ఏ బిడ్డ ఇది నా అడ్డా!... రంజీ ట్రోఫీలో మరో సెంచరీతో దుమ్మురేపిన సర్ఫరాజ్ ఖాన్...

Published : Jan 17, 2023, 04:41 PM IST

సర్ఫరాజ్ ఖాన్, టీమిండియాలో చోటు కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న క్రికెటర్. గత నాలుగేళ్లుగా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో రికార్డు లెవెల్లో పరుగుల ప్రవాహం సృష్టిస్తున్నాడు ఈ ముంబై క్రికెటర్. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కి జట్టుని ప్రకటించినప్పుడు, ఆస్ట్రేలియాతో రెండు టెస్టులకు టీమ్‌ని ప్రకటించినప్పుడు ఈసారి సర్ఫరాజ్ ఖాన్‌కి టీమిండియా టెస్టు టీమ్‌లో చోటు దక్కుతుందని భావించారంతా.. అయితే సెలక్టర్లు మాత్రం ఈ సెన్సేషనల్ డొమెస్టిక్ బ్యాటర్‌కి మొండిచేయి చూపిస్తూనే వస్తున్నారు...

PREV
18
ఏ బిడ్డ ఇది నా అడ్డా!... రంజీ ట్రోఫీలో మరో సెంచరీతో దుమ్మురేపిన సర్ఫరాజ్ ఖాన్...
Sarfaraz Khan

ఆస్ట్రేలియాతో రెండు టెస్టులకు ఎంపిక చేసిన జట్టులో సర్ఫరాజ్‌ ఖాన్‌కి చోటు దక్కకపోవడం తీవ్ర వివాదాస్పదమైంది. అయితే అవన్నీ పట్టనట్టుగా రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో మరో సెంచరీతో చెలరేగాడు సర్ఫరాజ్ ఖాన్...

28
Sarfaraz Khan

‘నన్ను మట్టిలో పాతేసి మాయం చేయాలని చూస్తే, ఖరీదైన ఖనిజంగా బయటికి వస్తానంటూ’ సెలక్టర్లకు పరోక్షంగా చెబుతున్నట్టుగా ముంబై జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్.. ‘ఏ బిడ్డ ఇది నా అడ్డా...’  అనే రేంజ్ ఇన్నింగ్స్‌తో మరో రికార్డు క్రియేట్ చేశాడు...

38

ఢిల్లితో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై జట్టు, 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ముషీర్ ఖాన్ 14 పరుగులు, అర్మన్ జాఫర్ 2, కెప్టెన్ అజింకా రహానే 25 బంతుల్లో 2 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచారు..
 

48
Sarfaraz Khan

పృథ్వీ షా 35 బంతుల్లో 9 ఫోర్లతో 40 పరుగులు చేసి అవుట్ కాగా ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్, ప్రసాద్ పవార్‌తో కలిసి ఐదో వికెట్‌కి 54 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. ప్రసాద్ పవార్ 25 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. శామ్స్ ములానీతో కలిసి ఆరో వికెట్‌కి 144 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు సర్ఫరాజ్ ఖాన్...

58
Sarfaraz Khan

74 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సర్ఫరాజ్ ఖాన్, 69 ఓవర్లు ముగిసే సమయానికి 146 బంతుల్లో 16 ఫోర్లు, 3 సిక్సర్లతో 117 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. 103 బంతుల్లో 6 ఫోర్లతో 39 పరుగులు చేసి శామ్స్ ములానీ అవుట్ అయ్యాడు..

68
Image credit: BCCI

ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో సర్ఫరాజ్ తన స్టైల్‌లో బ్యాటింగ్ కొనసాగించాడు. సర్ఫరాజ్ ఖాన్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత ముంబై కోచ్ అమోల్ ముజుందర్ క్యాప్ తీసి, అతనికి అభివాదం చేయడం విశేషం. 

 

78

2019-20 రంజీ సీజన్‌లో 6 మ్యాచుల్లో 2 హాఫ్ సెంచరీలు, 3 సెంచరీలతో 928 పరుగులు చేసిన సర్ఫరాజ్ ఖాన్, గత 2021-22 సీజన్‌లో 6 మ్యాచులు ఆడి 2 హాఫ్ సెంచరీలు, 4 సెంచరీలతో 982 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా 5 మ్యాచులు ఆడిన సర్ఫరాజ్ ఖాన్, ఓ హాఫ్ సెంచరీ, 2 సెంచరీలతో 431 పరుగులు చేశాడు...

88

మూడు రంజీ ట్రోఫీ సీజన్లలోనూ సర్ఫరాజ్ ఖాన్ యావరేజ్ 100+కి పైగా నమోదుకావడం విశేషం. గత 25 రంజీ ఇన్నింగ్స్‌ల్లో 10 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు నమోదు చేసి రికార్డు క్రియేట్ చేశాడు సర్ఫరాజ్ ఖాన్.  69 ఓవర్లు ముగిసే సమయానికి 6 వికెట్ల తేడాతో 254 పరుగులు చేసింది ముంబై జట్టు. 

click me!

Recommended Stories