకోవడంపై సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోల్స్ వస్తున్నాయి.

2015 వన్డే వరల్డ్ కప్ సమయంలో అప్పటి టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ‌కి కూతురు జీవా పుట్టింది..

అయితే ఆ సమయంలో ఆస్ట్రేలియాలో ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ, కూతురిని చూసేందుకు వెళ్లేందుకు ఇష్టపడలేదు. ‘నేను టీమిండియా కెప్టెన్‌గా నేషనల్ డ్యూటీలో ఉన్నాడు. ఇప్పుడు టీమ్‌ని మధ్యలో వదిలేసి, వ్యక్తిగత కారణాలతో ఇంటికి వెళ్లలేను’ అంటూ కామెంట్ చేశాడు ధోనీ..

2020-21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సమయంలో ఆడిలైడ్ టెస్టులో ఘోర పరాజయం తర్వాత విరాట్ కోహ్లీ కూడా ఇదే విధంగా పెటర్నిటీ లీవ్‌తో స్వదేశానికి వచ్చేశాడు. మిగిలిన మూడు మ్యాచులకు అజింకా రహానే కెప్టెన్సీ చేయడం, టీమిండియా 2-1 తేడాతో టెస్టు సిరీస్ సొంతం చేసుకోవడం జరిగిపోయాయి..
 

ప్రస్తుత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి చెప్పాల్సిన పని లేదు. బామ్మర్ది పెళ్లి, మేనల్లుడి పెళ్లి చూపులు... ఇలా చిన్న చిన్న కారణాలతో టీమ్‌కి రోహిత్ శర్మ దూరమైన సందర్భాలు చాలానే ఉన్నాయి. పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాక కూడా బామ్మర్ధి పెళ్లి కోసం టీమ్‌కి దూరమయ్యాడు రోహిత్ శర్మ..
 

Bumrah and Sanjana

మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత టీమ్‌కి, క్రికెట్‌కి అంత కమిట్‌మెంట్ ఇచ్చే ప్లేయర్లు కానీ, కెప్టెన్ కానీ దొరకడం లేదని, అందుకే భారత జట్టు ఐసీసీ టైటిల్స్ గెలవలేకపోతుందని బుమ్రాని ట్రోల్ చేస్తున్నారు మాహీ ఫ్యాన్స్.. 

నేపాల్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియాకి 6 రోజుల పాటు బ్రేక్ దొరకనుంది. జస్ప్రిత్ బుమ్రా కావాలంటే నేపాల్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత స్వదేశానికి వచ్చి బిడ్డను చూసుకుని ఉండొచ్చు. కానీ బుమ్రా 2 రోజుల ముందే స్వదేశానికి పయనం కావడాన్ని తప్పుబడుతూ ట్రోల్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు.. 
 

ఆసియా కప్ 2023 టోర్నీకి వరుణుడి ముంపు పొంచి ఉంది. సూపర్ 4 రౌండ్ మ్యాచులు, ఫైనల్ జరగాల్సిన కొలంబోలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ఆసియా కప్ 2023 సజావుగా సాగడమే కష్టం. ఏడాది తర్వాత రీఎంట్రీ ఇస్తున్న బుమ్రా, వరల్డ్ కప్‌కి ముందు సరైన మ్యాచ్ ప్రాక్టీస్ దక్కాలంటే ప్రతీ మ్యాచ్ ఆడాల్సిందే.. 
 

click me!