ఇది సార్ అశ్విన్ బ్రాండు... హర్భజన్ సింగ్‌ని దాటేసి, అనిల్ కుంబ్లే ఆ రికార్డును సమం చేసి...

Published : Jul 15, 2023, 10:44 AM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో రవిచంద్రన్ అశ్విన్‌కి తుది జట్టులో చోటు ఇవ్వకపోవడం టీమిండియాని తీవ్రంగా దెబ్బ తీసింది. సచిన్ టెండూల్కర్‌తో పాటు వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ వంటి మాజీ క్రికెటర్లు కూడా ఐసీసీ నెం.1 టెస్టు బౌలర్‌గా ఉన్న అశ్విన్‌ని రిజర్వు బెంచ్‌కి పరిమితం చేయడాన్ని తప్పు బట్టారు..

PREV
17
ఇది సార్ అశ్విన్ బ్రాండు... హర్భజన్ సింగ్‌ని దాటేసి, అనిల్ కుంబ్లే ఆ రికార్డును సమం చేసి...

ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్‌లో వాటర్ బాయ్‌గా మారిన రవిచంద్రన్ అశ్విన్, ఆ తర్వాత ఇండియాకి తిరిగి వచ్చి తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో పాల్గొన్నాడు. మిగిలిన టీమ్ సభ్యులు, హాలీడేస్ ఎంజాయ్ చేస్తుంటే.. అశ్విన్ మాత్రం రెస్ట్ తీసుకోవడానికి ఇష్టపడలేదు..
 

27
Ravichandran Ashwin

డొమినికా టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్, రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు పడగొట్టాడు. తొలి టెస్టులో 12 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్, వెస్టిండీస్‌తో ఒకే టెస్టులో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు..

37

వెస్టిండీస్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన స్పిన్నర్‌గా టాప్‌లో నిలిచాడు అశ్విన్. ఇంతకుముందు 2011లో పాక్ మాజీ స్పిన్నర్ సయిద్ అజ్మల్ 11 వికెట్లు తీయగా, 1948లో విండీస్ స్పిన్నర్ విల్ఫ్ ఫర్గూసన్ 11 వికెట్లు తీశాడు.  అశ్విన్ 12 వికెట్లతో టాప్‌లో నిలిచాడు.

47

రవిచంద్రన్ అశ్విన్‌కి ఇది టెస్టు కెరీర్‌లో 34వ 5 వికెట్ల ప్రదర్శన. టెస్టుల్లో అత్యధిక సార్లు, ఐదేసి వికెట్లు తీసిన ఐదో బౌలర్‌గా నిలిచాడు అశ్విన్. శ్రీలంక తరుపున 34 సార్లు ఐదేసి వికెట్లు తీసిన రంగనా హేరాత్ రికార్డును సమం చేసిన అశ్విన్, అనిల్ కుంబ్లే (35 సార్లు) తర్వాతి స్థానంలో నిలిచాడు. ముత్తయ్య మురళీధరన్ 67 సార్లు, షేన్ వార్న్ 37 సార్లు, సర్ రిచర్డ్ హార్డ్‌లీ 36 సార్లు..టెస్టుల్లో ఐదేసి వికెట్ల ప్రదర్శన నమోదు చేశారు.
 

57

ఒకే టెస్టులో 10కి పైగా వికెట్లు తీసిన అశ్విన్‌కి ఇది 8వ సారి. అనిల్ కుంబ్లే కూడా 8 సార్లు, టెస్టు మ్యాచుల్లో 10 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ముత్తయ్య మురళీధరన్ 22 సార్లు, షేన్ వార్న్ 10 సార్లు, రిచర్డ్ హార్డ్‌లీ, రంగనా హేరాత్ 9 సార్లు ఈ ఫీట్ సాధించి అశ్విన్ కంటే ముందున్నారు..

67
R Ashwin

వెస్టిండీస్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన భారత బౌలర్‌గా నిలిచాడు అశ్విన్. ఇంతకుముందు 2016లో 83 పరుగులిచ్చి 7 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్, ఈసారి 71 పరుగులకే 7 వికెట్లు తీశాడు..

77

అంతర్జాతీయ క్రికెట్‌లో 709 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్, 707 వికెట్లు తీసిన హర్భజన్ సింగ్ రికార్డును అధిగమించి.. టీమిండియా తరుపున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. అనిల్ కుంబ్లే 953 వికెట్లతో టాప్‌లో ఉన్నాడు..

click me!

Recommended Stories