బుమ్రా వచ్చాడు, టీమిండియా గెలిచింది... భారత బౌలింగ్ కష్టాలు తీరినట్టేనా...

First Published Sep 24, 2022, 2:19 PM IST

ఆసియా కప్ 2022 టోర్నీలో టీమిండియా ఎక్కువగా మిస్ అయ్యింది జస్ప్రిత్ బుమ్రానే. బుమ్రా గాయం కారణంగా టోర్నీకి దూరం కావడం, ఆవేశ్ ఖాన్, భువనేశ్వర్ కుమార్ పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వకపోవడం టీమిండియాపై తీవ్రంగా ప్రభావం చూపించింది. పాకిస్తాన్, శ్రీలంకలపై భారీ స్కోర్లు చేసినా ఆ లక్ష్యాలను కాపాడుకోలేక చిత్తుగా ఓడింది భారత జట్టు...

Jasprit Bumrah

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు జస్ప్రిత్ బుమ్రా గాయపడడం, భువనేశ్వర్ కుమార్ ఫామ్‌లో లేకపోవడంతో టీమిండియా ఫ్యాన్స్ తెగ కంగారు పడ్డారు. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కి జస్ప్రిత్ బుమ్రా ఎంపికైనా, తొలి టీ20 మ్యాచ్‌లో అతను ఆడలేదు...

Image credit: Getty

బుమ్రా పూర్తిగా గాయం తగ్గిందా? వరుస పరాజయాలతో బుమ్రా పూర్తిగా కోలుకోకపోయినా ఆడిస్తున్నారా? అనే అనుమానాలు రేగాయి. అయితే నాగ్‌పూర్‌లో జరిగిన రెండో టీ20లో ఈ అనుమానాలన్నింటికీ సమాధానాలు చెప్పేశాడు జస్ప్రిత్ బుమ్రా...

ఉమేశ్ యాదవ్ ప్లేస్‌లో తుది జట్టులోకి వచ్చిన జస్ప్రిత్ బుమ్రా 2 ఓవర్లు బౌలింగ్ చేసి 23 పరుగులు సమర్పించి ఓ వికెట్ తీశాడు. మ్యాచ్ 20 ఓవర్ల పాటు సాగి ఉంటే బుమ్రా తన రేంజ్ స్పెల్ వేశాడా? లేదా? అనే విషయంపై క్లారిటీ వచ్చేది. అయితే వర్షం కారణంగా ఆ అవకాశం దక్కలేదు...

అయితే 15 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 31 పరుగులు చేసిన ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ని అద్భుతమైన యార్కర్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు జస్ప్రిత్ బుమ్రా. బుమ్రా యార్కర్‌ని ఎదుర్కొవడానికి ప్రయత్నించి ఆరోన్ ఫించ్ దాదాపు కిందపడిపోయాడు. ఇన్నాళ్లుగా టీమిండియా మిస్ అయ్యింది ఏంటో అభిమానులకు రుచి చూపించాడు...

Jasprit Bumrah

అయితే జస్ప్రిత్ బుమ్రా పూర్తి ఫామ్‌లో ఉన్నాడా? పూర్తి ఫిట్‌గా ఉన్నాడా? అనే విషయాలు మాత్రం ఇప్పుడే ఖరారు చేయలేం. హైదరాబాద్‌ వేదికగా ఇరు జట్ల మధ్య జరిగే డిసైడర్ మ్యాచ్ టీమిండియాకి మాత్రమే కాదు, జస్ప్రిత్ బుమ్రాకి కూడా కీలకంగా మారనుంది..

bumrah

గాయం నుంచి కోలుకున్న తర్వాత హర్షల్ పటేల్ ఆడిన రెండు మ్యాచుల్లోనూ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. మొహాలీ టీ20లో 49 పరుగులు ఇచ్చిన హర్షల్ పటేల్, నాగ్‌పూర్‌లో జరిగిన రెండో టీ20లో 2 ఓవర్లలో 32 పరుగులు ఇచ్చాడు...

Bhuvi

వరుసగా ఫెయిల్ అవుతూ ఆఫ్ఘాన్‌పై అదరగొట్టిన భువనేశ్వర్ కుమార్‌, రెండో టీ20లో ఆడనే లేదు. దీంతో జస్ప్రిత్ బుమ్రా ఎంట్రీతో టీమిండియా గెలిచినా... భారత బౌలింగ్ కష్టాలు తీరాయా? లేదా? అనేది తేలాలంటే మాత్రం ఆఖరి టీ20 దాకా వేచి చూడాల్సిందే...

click me!