బుచ్చిబాబు టోర్నీలో సూప‌ర్ సెంచ‌రీతో అద‌ర‌గొట్టిన ఇషాన్ కిష‌న్..

First Published | Aug 17, 2024, 6:33 PM IST

Ishan Kishan :  బుచ్చి బాబు టోర్నమెంట్‌లో ఇషాన్ కిషన్ సూప‌ర్ సెంచ‌రీతో అద‌ర‌గొట్టాడు. కేవ‌లం 86 బంతుల్లోనే సెంచ‌రీ సాధించి త‌న జ‌ట్టును ప‌టిష్ఠ స్థితిలో ఉంచాడు.
 

Ishan Kishan

Ishan Kishan : టీమిండియా ప్లేయ‌ర్ ఇషాన్ కిష‌న్ బుచ్చిబాబు టోర్నీలో అద్భుత‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. సూప‌ర్ సెంచ‌రీతో త‌ను పున‌రాగ‌మ‌నం అద్భుతంగా ప్రారంభించాడు. మ‌ధ్యప్రదేశ్ తో జ‌రిగిన మ్యాచ్ లో 114 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. 

Ishan Kishan super century His Red-Ball Return With 86-Ball Century In Buchi Babu Tournament

టీమ్ ఇండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ మధ్యప్రదేశ్‌పై దేశవాళీ టోర్నమెంట్ బుచ్చిబాబు ట్రోఫీలో సెంచరీతో తిరిగి జ‌ట్టులోకి వ‌స్తానంటూ సూచ‌న‌లు పంపాడు. దాదాపు 8 నెలల పాటు ఇషాన్ భార‌త‌ జట్టుకు దూరంగా ఉన్నాడు.


Ishan Kishan super century His Red-Ball Return With 86-Ball Century In Buchi Babu Tournament

గతేడాది డిసెంబ‌ర్ లో దక్షిణాఫ్రికా టూర్‌ను మధ్యలోనే వదిలేసి విశ్రాంతి తీసుకున్నాడు. ఈ పర్యటనలో అతనికి టీ20, టెస్టు జట్టులో చోటు కల్పించారు. అయితే, టీ20 మ్యాచ్ ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం రాలేదు. ఇక వ‌న్డే జ‌ట్టులో చోటుద‌క్క‌లేదు. అయితే, టెస్టు జ‌ట్టులో భాగంగా ఉన్న‌ప్ప‌టికీ ఈ సిరీస్ ప్రారంభం కాకముందే భార‌త్ కు తిరిగి వ‌చ్చాడు.

Ishan Kishan super century His Red-Ball Return With 86-Ball Century In Buchi Babu Tournament

అత‌ని వ్య‌వ‌హారంపై ఆగ్ర‌హించిన బీసీసీఐ అప్ప‌టి నుంచి భార‌త జ‌ట్టులో చోటు క‌ల్పించ‌లేదు. ఇప్పుడు బుచ్చిబాబు టోర్నీలో జార్ఖండ్‌కు ఇషాన్ కిష‌న్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 107 బంతుల్లో 10 సిక్సర్లు, 5 ఫోర్లతో 114 పరుగులు చేశాడు. ఇషాన్ 92 పరుగుల స్కోరు వద్ద బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వరుసగా రెండు సిక్సర్లు కొట్టి సెంచరీ పూర్తి చేశాడు.

Ishan Kishan super century His Red-Ball Return With 86-Ball Century In Buchi Babu Tournament

మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో జార్ఖండ్ 108 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఇషాన్ కిషన్ క్రీజులోకి వచ్చేసరికి అతని జట్టు జార్ఖండ్ 113 పరుగులు వెనుకబడి ఉంది. అయితే, ఇషాన్ కిష‌న్ త‌న సెంచ‌రీ ఇన్నింగ్స్ తో జార్ఖండ్‌ను పటిష్ట స్థితిలో నిలిపాడు.  ఇషాన్ 61 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేయ‌గా, ఆ త‌ర్వాత కేవలం 37 బంతుల్లోనే త‌ర్వాతి 50 పరుగులు పూర్తి చేశాడు. 

Latest Videos

click me!