మగబిడ్డకు జన్మనిచ్చిన బుమ్రా-సంజన దంపతులు.. ఇంటర్వ్యూతో పరిచయం, లవ్ స్టోరి ఇదే...

Published : Sep 04, 2023, 11:36 AM ISTUpdated : Sep 04, 2023, 11:38 AM IST

జస్ప్రీత్ బుమ్రా- సంజనా గణేశన్ దంపతులు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఈ సందర్భంలో.. ఈ జంట లవ్ స్టోరి నుంచి మ్యారేజ్‌  వరకు చోటుచేసుకున్న పరిణామాలను ఒకసారి పరిశీలిద్దాం. 

PREV
18
మగబిడ్డకు జన్మనిచ్చిన బుమ్రా-సంజన దంపతులు.. ఇంటర్వ్యూతో పరిచయం, లవ్ స్టోరి ఇదే...

టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కుటుంబంలో ఆనందం నెలకొంది. బుమ్రా- సంజనా గణేశన్ దంపతులు తల్లిదండ్రులయ్యారు. బుమ్రా సతీమణి సంజన్ ఈరోజు ఉదయం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన  బుమ్రా.. తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే తమ కుమారుడికి  అంగద్ జస్ప్రీత్ బుమ్రా అని పేరు కూడా పెట్టేశారు.
 

28

జస్ప్రీత్ బుమ్రా- సంజనా గణేశన్ దంపతులు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఈ సందర్భంలో.. ఈ జంట లవ్ స్టోరి నుంచి మ్యారేజ్‌  వరకు చోటుచేసుకున్న పరిణామాలను ఒకసారి పరిశీలిద్దాం. సంజన గణేశన్ 1991 మే6న జన్మించారు. ఆమె గ్రాడ్యుయేషన్ తర్వాత ఒక ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేరింది. 2012లో ఆమె ఫెమినా స్టైల్ దివా పోటీలో పాల్గొని ఫైనల్‌కు చేరుకుంది. 

38

ఇండియాలో స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా కూడా పనిచేసింది. అలాగే మోడల్‌గా కూడా రాణించింది. ఆమె భారతదేశంలోని వివిధ క్రీడా కార్యక్రమాలకు యాంకర్‌గా ఆమె లైమ్ లైట్‌లోకి వచ్చింది. ఇక, జస్ప్రీత్ బుమ్రా, సంజనా గణేశన్‌ల తొలి పరిచయం 2013లో జరిగింది. 

48

2013లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్‌లో బుమ్రాను సంజన ఇంటర్వ్యూ చేసిన సమయంలో వారు మొదటిసారి కలుసుకున్నారు. ఆ మొదటి సమావేశం తర్వాత వారు స్నేహితులుగా మారారు. సంజనా గణేశన్ 'ఫెమినా అఫీషియల్‌గా గార్జియస్' అవార్డు కూడా గెలుచుకున్నారు. ఇక, 2014లో సంజన.. సన్నీ లియోన్, నిఖిల్ చినపా హోస్ట్ చేసిన ఎంటీవీ స్ప్లిట్స్ విల్లా  సీజన్ 7లో పాల్గొన్నారు. 
 

58

ఆ తర్వాత జస్పీత్ బుమ్రా-సంజన గణేశన్‌ల మధ్య స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ‘నమన్‌’ అనే అవార్డు షో సందర్భంగా వీరిద్దరూ మరింత దగ్గరయ్యారు. ఆ తర్వాత పెళ్లికి ముందు వీరు కొన్నేళ్లు డేటింగ్‌లో ఉన్నారు. అయితే బుమ్రా-సంజనలు చాలాకాలం పాటు వారి ప్రేమ బంధం గురించి బయటకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు.  
 

68

ఇక, చివరకు జస్ప్రీత్ బుమ్రా, సంజనా గణేశన్‌లు 2021 మార్చి 15న వివాహ బంధంతో ఒక్కటయ్యారు.  గోవాలోని ఒక ప్రైవేట్ వేడుకలో వారి వివాహం జరిగింది. ఈ వేడుకకు అతికొద్ది మంది  బంధువులు, సన్నిహితులు మాత్రమే ఆహ్వానించారు. 

78

ఇదిలాఉంటే, నేడు( 2023 సెప్టెంబర్ 4) బుమ్రా-సంజన దంపతులు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన వేళ వారు తమ ఆనందాన్ని సోషల్ మీడియాలో వేదికగా పంచుకున్నారు. ‘‘మా చిన్న కుటుంబం పెరిగింది.. మా హృదయాలు మేము ఊహించిన దానికంటే నిండుగా ఉన్నాయి. ఈ ఉదయం మేము మా లిటిల్ బాయ్ అంగద్ జస్ప్రీత్ బుమ్రాను ప్రపంచంలోకి స్వాగతించాము. మేము చంద్రునిపై ఉన్నాము. మా జీవితంలోని ఈ కొత్త అధ్యాయం, దానితో పాటు తెచ్చే ప్రతిదాని కోసం వేచి ఉండలేము’’ జస్ప్రీత్ బుమ్రా- సంజన పేరుతో సందేశాన్ని బుమ్రా పోస్టు చేశారు. 

88

ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఆసియా కప్ కొనసాగుతుండగా.. తన భార్య ప్రసవం సమయంలో ఆమె వద్ద ఉండేందుకు బుమ్రా స్వదేశానికి తిరిగివచ్చారు. వ్యక్తిగత కారణాలతో బుమ్రా.. తన స్వస్థలం ముంబయికి వచ్చేసినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. దీంతో సోమవారం నేపాల్‌తో జరగనున్న మ్యాచుకు బుమ్రా దూరం కానున్నాడు. అయితే ఆసియా కప్ గ్రూప్-4 ప్రారంభ మ్యాచ్‌ల నాటికి బుమ్రా తిరిగి జట్టులో చేరతాడని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

click me!

Recommended Stories