Mahela Jayewardene: ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్న మహేళ జయవర్దెనె తాను అంతర్జాతీయ క్రికెట్ ఆడినప్పుడు వందల మంది బౌలర్లను ధీటుగా ఎదుర్కున్నాడు. కానీ..
ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేళ జయవర్దెనె క్రికెట్ ఆడిన రోజుల్లో అతడిని ఔట్ చేయడం బౌలర్లకు సవాలుతో కూడుకున్నదే. ముఖ్యంగా టెస్టులలో అతడు బౌలర్లకు కొరకరాని కొయ్య గా ఉండేవాడు. అలాంటిది అతడు కూడా పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ ను చూడగానే జడుసుకునేవాడట.
27
పాక్ దిగ్గజ పేసర్, ఆ జట్టు మాజీ సారథి వసీం అక్రమ్ బౌలింగ్ ను ఎదుర్కోవడం తనకు చాలా కష్టమైందని.. అతడి వల్ల ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపానని అన్నాడు. ఐసీసీ నిర్వహిస్తున్న ఐసీసీ రివ్యూ కార్యక్రమంలో మహేళ ఈ వ్యాఖ్యలు చేశాడు.
37
ప్రముఖ ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ ఇషా గుప్తా హోస్ట్ గా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో ఆమె మహేళను మీరు ఎదుర్కున్న బౌలర్లలో బెస్ట్ బౌలర్ ఎవరు..? అని అడగ్గా జయవర్దనె మాట్లాడుతూ.. ‘డౌటే లేదు. వసీం అక్రమ్. నేను అప్పుడే శ్రీలంక తరఫున అంతర్జాతీయ మ్యాచులు ఆడుతున్న రోజులవి..
47
కానీ అప్పటికే అక్రమ్ తన కెరీర్ లో పీక్స్ లో ఉన్నాడు. అక్రమ్ ను ఎదుర్కోవడం నాకు ఎప్పుడూ సవాల్ గానే ఉండేది. అతడి బౌలింగ్ అంటేనే నాకు ఓ పీడకలగా మారింది.
57
ఎందుకంటే కొత్త బంతితో అక్రమ్ ను ఎదుర్కోవడం అంటే మాములు విషయం కాదు. ఫార్మాట్ ఏదైనా సరే అతడు ప్రత్యర్థులపై చెలాయించే ఆధిపత్యం మాములుగా ఉండదు. ఆట మొదలుపెట్టినప్పటి బంతి నుంచి చివరి బంతి వరకూ అతడు ఒకే రకమైన వేగంతో బంతులు విసిరేవాడు.. నేను ఎదుర్కున్న బౌలర్లలో అత్యుత్తమ బౌలర్ అతడే..’ అని చెప్పాడు.
67
wasim akram 1992 world cup
ఈ మాజీ పాకిస్తాన్ పేసర్ తన కెరీర్ లో 916 వికెట్లు పడగొట్టాడు. 104 టెస్టులాడిన అక్రమ్.. 414 వికెట్లు తీశాడు. ఇక 356 వన్డేలు ఆడిన అతడు.. ఏకంగా 502 వికెట్లు తీశాడు.
77
శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ తన రికార్డును బద్దలు కొట్టేదాకా వన్డేలలో అక్రమ్ లీడింగ్ వికెట్ టేకర్ గా ఉన్నాడు. మురళీధరన్ తన కెరీర్ లో 1,334 వికెట్లు తీశాడు. 133 టెస్టులలో 800 వికెట్లు, 350 వన్డేలలో 534 వికెట్లతో ఎవరికీ అందనంత దూరంలో నిలిచాడు.