లార్డ్స్‌లో అశ్విన్‌ని ఆడించకపోవడం చాలా పెద్ద పొరపాటు... ఆకాశ్ చోప్రా కామెంట్...

First Published Aug 14, 2021, 6:15 PM IST

మంచి ఫామ్‌లో ఉన్న స్టార్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్‌ని పక్కనబెట్టి, వరుసగా రెండో మ్యాచ్‌లో బరిలో దిగింది టీమిండియా. అశ్విన్ లేకపోవడంతో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌కి భారీ స్కోరు అందించిన టీమిండియా, రెండో టెస్టులోనూ అతన్ని పక్కనబెట్టడం హాట్ టాపిక్ అయ్యింది...

మొదటి టెస్టులో జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్‌లతో పాటు శార్దూల్ ఠాకూర్‌తో బరిలో దిగిన టీమిండియా... రెండో టెస్టులో గాయపడిన శార్దూల్ ఠాకూర్ స్థానంలో ఇషాంత్ శర్మకు చోటు ఇచ్చింది. 

స్పిన్ ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజాకి తుదిజట్టులో చోటు కల్పించిన భారత జట్టు... టెస్టుల్లో నాలుగు సెంచరీలు, 400+ వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్‌ని పక్కనబెట్టడం హాట్ టాపిక్ అయ్యింది...

‘నిజం చెప్పాలంటే... నలుగురు ఫాస్ట్ బౌలర్లతో బరిలో దిగడం కరెక్ట్ నిర్ణయం కాదు. మహ్మద్ షమీ, సిరాజ్, బుమ్రా, ఇషాంత్ పెద్దగా బ్యాటింగ్ చేయలేరు... శార్దూల్ గాయపడిన తర్వాత బ్యాటింగ్ చేయగల అశ్విన్‌కి చోటు ఇవ్వాల్సింది...

అలాగే రవిచంద్రన్ అశ్విన్‌కి తుదిజట్టులో చోటు ఇచ్చి ఉంటే... వికెట్లు తీయడంలోనూ భారత జట్టుకి సహాయపడేవాడు. 

లార్డ్స్‌ పిచ్ నెమ్మదిస్తోంది.... ఫాస్ట్ బౌలర్లకు సహకరించని లార్డ్స్‌లో అశ్విన్ ఆడి ఉంటే... భారత్‌కి అనుకూల ఫలితాలు వచ్చేవి...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా...

రవిచంద్రన్ అశ్విన్ లాంటి మ్యాజిక్ స్పిన్నర్ లేకపోవడంతో తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన జో రూట్... రెండో టెస్టులోనూ అదరగొడుతున్నాడు...

click me!