వాళ్లు లేకపోతే నేను టీమిండియాకి ఆడేవాడిని కాదు... మహేంద్ర సింగ్ ధోనీ కామెంట్...

First Published Jun 2, 2022, 3:16 PM IST

టీమిండియాలోకి ఓ సంచలనంలా ఎంట్రీ ఇచ్చి, అనుకోకుండా కెప్టెన్‌గా మారి... మూడు ఐసీసీ టైటిల్స్‌తో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు మహేంద్ర సింగ్ ధోనీ... అయితే మాహీ ఎప్పుడూ సక్సెస్ క్రెడిట్ ఎవ్వరికీ ఇచ్చింది లేదు. అయితే తాజాగా తమిళనాడులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మాహీ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు..

Image credit: Instagram

తమిళనాడులోని తిరువల్లూర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ (టీడీసీఏ) సిల్వర్ జూబ్లీ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ... ఈ సందర్భంగా మాహీ మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు.

‘నేను ఓ జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెలబ్రేషన్స్‌కి రావడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా నేను, నా జిల్లా క్రికెట్ అసోసియేషన్ రాంఛీకి ధన్యవాదాలు తెలపాలని అనుకుంటున్నా...

Latest Videos


క్రికెటర్లు తమ సొంత జిల్లాల తరుపున ఆడడాన్ని గర్వంగా భావించాలి. నేను కూడా అందుకే రాంఛీ క్రికెట్ అసోసియేషన్ తరుపున ఆడినందుకు గర్వపడుతున్నా. ఎందుకంటే నా జిల్లాకు ఆడకపోతే దేశానికి ఆడే వాడిని కాదు కదా...

నా స్కూల్‌కి, నా జిల్లాకి ఆడడం వల్లే నా దేశానికి ఆడే అవకాశం దక్కింది. అందుకే వాళ్లు లేకపోతే ఇప్పుడు నేను ఈ పొజిషన్‌లో ఉండేవాడిని కాదు...’ అంటూ కామెంట్ చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ.. 

2004లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఎమ్మెస్ ధోనీ, వైజాగ్‌లో పాకిస్తాన్‌పై సెంచరీతో వెలుగులోకి వచ్చాడు. 2007 టీ20 వరల్డ్ కప్‌ సమయంలో టీమిండియా కెప్టెన్‌గా మారిన ఎమ్మెస్ ధోనీ, మొట్టమొదటి పొట్టి ప్రపంచకప్‌తో పాటు 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలను గెలిచాడు.

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా నాలుగు సార్లు టైటిల్ గెలిచిన మహేంద్ర సింగ్ ధోనీ, తమిళనాడు జనాలకు చేరువయ్యాడు... 

మాహీతో పాటు ఐసీసీ మాజీ అధ్యక్షుడు, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ ఎన్ శ్రీనివాసన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

click me!