జహీర్ ఖాన్ చెప్పడం వల్లే నేను ఓపెనర్‌గా మారా!... టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్...

First Published Aug 19, 2022, 3:01 PM IST

టెస్టులను వన్డేల్లా, వన్డేలను టీ20ల్లా ఆడడం వీరేంద్ర సెహ్వాగ్ స్పెషాలిటీ. ఆరంభంలో దూకుడుగా ఆడిన సచిన్ టెండూల్కర్, ఓ వయసొచ్చిన తర్వాత నెమ్మదిగా ఇన్నింగ్స్ నిలబెట్టేందుకు సమయం తీసుకునేవాడు. అయితే కెరీర్ ఆసాంతం వీరేంద్ర సెహ్వాగ్.. దూకుడే మంత్రంగా బ్యాటింగ్ చేశాడు...

Sehwag-Ganguly

సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ వంటి క్రికెటర్లు 90+ దాటిన తర్వాత సెంచరీ పూర్తి చేసుకోవడానికి నెమ్మదిగా ఆడేవాళ్లు. వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం 94 పరుగుల వద్ద ఉన్నప్పుడు సిక్సర్ కొట్టి, సెంచరీ మార్కు అందుకునేవాడు...

Virender Sehwag

వీరబాదుడు వీరేంద్ర సెహ్వాగ్‌గా గుర్తింపు తెచ్చుకున్న వీరూ కూడా రోహిత్ శర్మ మాదిరిగానే తొలుత మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా టీమిండియాలోకి వచ్చాడు. ఆ తర్వాత గంగూలీ ప్రోత్సాహంతో ఓపెనర్‌గా మారి, సచిన్ టెండూల్కర్‌తో కలిసి మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఓపెనర్‌గా రికార్డులు క్రియేట్ చేశాడు...

Virender Sehwag

టీమిండియా తరుపున రెండు త్రిబుల్ సెంచరీలు బాదిన ఏకైక క్రికెటర్‌గా నిలిచిన వీరేంద్ర సెహ్వాగ్, 104 టెస్టుల్లో 49.3 సగటుతో 8586 పరుగులు చేశాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో వీరూ స్ట్రైయిక్ రేటు 82.2గా ఉండగా వన్డేల్లో 104.3గా ఉంది...

Virender Sehwag

50 ఓవర్ల ఫార్మాట్‌లో 251 మ్యాచులు ఆడిన వీరేంద్ర సెహ్వాగ్ 35 సగటుతో 8273 పరుగులు చేశాడు. సచిన్ టెండూల్కర్ తర్వాత వన్డేల్లో డబుల్ సెంచరీ బాదిన రెండో క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు వీరేంద్ర సెహ్వాగ్...

ఆసియా కప్ 2022 ఆరంభానికి ముందు భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌, పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కలిస స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన ఓ స్పెషల్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు వీరూ...

‘వాస్తవానికి నన్ను ఓపెనర్‌గా పంపాలనే ఐడియా జహీర్ ఖాన్‌ది. 1999లో నేను మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌ని. మొట్టమొదటిసారి నిన్ను (షోయబ్ అక్తర్‌ని) ఫేస్ చేసినప్పుడు కూడా నేను మిడిల్ ఆర్డర్‌లోనే బ్యాటింగ్‌కి వచ్చా...

నా బ్యాటింగ్ స్టైల్ చూసిన జహీర్ ఖాన్, ఓపెనర్‌గా సెట్ అవుతానని సౌరవ్ గంగూలీకి సలహా ఇచ్చాడు. గంగూలీ కూడా ఆ సలహాని గౌరవించి, ఓపెనర్‌గా పంపాడు. ఆ పొజిషన్‌లో సక్సెస్ అయ్యా...’ అంటూ కామెంట్ చేశాడు వీరేంద్ర సెహ్వాగ్...

click me!