టెండూల్కర్‌ని ఇంటికెళ్లి పాలు తాగమని వెక్కిరించిన పాక్ క్రికెటర్లు... 16 ఏళ్ల వయసులో సచిన్ బ్యాటింగ్‌కి...

Published : Oct 10, 2022, 02:16 PM ISTUpdated : Oct 10, 2022, 02:20 PM IST

దిగ్గజాలుగా కీర్తిప్రతిష్టలు సంపాదించిన ప్రతీ ఒక్కరూ కెరీర్ ఆరంభంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నవారే. క్రికెట్ ప్రపంచంలో ఆల్‌టైం గ్రేట్ క్రికెటర్లలో ఒకడిగా నిలిచిన భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా తన క్రీడా ప్రస్తానంలో ఎన్నో అవమానాలను ఫేస్ చేశాడు. 16 ఏళ్ల వయసులో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన మాస్టర్, టీనేజ్ వయసులోనే స్టార్ స్టేటస్‌ని మోశాడు.. 

PREV
18
టెండూల్కర్‌ని ఇంటికెళ్లి పాలు తాగమని వెక్కిరించిన పాక్ క్రికెటర్లు... 16 ఏళ్ల వయసులో సచిన్ బ్యాటింగ్‌కి...

పాకిస్థాన్ జరిగిన టెస్టు మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ ముక్కుకు బౌన్సర్ బలంగా తగలడంతో గాయమైంది. దాంతో ‘పిల్లోడా ఇంటికెళ్లి పాలు తాగి రా...’ అంటూ కామెంట్ చేశారు పాక్ క్రికెటర్లు. అయితే బ్యాండేజ్ వేసుకుని బ్యాటింగ్ చేసిన 16 ఏళ్ల సచిన్ టెండూల్కర్, టాప్ క్లాస్ పాక్ ఫాస్ట్ బౌలింగ్‌ని యూనిట్‌ని ఎదుర్కొంటూ 57 పరుగులు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

28

1990లో న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు సచిన్ టెండూల్కర్. దీంతో అందరూ అతన్ని ‘స్కూల్ బాయ్’ అంటూ హేళన చేస్తూ, తిట్టడం మొదలెట్టారు. అయితే వాటిని పట్టించుకోని సచిన్ టెండూల్కర్, తర్వాతి టెస్టులో 88 పరుగులు చేశాడు.
 

38

సచిన్ టెండూల్కర్ 88 పరుగుల వద్ద ఉన్నప్పుడు క్యాచ్ పట్టి, అవుట్ చేసిన న్యూజిలాండ్ కెప్టెన్ జాన్ రైట్... ఆ తర్వాత భారత జట్టుకు కోచ్‌గా పనిచేశాడు. సచిన్ టెండూల్కర్ టెస్టుల్లో మొదటి సెంచరీ చేసిన రోజే, ఈ పిల్లాడు 100 సెంచరీలు చేయగలడని చెప్పాడు జాన్ రైట్.

48

2003 వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో కెన్యా క్రికెటర్ టికోలో భారత బౌలర్లను చీల్చి చెండాడాడు. దాంతో సచిన్ టెండూల్కర్‌కి బంతి అందించాడు అప్పటి సారథి సౌరవ్ గంగూలీ. సచిన్ బౌలింగ్‌లో మొదటి బంతిని బౌండరీకి పంపాడు టికోలో. ఆ తర్వాతి బంతికి అతన్ని అవుట్ చేసి టీమిండియాకి కావాల్సిన బ్రేక్ అందించాడు సచిన్ టెండూల్కర్.. .

58

1995 ఆసియా కప్‌లో సచిన్ టెండూల్కర్‌ను అవుట్ చేసి తన మెయిన్ వికెట్ తీశాడు బంగ్లా బౌలర్ మహ్మద్ రఫీక్. 2000వ సంవత్సరంలో మొదటి టెస్టు ఆడుతున్న రఫీక్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు సచిన్ టెండూల్కర్. 

68
Sachin Tendulkar

2007లో సౌతాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో కెప్టెన్ ద్రావిడ్, ఆఖరి ఓవర్ వేసేందుకు సచిన్ టెండూల్కర్‌కి బంతి ఇచ్చాడు. ఆ మ్యాచ్‌లో అప్పటిదాకా బౌలింగ్ వేయని సచిన్ టెండూల్కర్, మొదటి బంతికి బౌండరీ ఇచ్చినా రెండో బంతికే డేంజరస్ బ్యాట్స్‌మెన్ కెంప్‌ను అవుట్ చేశాడు.

78

2004లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేలో మోర్తాజా 20 బంతుల్లో 39 పరుగులు చేశాడు. ఈ సమయంలో 50వ ఓవర్ వేసిన సచిన్ టెండూల్కర్, మోర్తాజాను అవుట్ చేశాడు. మొదటి బంతికి బౌండరీ బాదిన మోర్తాజా బ్యాటుకి అందకుండా రెండో బంతిని వేసిన టెండూల్కర్, స్టంపౌట్ ద్వారా అతన్ని పెవిలియన్ చేర్చాడు... బ్యాటర్ల ఆటతీరును అర్థం చేసుకోవడంలో ‘మాస్టర్’ అంత వేగంగా స్పందించేవాడు... 

88

‘మేం సచిన్ టెండూల్కర్‌ను మొదటిసారి కరాచీ గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేస్తుంటే చూశాం. 14 ఏళ్ల కుర్రాడిలా కనిపించాడు. వకార్ యూనిస్, నేను ఒకరి మొఖాలు ఒకరం చూసుకున్నాం... ఈ పిల్లాడు ఏం చేయగలడు.... అని నవ్వుకున్నాం. ఇప్పుడు చూస్తే 2 దశాబ్దాలుగా క్రికెట్ ప్రపంచాన్ని ఏలాడు ఆ కుర్రాడు...’ అంటూ సచిన్ టెండూల్కర్ గురించి చెప్పుకొచ్చాడు మాజీ పాక్ క్రికెటర్, కెప్టెన్ వసీం అక్రమ్.

click me!

Recommended Stories