బుమ్రా వస్తున్నాడు!.. బాగా బౌలింగ్ వేసిన అతన్ని తప్పించబోతున్న టీమిండియా...

Published : Sep 23, 2022, 01:51 PM IST

ఆసియా కప్ 2022 టోర్నీలో భారత స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రాని బాగా మిస్ అయ్యింది టీమిండియా. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో డెత్ ఓవర్ స్పెషలిస్ట్ బౌలర్ అయిన బుమ్రా లేక సూపర్ 4 స్టేజీకే పరిమతమైంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లోనూ మొదటి మ్యాచ్‌లో భారత జట్టును పరాజయమే పలకరించింది...

PREV
17
బుమ్రా వస్తున్నాడు!.. బాగా బౌలింగ్ వేసిన అతన్ని తప్పించబోతున్న టీమిండియా...
bumrah

గాయంతో ఆసియా కప్ 2022 టోర్నీకి దూరమైన జస్ప్రిత్ బుమ్రా, పూర్తిగా కోలుకోకపోవడంతో మొహాలీలో జరిగిన మొదటి టీ20లో ఆడలేదు. రెండో టీ20లో బుమ్రా బరిలో దిగబోతున్నాడని స్పష్టం చేశాడు టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్..

27
Jasprit Bumrah

‘నిజానికి జస్ప్రిత్ బుమ్రా ఫిట్‌గా ఉన్నాడా? లేదా? అనేది నాకు తెలీదు. అది నా డిపార్ట్‌మెంట్ కూడా కాదు. ఇలాంటి విషయాలు మీరు నన్ను అడగకూడదు, నేను చెప్పకూడదు. ఫిజియో, టీమ్ మేనేజ్‌మెంట్ ఈ ప్రశ్నలకు సమాధానాలు చెబుతారు...

37

అయితే టీమ్ వరకూ అయితే అందరూ మంచి వాతావరణంలోనే ఉన్నారు. ఫస్ట్ క్లాస్ ఫిట్‌గా ఉన్నారు. రెండో టీ20 మ్యాచ్‌కి సిద్ధమవుతున్నారు. బుమ్రా కూడా రెఢీగా ఉన్నాడు. అతని విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదు...

47

మొదటి మ్యాచ్ ముగిసిన తర్వాత టీమ్ మీటింగ్ జరగలేదు. ఎందుకు ఓడిపోయాం, ఎక్కడ తప్పు జరిగిందనే విషయాల గురించి చర్చ జరగలేదు. అయితే మొదటి టీ20 ఎంత సుదీర్ఘంగా సాగిందో మీకు తెలుసు...
 

57

వాతావరణంలో తేమ కూడా వారికి బాగా అనుకూలించింది. పిచ్ కూడా బ్యాటింగ్‌కి అనుకూలించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లకు కూడా క్రెడిట్ ఇవ్వాలి. వాళ్లు పరిస్థితులను చక్కగా వాడుకున్నారు...

67
Harshal Patel

హర్షల్ పటేల్ గాయం నుంచి కోలుకుని వస్తున్నాడు. వెంటనే మునుపటి రిథమ్‌ని అందుకోవడానికి కాస్త సమయం పడుతుంది. అతను టీమిండియాకి కీ ప్లేయర్... త్వరలోనే కమ్‌బ్యాక్ ఇస్తాడు.’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్..

77
Image credit: Getty

జస్ప్రిత్ బుమ్రా రీఎంట్రీ ఇవ్వడం కన్ఫార్మ్ కాగా అతను ఎవరు ప్లేస్‌లో ఆడతాడనేది ఆసక్తికరంగా మారింది. షమీ ప్లేస్‌లో మొదటి టీ20 ఆడి 2 వికెట్లు తీసిన ఉమేశ్ యాదవ్ స్థానంలో జస్ప్రిత్ బుమ్రా తుదిజట్టులోకి రాబోతున్నాడని సమాచారం...

click me!

Recommended Stories