బుమ్రా, జడేజా లేరు! కొత్త ఛాంపియన్‌ని తయారుచేసేందుకు ఇదే అవకాశం...- రవిశాస్త్రి కామెంట్...

First Published Oct 7, 2022, 4:10 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో స్టార్ ప్లేయర్లు జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా లేకుండా బరిలో దిగుతోంది భారత జట్టు. గాయాలతో ఇద్దరు స్టార్ ప్లేయర్లు దూరం కావడంతో భారత జట్టుపై ఉన్న అంచనాలన్నీ తగ్గిపోయాయి. తాజాగా టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి దీనిపై కామెంట్ చేశాడు...

Image credit: Getty

స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా గాయంపై తీవ్రమైన హై డ్రామా నడిచింది. బుమ్రా గాయం పెద్దది కాదని, అతను టీ20 వరల్డ్ కప్‌లో ఆడతాడని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కామెంట్ చేశారు. అయితే చివరికి బుమ్రా గాయంతో పొట్టి ప్రపంచకప్‌కి దూరమయ్యాడు...

Image credit: Getty

‘క్రికెట్‌లో గాయాలు కావడం సర్వసాధారణం. ఎక్కువ మ్యాచులు ఆడుతున్నప్పుడు గాయపడే అవకాశాలు కూడా పెరుగుతాయి. అయితే ఒకరి గాయం, మరొకరికి అవకాశంగా మారుతుంటుంది. ఇప్పుడు జస్ప్రిత్ బుమ్రా లేని లోటు తీర్చాల్సిన ఓ బాధ్యత మరొకరిపై ఉంటుంది...

అలాగే వన్డే సిరీస్ గెలిచిన తర్వాత ట్రోఫీ తీసుకునే సమయంలో మరో షాంపైన్ బాటిల్‌ ఓపెన్ చేసి భారత కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మిగిలిన ప్లేయర్లను తడిపి వేశాడు రిషబ్ పంత్...

Image credit: Getty

భారత జట్టుకి పటిష్టమైన రిజర్వు బెంచ్ ఉంది. మంచి ప్లేయర్లు చాలామంది టీమిండియాలో చోటు కోసం ఎదురుచూస్తున్నారు. సెమీ ఫైనల్ దాకా వెళ్లగలిగితే ఆ తర్వాత ఏదైనా జరగొచ్చు... ఏ జట్టు టైటిల్ గెలుస్తుందో చెప్పలేం...

Jasprit Bumrah

టోర్నీని కరెక్టుగా మొదలెడితే, సెమీ ఫైనల్ చేరడం పెద్ద కష్టమేమీ కాదు. వరల్డ్ కప్ గెలవడానికి కావాల్సిన ప్లేయర్లు మన టీమ్‌లో ఉన్నారు. బుమ్రా, జడేజా లేకపోవచ్చు... అయితే ఇది ఓ కొత్త ఛాంపియన్‌ని తయారుచేయడానికి సరైన అవకాశం...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, మాజీ కోచ్ రవిశాస్త్రి...

click me!