వన్డే వరల్డ్ కప్‌లో శిఖర్ ధావన్, సంజూ శాంసన్‌లకు ఛాన్స్! ఆసియా క్రీడల్లో సీనియర్లకు చోటు అందుకే దక్కలేదా...

Published : Jul 14, 2023, 11:35 PM IST

ఆసియా క్రీడలు 2023 పోటీల్లో భారత క్రికెట్ జట్లు కూడా పాల్గొనబోతున్నాయి. సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమయ్యే 19వ ఏషియన్ గేమ్స్‌లో పాల్గొనబోయే భారత పురుషుల టీమ్‌కి శిఖర్ ధావన్ కెప్టెన్సీ చేస్తాడని వార్తలు వచ్చాయి. అయితే ఈ వెటరన్ ఓపెనర్‌ని సెలక్టర్లు పట్టించుకోలేదు..  

PREV
16
వన్డే వరల్డ్ కప్‌లో శిఖర్ ధావన్, సంజూ శాంసన్‌లకు ఛాన్స్! ఆసియా క్రీడల్లో సీనియర్లకు చోటు అందుకే దక్కలేదా...
Sanju Samson

దేశవాళీ టోర్నీల్లో మహారాష్ట్ర టీమ్‌కి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న యంగ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్‌, ఏషియన్ గేమ్స్‌లో భారత మెన్స్ టీమ్‌ని నడిపించబోతున్నాడు. గైక్వాడ్‌కి కెప్టెన్సీ ఇవ్వడం పెద్దగా ఆశ్చర్యాన్ని కలిగించకపోయినా శిఖర్ ధావన్, సంజూ శాంసన్ వంటి సీనియర్లకు ఈ టీమ్‌లో చోటు దక్కకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది..

26
Shikhar Dhawan

శుబ్‌మన్ గిల్, వన్డేల్లో డబుల్ సెంచరీ బాదడంతో శిఖర్ ధావన్‌కి భారత జట్టులో చోటు కరువైంది. అయితే శిఖర్ ధావన్‌కి ఐసీసీ టోర్నీల్లో అద్భుతమైన రికార్డు ఉంది. 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా టైటిల్ గెలవడానికి శిఖర్ ధావనే కారణం. 2019 వన్డే వరల్డ్ కప్‌లోనూ ఆడినంతలో బాగా ఆడాడు గబ్బర్..

36
Image credit: Getty

అదీకాకుండా కెఎల్ రాహుల్ గాయంతో బాధపడుతున్నాడు. శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్... వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ సమయానికి కోలుకుంటారో లేదో చెప్పలేని పరిస్థితి. ఈ కారణంగానే శిఖర్ ధావన్‌ని కనీసం స్టాండ్ బై ప్లేయర్‌గా అయినా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఆడించాలనే నిర్ణయానికి వచ్చిందట బీసీసీఐ..

46

శిఖర్ ధావన్‌తో పాటు సంజూ శాంసన్‌కి కూడా వన్డే వరల్డ్ కప్ 2023 టీమ్‌లో చోటు దక్కొచ్చు. ఇషాన్ కిషన్, ఈ ఏడాది ఆరంభంలో వన్డేల్లో డబుల్ సెంచరీ బాదాడు. అయితే సంజూలాగే, ఇషాన్ కిషన్‌కి కూడా నిలకడలేమి సమస్య ఉంది. ఏ మ్యాచ్‌లో బాగా ఆడతారో, ఏ మ్యాచ్‌లో అనవసర షాట్లకు ప్రయత్నించి వికెట్ పారేసుకుంటారో అర్థం చేసుకోవడం కష్టం..

56
Sanju Samson

కాబట్టి ఇషాన్ కిషన్ కంటే అనుభవం ఉన్న సంజూ శాంసన్‌ని వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో వికెట్ కీపర్‌గా వాడుకోవాలని భావిస్తోందట టీమిండియా. కెఎల్ రాహుల్ కోలుకుంటే స్టాండ్ బై ప్లేయర్‌గా అయినా సంజూకి ప్రపంచ కప్ టీమ్‌లో చోటు దక్కవచ్చని తెలుస్తోంది..

66

వీరితో పాటు సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌కి కూడా వన్డే వరల్డ్ కప్‌ 2023 టీమ్‌లో చోటు దక్కొచ్చు. కారణం జస్ప్రిత్ బుమ్రా కమ్‌బ్యాక్ గురించి ఇప్పటికీ స్పష్టమైన క్లారిటీ రాలేదు. ఆసియా క్రీడలకు ప్రకటించిన జట్టులోనూ భువీ పేరు లేదు. దీంతో భువనేశ్వర్‌ని కూడా మళ్లీ ప్రపంచ కప్‌లో వాడే అవకాశం లేకపోలేదు..

click me!

Recommended Stories