షాహీన్ బౌలింగ్‌కి రాగానే రోహిత్ శర్మ భయపడుతున్నాడు! షోయబ్ అక్తర్ కామెంట్స్..

Published : Sep 03, 2023, 06:06 PM IST

2021 టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్. షాహీన్ ఆఫ్రిదీ బౌలింగ్‌లో ఇన్నింగ్స్ మొదటి బంతికే గోల్డెన్ డకౌట్ అయ్యాడు రోహిత్ శర్మ. రెండేళ్ల తర్వాత జరిగిన ఆసియా కప్ మ్యాచ్‌లో షాహీన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు రోహిత్ శర్మ..

PREV
15
షాహీన్ బౌలింగ్‌కి రాగానే రోహిత్ శర్మ భయపడుతున్నాడు! షోయబ్ అక్తర్ కామెంట్స్..

‘కొత్త బంతితో స్వింగ్ చేస్తే త్వరగా వికెట్లు తీయవచ్చనేది మా ప్లాన్. విరాట్, రోహిత్ ఇద్దరి వికెట్లు చాలా కీలకం. నాకు ఇద్దరు బ్యాటర్లు ఒక్కటే. అయితే రోహిత్ శర్మ వికెట్ నా ఫెవరెట్. ఎందుకంటే అతని విషయంలో నా ప్లాన్ పక్కగా వర్కవుట్ అయ్యింది..’ అంటూ కామెంట్ చేశాడు షాహీన్ షా ఆఫ్రిదీ..
 

25
Rohit Sharma

‘షాహీన్ షా బౌలింగ్‌ని అర్థం చేసుకోవడానికి రోహిత్ శర్మ ప్రయత్నిస్తున్నట్టు కూడా నాకు అనిపించడం లేదు. రోహిత్ శర్మ అవుటైన విధానం చూస్తుంటే అతను షాహీన్ బౌలింగ్‌ని ఫేస్ చేయడానికి ఇబ్బంది పడడం కాదు, భయపడుతున్నట్టుగా ఉంది.. 

35
Rohit Sharma vs Shaheen Shah Afrid

రోహిత్ శర్మ చాలా బెటర్ ప్లేయర్. అతను ఇలా ఆడతాడని అస్సలు అనుకోలేదు. వన్డే వరల్డ్ కప్ వంట మెగా టోర్నీ ముందు రోహిత్ శర్మ ఇలాంటి వీక్‌నెస్ చూపిస్తే, మిగిలిన టీమ్స్‌కి హింట్ ఇచ్చినట్టు అవుతుంది..’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్..

45
Shaheen Afridi-Virat Kohli

‘పాకిస్తాన్‌ బౌలింగ్ అటాక్‌కి రోహిత్ శర్మ చాలా ఈజీ వికెట్‌గా మారాడు. గత రెండేళ్లుగా నాలుగు మ్యాచుల్లోనూ అతను త్వరగా అవుట్ అయ్యాడు. ఆరంభ ఓవర్లలో స్వింగ్ బాల్‌ని ఫేస్ చేయడానికి రోహిత్ శర్మ చాలా ఇబ్బంది పడుతున్నాడు..

55

అలాంటప్పుడు శుబ్‌మన్ గిల్‌తో కలిసి ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేస్తే బెటర్. రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ కూడా సెట్ అవుతుంది. రోహిత్ శర్మ వన్‌డౌన్‌లో వచ్చి, భయం లేకుండా ఆడొచ్చు..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్.. 

Read more Photos on
click me!

Recommended Stories