జడ్డూ వల్ల ఆ అరుదైన రికార్డు మిస్ చేసుకున్న ఇషాన్ కిషన్... ఫ్రస్టేషన్ చూపించిన రోహిత్ శర్మ...

Published : Jul 15, 2023, 11:08 AM IST

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టు ద్వారా యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ ఇద్దరూ అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశారు. ఆరంగ్రేటం టెస్టులో 171 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్, రికార్డుల మోత మోగిస్తూ... ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచాడు..  

PREV
17
జడ్డూ వల్ల ఆ అరుదైన రికార్డు మిస్ చేసుకున్న ఇషాన్ కిషన్... ఫ్రస్టేషన్ చూపించిన రోహిత్ శర్మ...
Ishan KIshan

ఇషాన్ కిషన్‌ మాత్రం ఆరంగ్రేటం టెస్టులో తన మార్కు చూపించలేకపోయాడు. వికెట్ వెనకాల క్యాచులు అందుకోవడంలో విఫలమైన ఇషాన్ కిషన్, తన కామెంటరీతో రిషబ్ పంత్‌ని మరిపించాలనే ప్రయత్నం చేశాడు..

27
Ishan vs Sanju

రెండు తేలికైన క్యాచులను జార విడిచిన ఇషాన్ కిషన్, బ్యాటింగ్ ఆర్డర్‌లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చాడు. అజింకా రహానే అవుటైన తర్వాత ఇషాన్ కిషన్ వస్తాడని అందరూ భావించారు. అయితే రవీంద్ర జడేజా ఆరో స్థానంలో బ్యాటింగ్‌కి రావడంతో విరాట్ కోహ్లీ అవుటైన తర్వాత ఇషాన్ కిషన్‌కి బ్యాటింగ్ ఛాన్స్ వచ్చింది..

37

లంచ్‌ బ్రేక్‌ సమయానికి విరాట్ కోహ్లీ సెంచరీకి చేరువలో ఉండడంతో అతను సెంచరీ చేసుకునేదాకా బ్యాటింగ్ కొనసాగించాలని టీమిండియా అనుకుంది. 76 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ అవుట్ కాగానే ఇన్నింగ్స్ డిక్లేర్ చేయాలని అనుకున్నారు. అయితే తొలి టెస్టు ఆడుతున్న ఇషాన్ కిషన్‌కి బ్యాటింగ్ ఆడే అవకాశం రావాలని భావించిన రోహిత్ శర్మ, అతన్ని క్రీజులోకి పంపాడు..

47
Ishan Kishan

అయితే ఒక్క సింగిల్ తీయడానికి 20 బంతులు తీసుకున్నాడు ఇషాన్ కిషన్. దీంతో డగౌట్‌లో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం టీవీ కెమెరాల్లో కనిపించింది. 

57


సింగిల్ తీస్తే ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తారనే ఉద్దేశంతోనే 20 బంతులు ఆడాడా? అనేది పక్కనబెడితే ఓ అరుదైన జాబితాలో చేరే అవకాశం మాత్రం చేజార్చుకున్నాడు ఇషాన్ కిషన్.. టీ20 ఆరంగ్రేటం మ్యాచ్‌లో 56 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, మొదటి వన్డే మ్యాచ్‌లో 59 పరుగులు చేశాడు..

67

టెస్టుల్లో కూడా ఆరంగ్రేటం మ్యాచ్‌లో 50+ స్కోరు చేసి ఉంటే మూడు ఫార్మాట్లలో తొలి మ్యాచ్‌లో 50+ బాదిన రెండో క్రికెటర్‌గా నిలిచేవాడు ఇషాన్ కిషన్. ఇంతకుముందు సఫారీ క్రికెటర్ వాన్ దేర్ దుస్సేన్ మాత్రమే ఈ ఫీట్ సాధించాడు..

77

రవీంద్ర జడేజా ప్లేస్‌లో ఇషాన్ కిషన్‌ని బ్యాటింగ్‌కి పంపించి ఉంటే ఈ అరుదైన ఫీట్ క్రియేట్ చేసే అవకాశం ఉండేది. అయితే రహానే అవుటయ్యే సమయానికి కోహ్లీ 2 ఫోర్లతో హాఫ్ సెంచరీకి దగ్గరలో ఉండడంతో అతనిపై ప్రెషర్ తగ్గించడానికి సీనియర్ రవీంద్ర జడేజాని బ్యాటింగ్‌కి పంపించింది టీమిండియా.. 
 

Read more Photos on
click me!

Recommended Stories