అండర్సన్ కు జ్ఞానోదయం అయినందుకు సంతోషంగా ఉంది.. జడ్డూతో మాములుగా ఉండదు మరి..

Published : Jul 03, 2022, 02:39 PM IST

ENG vs IND: టీమిండియా  ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఇంగ్లండ్ తో జరుగుతున్న ఐదో టెస్టులో  సెంచరీ చేసి భారత్ భారీ స్కోరు సాధించడంలో బాటలు వేశాడు. అయితే అతడు తాజాగా ఇంగ్లాండ్ స్టార్ పేసర్.. 

PREV
17
అండర్సన్ కు జ్ఞానోదయం అయినందుకు సంతోషంగా ఉంది.. జడ్డూతో మాములుగా ఉండదు మరి..
Image credit: Getty

ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు ఎడ్జబాస్టన్ వేదికగా జరుగుతున్న రీషెడ్యూల్డ్ టెస్ట్ లో ఆధిక్యంలో కొనసాగుతున్నది. రెండు రోజుల ఆట ముగిసే సమయానికి భారత్ దే ఆధిక్యం. అయితే తొలి రోజు ఆటలో రిషభ్ పంత్ తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడిన రవీంద్ర జడేజా తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

27

ఇంగ్లాండ్  వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ కు జ్ఞానోదయం అయినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని జడ్డూ కామెంట్స్ చేశాడు. తద్వారా  2014లో తనపై దురుసుగా ప్రవర్తించిన  అండర్సన్ పై ప్రతీకారం తీర్చుకున్నాడు. 

37

2014లో ఏం జరిగిందంటే.. ఆ ఏడాదిలో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లింది భారత జట్టు. తొలి టెస్టులో భాగంగా డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్తున్న రవీంద్ర జడేజా ను తోసేస్తూ దురుసుగా ప్రవర్తించాడు అండర్సన్. ఈ వ్యవహారంలో జడేజాది తప్పేమీ లేకపోయినా అండర్సన్ అతి చేశాడు. 

47

అప్పట్లో  ఇది వివాదాస్పదమైంది.  అండర్సన్ పై ఐసీసీ లెవల్ 3  నేరం కింద తగిన చర్య తీసుకుంది. అయితే అదే అండర్సన్.. తాజాగా  రవీంద్ర జడేజా ఎడ్జబాస్టన్ టెస్టులో సెంచరీ చేయడం పై మాట్లాడుతూ.. అతడిపై ప్రశంసలు కురిపించాడు. 

57

‘జడేజా గతంలో 8వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చేవాడు. టెయిలెండర్ గా  వచ్చే బ్యాటర్ కు భారీ ఇన్నింగ్స్ ఆడే అవకాశం చాలా తక్కువ. కానీ ఇప్పుడు జడేజా ఏడో స్థానంలో బ్యాటింగ్ కు వస్తున్నాడు. ఇప్పుడతడు ఒక నిష్ణాతుడైన బ్యాటర్ గా ఆడుతున్నాడు.  జడేజా బ్యాటింగ్ వల్ల మా జట్టుకు కష్టాలు తప్పేలా లేవు. అతడు మాకు చాలా సవాళ్లు విసిరాడు..’ అని అన్నాడు. 

67

ఇక అండర్సన్ పై విధంగా అన్నాడని రెండో రోజు ఆట అనంతరం విలేకరులు జడేజా దగ్గర  ప్రస్తావించారు. దీనికి జడ్డూ సమాధానమిస్తూ.. ‘మీరు పరుగులు చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ  ప్రొఫెషనల్ బ్యాటర్ గానే ఫీలవుతారు.

77

 నేను క్రీజులోకి వచ్చిన ప్రతిసారి  నా బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నిస్తా. భాగస్వామ్యాలను నెలకొల్పేందుకు నా వంతు కృషి చేస్తా..  ఇక 2014 తర్వాత అండర్సన్ రియలైజ్ కావడం  సంతోషంగా ఉంది..’ అని అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. 

Read more Photos on
click me!

Recommended Stories