మా కుటుంబం మొత్తం ముక్కలైంది, అయినా నేను... - భారత మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తి...

Published : Jun 03, 2021, 03:25 PM IST

భారత మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తి ఇంట్లో కరోనా వైరస్ కారణంగా రెండు విషాదాలు జరిగాయి. కరోనా బారిన పడి తొలుత ఆమె తల్లి ప్రాణాలు కోల్పోగా, నాలుగు వారాల వ్యవధిలో అక్క కూడా మరణించింది. తొలిసారి ఈ విషాదం గురించి మాట్లాడింది వేదా కృష్ణమూర్తి...

PREV
19
మా కుటుంబం మొత్తం ముక్కలైంది, అయినా నేను...  - భారత మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తి...

కర్ణాటకకి చెందిన భారత జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ వేదా కృష్ణమూర్తి ఇంట్లోవారందరికీ కరోనా వైరస్ సోకింది. ఒక్క వేదా కృష్ణమూర్తికి మాత్రం కరోనా పరీక్షల్లో నెగిటివ్ రిపోర్టు వచ్చింది. ఆమె తల్లి వైరస్ సోకిన రెండు వారాలకు ప్రాణాలు కోల్పోగా, నెలరోజుల పాటు కరోనాతో పోరాడి ప్రాణాలు విడిచింది వేదా కృష్ణమూర్తి అక్క.

29

‘నేను విధిని నమ్ముతాను. అమ్మ చనిపోయిన తర్వాత కూడా అక్క కోలుకుని ఇంటికి వస్తుందనే నమ్మకం ఉండింది. కనీ తను రాలేదు. అమ్మ చనిపోయిన నాలుగువారాలకే అక్క కూడా మాకు దూరమవ్వడం మమల్ని కోలుకోలేని దెబ్బ తీసింది.

39

మా కుటుంబం ఇప్పుడు ఛిన్నాభిన్నమైంది. మిగిలినవారితో పోలిస్తే నేను ధైర్యంగా ఉండి, వారికి ధైర్యం చెబుతున్నా. నా జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. ఇప్పుడు నాకు దేవుడిపైన కూడా నమ్మకం పోయింది..

49

అయితే ఈ పరిస్థితి నుంచి త్వరగా కోలుకోవాలని భావిస్తున్నా..  నాకు తప్ప, మా ఇంట్లోవారందరికీ వైరస్ సోకింది. వారికి కావాల్సిన వైద్య సదుపాయాలు, మందులు అన్నీ నేనే చూసుకున్నా. అప్పుడే నాకు కుటుంబాన్ని నడిపించడం ఎంత కష్టమో అర్థమైంది.

59

నాలాగే ఎంతోమంది ఇలా కరోనా వైరస్ కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నారని ట్విట్టర్‌ ద్వారా తెలిసింది. అందుకే నాలా ఎవ్వరూ ఇబ్బందులు ఎదుర్కోకూడదని అవసరమైన సాయం చేసేందుకు ముందుకొచ్చా...

69

శారీరక ఆరోగ్యం కంటే మానసిక ఆరోగ్యం చాలా అవసరం. మా అక్క వత్సల ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఇదే. తను కరోనా పాజిటివ్ అని తేలగానే చాలా భయపడింది. ఒత్తిడికి గురైంది.

79

అక్క భయాన్ని చూసి మా అమ్మ కూడా. వారికి పాజిటివ్ అని తేలడానికి ముందురోజే ఓ చుట్టాలామె కరోనాతో చనిపోయింది. ఆ సంఘటనతో వీళ్లు చాలా భయపడ్డారు. 

89

కుటుంబంలో అందరూ కరోనా పాజిటివ్‌గా తేలడం కూడా ఆమె ఆరోగ్యంపై ప్రభావం చూపించినట్టుంది’ అంటూ చెప్పుకొచ్చింది వేదా కృష్ణమూర్తి.

99

తల్లి, అక్కను కోల్పోయిన వేదా కృష్ణమూర్తి, భారత జట్టులో చోటు కూడా కోల్పోయింది. అంతేకాదు ఆమెను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి కూడా తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ...
ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ జట్టులో ఉత్సాహం నింపుతూ, ఎనర్జీ మిషన్‌లా ఉండే వేదా కృష్ణమూర్తి.. ఇప్పుడు విషాదాన్నంతా నింపుకున్న నిశ్శబ్దంలా మారిపోయింది. 

click me!

Recommended Stories