కెఎల్ రాహుల్, టీమిండియాలో ఉండాలంటే ఐపీఎల్ నుంచి తప్పుకో! ఆడకపోతే పూజారానే తీసేశారు, నువ్వెంత?...

Published : Feb 20, 2023, 09:21 AM ISTUpdated : Feb 20, 2023, 04:45 PM IST

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి రెండు టెస్టుల్లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు కెఎల్ రాహుల్. బీభత్సమైన ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్‌ని, రిజర్వు బెంచ్‌లో కూర్చోబెడుతూ కెఎల్ రాహుల్‌ ఆడించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి...

PREV
16
కెఎల్ రాహుల్, టీమిండియాలో ఉండాలంటే ఐపీఎల్ నుంచి తప్పుకో! ఆడకపోతే పూజారానే తీసేశారు, నువ్వెంత?...
KL Rahul

న్యూజిలాండ్‌తో ఆడిన ఆఖరి టెస్టుల్లో 160 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్‌ని పక్కనబెట్టేసిన బీసీసీఐ, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కి సెలక్ట్ కూడా చేయలేదు. ఏడాదిన్నరగా టెస్టుల్లో అట్టర్ ఫ్లాప్ అవుతున్న కెఎల్ రాహుల్‌ని  తొలి రెండు టెస్టులు ఆడించిన టీమిండియా, చివరి రెండు టెస్టుల్లోనూ అతన్నే ఆడిస్తామని క్లారిటీ కూడా ఇచ్చేసింది..

26
KL Rahul


ఫామ్‌లో లేకపోయినా కెఎల్ రాహుల్ చివరి రెండు టెస్టులు కూడా ఆడతాడని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ స్పష్టం చేశాడు. టెస్టుల్లో వరుసగా ఫెయిల్ అవుతున్న రాహుల్‌పై మరోసారి ఫైర్ అయ్యాడు టీమిండియా మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్...

36
KL Rahul-Dravid

‘కొంతమంది కెఎల్ రాహుల్ అంటే నాకు ఇష్టం లేదని, మా ఇద్దరి మధ్య వ్యక్తిగత విభేదాలు ఉన్నాయని అనుకుంటున్నారు. అది నిజం కాదు. కెఎల్ రాహుల్‌కి మంచి జరగాలనే నేను కోరుకుంటున్నా. ఇలాంటి ఫామ్‌తో ఆడడం వల్ల ఆత్మవిశ్వాసం మరింత దెబ్బతింటుంది...

46

ఇప్పుడు కెఎల్ రాహుల్ ఫామ్‌లోకి రావాలంటే కౌంటీ క్రికెట్ ఆడడం ఒక్కటే మార్గం. రంజీ సీజన్ కూడా ముగిసిపోయింది. ఇంగ్లాండ్ వెళ్లి, కౌంటీల్లో ఆడి తిరిగి తన ప్లేస్‌ని సంపాదించుకోవాలి. పూజారా, టీమ్‌లో ప్లేస్ కోల్పోయిన తర్వాత ఇదే చేశాడు...

56
Cheteshwar Pujara

కెఎల్ రాహుల్‌కి, పూజారాకి ఉన్నంత అనుభవం అయితే లేదు కదా. పరుగులు చేయడం లేదని దాదాపు 100 టెస్టులు ఆడిన ఛతేశ్వర్ పూజారానే పక్కనబెట్టినప్పుడు, రాహుల్‌ని ఆడించడంలో అర్థం లేదు..

66

కెఎల్ రాహుల్ కావాలంటే ఐపీఎల్ నుంచి తప్పుకోవాలి. ఐపీఎల్ ఆడడం కంటే టీమిండియాకి ఆడడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వగలడా?.. ఈ విషయంలో ఆన్సర్ అందరికీ తెలుసు...’అంటూ వరుస ట్వీట్లు చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్..

click me!

Recommended Stories