ఇంజనీరింగ్‌‌లో ఫెయిల్! ఇంటికి రావద్దని తండ్రి వార్నింగ్... క్రికెటర్ షాబజ్ అహ్మద్ స్టోరీ వింటే...

First Published Oct 10, 2022, 2:41 PM IST

సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన స్పిన్ ఆల్‌రౌండర్ షాబజ్ అహ్మద్, జాన్నెమన్ మలాన్ వికెట్ తీసి ఇంప్రెస్ చేశాడు. 10 ఓవర్లలో 54 పరుగులిచ్చిన షాబజ్ అహ్మద్, మొదటి మ్యాచ్‌లో మంచి బౌలింగ్ పర్ఫామెన్స్‌తో క్రికెట్ ఫ్యాన్స్‌ని మెప్పించాడు...

Image credit: PTI

టీమిండియా తరుపున వన్డేల్లో ఆరంగ్రేటం చేసిన 247వ ప్లేయర్ షాబాజ్ అహ్మద్. ఐపీఎల్‌లో, దేశవాళీ టోర్నీల్లో షాబజ్ అహ్మద్ ఇచ్చిన పర్ఫామెన్స్‌తో మెచ్చిన సెలక్టర్లు, అతనికి భారత జట్టులో చోటు కల్పించారు. ఆ అవకాశాన్ని బాగానే వాడుకున్నాడు షాబాజ్...

Shahbaz Ahmed

హర్యానాకి చెందిన షాబాజ్ అహ్మద్‌కి చదువు పెద్దగా అబ్బలేదు. కొడుకుని ఇంజనీర్ చేద్దామని షాబజ్ అహ్మద్‌ని ఇంజనీరింగ్‌లో చేర్చాడు అతని తండ్రి. అయితే మనోడు పదుల సంఖ్యలో సబ్జెక్టులు మిగిలిపోవడంతో ఇక లాభం లేదని చదువుకి మధ్యలోనే ఫుల్‌ స్టాప్ పెట్టేశాడు...

కొడుకు చదువు ఆపేయడంతో కంగారుపడిన షాబజ్ తండ్రి అహ్మద్ జాన్, క్రికెటర్‌గా సక్సెస్ కాకపోతే ఇంటికి రానిచ్చేది లేదని వార్నింగ్ ఇచ్చాడట. దీంతో హర్యానా వదిలి కోల్‌కత్తా చేరిన షాబజ్ అహ్మద్, అక్కడ శిక్షణ పొంది ఐపీఎల్‌లో ఆరంగ్రేటం చేసి.. ఇప్పుడు భారత జట్టు తరుపున మ్యాచులు ఆడుతున్నాడు...

‘షాబజ్ అహ్మద్ ఎప్పుడూ ఏదైనా పెద్దగా చేయాలని కలలు కనేవాడు. అతను మంచి స్టూడెంట్ కానీ చదువు మీద అస్సలు ఫోకస్ పెట్టడని షాబజ్ కాలేజీ ప్రోఫెసర్లు కూడా చెప్పారు. ఓసారి షాబజ్ అహ్మద్ తన హెచ్‌ఓడీతో ‘ఓ రోజు మీరు నాకు డిగ్రీ ఇస్తారు, నన్ను సత్కరిస్తారు’ అని చెప్పాడట...’ అంటూ చెప్పాడు షాబజ్ తండ్రి అహ్మద్ జాన్,

‘కోల్‌కత్తాలో ఓ రూమ్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి ఉండేవాడు షాబజ్. మావాడికి వంట చేయడం రాదు. దాంతో అతని పని రూమ్ క్లీన్ చేయడం. అది చూసి మా ఆయన భరించలేకపోయారు. క్రికెటర్‌గా సక్సెస్ కాకపోతే ఇక ఇంటికి రాకు... అని హెచ్చరించారు. అప్పుడే షాబజ్ క్రికెట్‌ని సీరియస్‌గా తీసుకోవడం మొదలెట్టాడు...’ అంటూ చెప్పుకొచ్చింది షాబజ్ అహ్మద్ తల్లి అబ్నం...

click me!