హర్షల్ పటేల్ మంచి బౌలరే కానీ... సంజయ్ మంజ్రేకర్ షాకింగ్ కామెంట్స్..

First Published Sep 23, 2022, 1:04 PM IST

ఐపీఎల్ 2021 సీజన్ పర్ఫామెన్స్ కారణంగా 30+ వయసులో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు హర్షల్ పటేల్. ఆర్‌సీబీ తరుపున ఒకే సీజన్‌లో 32 వికెట్లు తీసి, బ్రావో రికార్డును సమం చేసిన హర్షల్ పటేల్, టీమిండియాకి ప్రధాన బౌలర్‌గా మారిపోయాడు. అయితే అతని నుంచి నిలకడైన పర్ఫామెన్స్ అయితే రావడం లేదు...

Harshal Patel

ఆసియా కప్ 2022 టోర్నీకి ముందు గాయపడిన హర్షల్ పటేల్, భారత జట్టుకి రెండు నెలల పాటు దూరమయ్యాడు. జస్ప్రిత్ బుమ్రా, హర్షల్ పటేల్ లేకుండా బరిలో దిగిన భారత జట్టు, మొదటి రెండు మ్యాచుల్లో గెలిచినా ఆ తర్వాత రెండు మ్యాచుల్లో చిత్తుగా ఓడింది...

Image credit: PTI

ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో హర్షల్ పటేల్, జస్ప్రిత్ బుమ్రాలకు చోటు దక్కింది. గాయం నుంచి కోలుకున్న హర్షల్ పటేల్, మొహాలీలో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు..

భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ 52 పరుగులు సమర్పించగా హర్షల్ పటేల్ కూడా తక్కువ కాదన్నట్టు 49 పరుగులు సమర్పించాడు. వీళ్లిద్దరూ కలిసి ఆస్ట్రేలియాకి దాదాపు సగం టార్గెట్‌ని ఇచ్చేశారు....

‘హర్షల్ పటేల్‌ని రెండేళ్లుగా చూస్తున్నాం. అతను ఐపీఎల్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడు. పిచ్‌ బౌలర్లకు సహకరించనప్పుడు హర్షల్ పటేల్ అద్భుతంగా రాణిస్తాడు. స్లో బాల్స్ వేస్తూ, బ్యాటర్లను ముప్పు తిప్పలు పెడతాడు...

Harshal Patel

అయితే ఇంతకుముందు హర్షల్ పటేల్ వేసే స్లో బాల్స్ 120 కి.మీ.లకు తగ్గకుండా ఉండేవి. అంటే బంతి పేస్ భారీగా తగ్గేది కాదు. అయితే పిచ్ బౌలర్లకు అనుకూలిస్తేనే అసలు సమస్య.  పిచ్ ఫ్లాట్‌గా ఉండి బౌన్సర్లకు, పేసర్లకు అనుకూలిస్తే... హర్షల్ పటేల్ తేలిపోతాడు...

ఆస్ట్రేలియాలో పిచ్‌లు ఇలాగే ఉంటాడు. అక్కడ అన్నీ బౌన్సీ పిచ్‌లే. ఆస్ట్రేలయాలోని పిచ్‌ల మీద హర్షల్ పటేల్ ఎలా రాణించగలడనేది సెలక్టర్లకే తెలియాలి. హర్షల్ పటేల్ పర్ఫామెన్స్ ఆధారంగా అతన్ని ఎంపిక చేయడంలో తప్పులేదు..

Harshal Patel

అయితే ఓ ప్లేయర్‌ని ఎంపిక చేసేటప్పుడు అతని బలాలు, బలహీనతలను గణించాలి. ఆస్ట్రేలియాలో ఆ ప్లేయర్ జట్టుకి ఎలా ఉపయోగపడతాడో, అక్కడి పిచ్‌ల మీద ఎలా రాణించగలడో బేరీజు వేసుకోవాలి... అలా చూసుకుంటే ఆసీస్ పిచ్‌పైన హర్షల్ పటేల్ స్కిల్స్‌కి అగ్ని పరీక్షే..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్.. 

click me!