టీమిండియాకి షాక్... నేపాల్‌తో మ్యాచ్‌కి దూరమైన జస్ప్రిత్ బుమ్రా!

Published : Sep 03, 2023, 08:18 PM IST

ఆసియా కప్ 2023 టోర్నీలో పాకిస్తాన్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యింది. నేపాల్‌తో మ్యాచ్‌కి ముందు టీమిండియాకి ఊహించని షాక్ తగిలింది. నేపాల్‌తో మ్యాచ్‌కి జస్ప్రిత్ బుమ్రా దూరం అయ్యాడు..

PREV
16
టీమిండియాకి షాక్... నేపాల్‌తో మ్యాచ్‌కి దూరమైన జస్ప్రిత్ బుమ్రా!

పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత బ్యాటర్లు అందరికీ బ్యాటింగ్ చేసే అవకాశం దక్కింది. లోయర్ బ్యాటింగ్ ఆర్డర్‌లో బుమ్రా 14 బంతుల్లో 3 ఫోర్లతో 16 పరుగులు చేసి... హార్ధిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ తర్వాత టాప్ స్కోరర్‌గా నిలిచాడు..

26

రెండేళ్ల క్రితం వరకూ జస్ప్రిత్ బుమ్రా అవుట్ కాకుండా 3 బంతులు ఆడితే చాలనుకున్న అభిమానులకు, ఇలా హారీస్ రౌఫ్, షాహీన్ ఆఫ్రిదీ బౌలింగ్‌లో ఫోర్లు బాదడం చూసి... ఫుల్ జోష్ నిండింది..

36

అయితే వర్షం కారణంగా ఒక్క బంతి కూడా వేయకుండానే పాకిస్తాన్ ఇన్నింగ్స్ రద్దు కావడంతో జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్ చూసే అవకాశం దక్కలేదు. తాజాగా నేపాల్‌తో మ్యాచ్‌కి ముందు జస్ప్రిత్ బుమ్రా స్వదేశానికి వచ్చేశాడు. వ్యక్తిగత కారణాలతో బుమ్రా, ముంబైకి పయనం అయినట్టు సమాచారం..
 

46

జస్ప్రిత్ బుమ్రా వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వెళ్లినట్టు వార్తలు వచ్చినా, మరికొందరు మాత్రం అతను బ్యాటింగ్ చేసేటప్పుడు కాస్త ఇబ్బందిగా ఫీల్ అవ్వడంతోనే ఎన్‌సీఏలో ఫిజియోని కలిసేందుకు వెళ్తున్నాడని అంటున్నారు..

56

నేపాల్‌తో మ్యాచ్‌కి జస్ప్రిత్ బుమ్రా అందుబాటులో ఉండడం లేదు. అతని స్థానంలో మహ్మద్ షమీ ఆడబోతున్నాడు. మహ్మద్ షమీ, నేపాల్‌తో మ్యాచ్ ఆడడం ఖాయం కావడంతో ఈ బ్రేక్‌లో తన ఫ్యామిలీని చూసేందుకు బుమ్రా స్వదేశానికి వెళ్తున్నాడా? అనే అనుమానాలు కూడా రేగుతున్నాయి..

66

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో జస్ప్రిత్ బుమ్రా ఆడతాడని గంపెడంత ఆశలు పెట్టుకున్నారు టీమిండియా అభిమానులు. ఈ సమయంలో అతను షాక్ ఇస్తే మాత్రం అతను భారత జట్టుపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది.. 

click me!

Recommended Stories