ఆ ఇద్దరూ వరల్డ్ క్లాస్ ప్లేయర్లు, త్వరలోనే ఫామ్‌లోకి వస్తారు... కెఎల్ రాహుల్ కామెంట్...

First Published Aug 14, 2021, 7:06 PM IST

ఇంగ్లాండ్ టూర్‌లో టీమిండియాను కలవరబెడుతున్న అంశం... ఛతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ, అజింకా రహానే ఫామ్... టీమిండియాకి బలంగా మారాల్సిన ఈ ముగ్గురూ... పూర్ ఫామ్‌తో భారంగా మారుతున్నారు...

2021లో ఛతేశ్వర్ పూజారా 27.78 సగటుతో పరుగులు సాధిస్తే... అజింకా రహానే 19.21 సగటుతో పరుగులు చేశాడు. గత ఏడాది రహానే 38.85 సగటుతో వెయ్యికి పైగా పరుగులు చేస్తే, పూజారా మాత్రం 20.37 సగటుతో పరుగులు చేశాడు...

భారత సారథి విరాట్ కోహ్లీ సగటు కూడా ఈ ఏడాది... ఈ ఇద్దరికంటే మెరుగ్గా ఏమీ లేదు. అయితే రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 42 పరుగులు చేసి ఫామ్‌లోకి వచ్చినట్టే కనిపించాడు విరాట్ కోహ్లీ...  వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ మ్యాచ్‌లో విఫలమైన పూజారా, రహానే, కోహ్లీ... అదే ఫామ్‌ను కొనసాగిస్తున్నారు...

ఇంగ్లాండ్ టూర్‌లో మూడు ఇన్నింగ్స్‌ల్లో పూజారా 4, 12, 9 పరుగులతో తీవ్రంగా నిరాశపరిస్తే... అజింకా రహానే రెండు ఇన్నింగ్స్‌ల్లో 5, 1 పరుగులతో దారుణంగా విఫలమయ్యాడు... అయితే ఈ ఇద్దరూ ఫామ్‌లోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు కెఎల్ రాహుల్...

‘భారత జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో చాలాసార్లు ఆదుకున్నారు పూజారా, అజింకా రహానే... ఈ ఇద్దరూ వరల్డ్ క్లాస్ ప్లేయర్లు, ఎంతో అనుభవం ఉన్నవాళ్లు...

కొన్ని ఇన్నింగ్స్‌ల ఫెయిల్యూర్ తర్వాత అద్భుతంగా కమ్‌బ్యాక్ ఇవ్వడం ఎలాగో వారికి బాగా తెలుసు... ఇంగ్లాండ్‌లో పరిస్థితులకు తగ్గట్టుగా రాణించడం అంత ఈజీ కాదనే విషయం గుర్తించుకోవాలి...

ఇంగ్లాండ్‌లో ప్రతీ ఇన్నింగ్స్‌లో పరుగులు చేయడం కుదరదు. క్రీజులో కుదురుకున్న తర్వాత అవుట్ అయినప్పుడు నాకు కూడా చాలా ఫ్రస్టేషన్ వస్తూ ఉంటుంది... టెస్టు ఫార్మాట్‌ అంటే నాకు బాగా ఇష్టం..

గత రెండేళ్లుగా టెస్టుల్లో తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోవడంతో చాలా ఫీలయ్యాను. అయితే కొన్నిసార్లు పరిస్థితులు మన చేతుల్లో ఉండవు. లార్డ్స్‌లో సెంచరీ చేయడం చాలా మధురమైన అనుభూతి...’ అంటూ చెప్పుకొచ్చాడు కెఎల్ రాహుల్...

click me!