ఇషాన్ కిషన్ ఎంట్రీతో టీమిండియాకి కొత్త సమస్య... ఎవరిని తీయాలి, ఎవరిని పెట్టాలి?

First Published Mar 15, 2021, 10:06 AM IST

టెస్టుల్లో పటిష్టమైన రిజర్వు బెంచ్‌తో కళకళలాడుతున్న టీమిండియా, టీ20ల్లోనూ అదే సమస్యతో బాధపడుతోంది. అవకాశం దక్కించుకున్న అందరూ మొదటి మ్యాచ్‌లోనే సత్తా చాటుతుంటే తుదిజట్టును ఎలా ఎంపిక చేయాలో అర్థం కాని పరిస్థితి...

తొలి టీ20 మ్యాచ్‌లో శిఖర్ ధావన్ ఆడిన తీరు, ప్రేక్షకులతో పాటు క్రికెట్ విశ్లేషకులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. 12 బంతులాడి కేవలం 4 పరుగులే చేసిన ధావన్, మార్క్ వుడ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆసీస్ టూర్‌లో కూడా రాణించని ధావన్‌ను రెండో మ్యాచ్‌లోనే పక్కనబెట్టేసింది టీమిండియా...
undefined
అయితే రెండో టీ20లో ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్, ఆడిన మొదటి బంతినే బౌండరీకి తరలించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. మొదటి మ్యాచ్ అయినా ఎలాంటి ఒత్తిడి లేకుండా సిక్సర్లతో, ఫోర్లతో విరుచుకుపడి ‘ఫియర్ లెస్’ ఇన్నింగ్స్ ఆడాడు...
undefined
32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 56 పరుగులు చేసి అదిల్ రషీద్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయిన ఇషాన్ కిషన్... ఆరంగ్రేట మ్యాచ్‌లోనే ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికై క్రికెట్ ఫ్యాన్స్‌ను ఇంప్రెస్ చేశాడు.
undefined
కొన్నాళ్లుగా ఫామ్‌లో లేక ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లీ, మళ్లీ తన మునుపటి ఫామ్‌లోకి రావడానికి ఇషాన్ కిషన్ దూకుడైన ఇన్నింగ్స్‌ ఇచ్చిన కాన్ఫిడెన్స్‌యే కారణం... అయితే ఇషాన్ కిషన్ ఎంట్రీతో టీమిండియాకు పెద్ద తలనొప్పి ఆరంభమైంది.
undefined
మొదటి రెండు మ్యాచులకు రెస్టు తీసుకున్న రోహిత్ శర్మ, మూడో మ్యాచ్‌లో బరిలో దిగే అవకాశం ఉంది. అప్పుడు అతనితో పాటు ఎవ్వరిని ఓపెనింగ్ చేయించాలనేది పెద్ద సమస్యే...
undefined
కెఎల్ రాహుల్ వరుసగా రెండు మ్యాచుల్లో ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. అయితే టీ20ల్లో అద్భుతంగా రాణిస్తున్న కెఎల్ రాహుల్‌ను రెండు మ్యాచుల్లో ఫెయిల్ అయ్యాడని పక్కన బెట్టడం సరైన నిర్ణయం కాదు...
undefined
అదీకాకుండా ఐపీఎల్ 2020 సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు కెఎల్ రాహుల్. శిఖర్ ధావన్ పరుగుల్లో రెండో స్థానంలో నిలిచినా ఈ ఇద్దరూ ఆ తర్వాత పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్నారు.
undefined
రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్‌ ఓపెనింగ్ చేస్తే, మొదటి మ్యాచ్‌లో అద్భుతంగా ఆకట్టుకున్న ఇషాన్ కిషన్‌ను పక్కనబెట్టాల్సి ఉంటుంది. లేదా టూడౌన్‌లో ఆడించాలి. ఆ ప్లేస్ కోసం ఇప్పటికే రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్ పోటీపడుతున్నారు...
undefined
ఈ ముగ్గురి కారణంగా ఐసీసీ టోర్నీల్లో అద్భుతమైన రికార్డు ఉన్న శిఖర్ ధావన్ రీఎంట్రీ ఇవ్వడం ఇప్పట్లో అసాధ్యంగానే కనిపిస్తోంది... వీళ్లే కాకుండా గాయం కారణంగా జట్టుకి దూరంగా ఉన్న రవీంద్ర జడేజా, బుమ్రా రీఎంట్రీ ఇవ్వడం జట్టు కూర్పు మరింత కష్టంగా మారనుంది. ఇప్పటికే టెస్టు టీమ్‌లో చోటు కోల్పోయిన ధావన్, వన్డే, టీ20 జట్టుకి కూడా దూరమయ్యే ప్రమాదంలో ఉన్నాడు.
undefined
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా, రిషబ్ పంత్, చాహాల్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా... వీరి స్థానాలు దాదాపు పదిలం. కాబట్టి 4 స్థానాల కోసం దాదాపు 12 మంది ప్లేయర్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొని ఉంది... ఎవరిని పక్కనబెట్టాలి, ఎవరిని ఆడించాలి? అనేది చాలా కఠినమైన పరీక్షగా మారనుంది.
undefined
click me!