ముంబై ఇండియన్స్ ప్లేయర్ కావడం వల్లే ఇషాన్ కిషన్‌కి ఇన్ని అవకాశాలు... రుతురాజ్‌ని పక్కనబెట్టి...

Published : Feb 24, 2022, 07:31 PM IST

ఐపీఎల్‌లో ఫైవ్ టైమ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు ద్వారా టీమిండియాలోకి వచ్చిన ప్లేయర్లలో ఇషాన్ కిషన్ ఒకడు. అయితే ఆరంభంలో మెరుపులు తప్ప, స్టడీగా పరుగులు చేయడంలో విఫలమవుతున్నాడు ఇషాన్ కిషన్...  

PREV
114
ముంబై ఇండియన్స్ ప్లేయర్ కావడం వల్లే ఇషాన్ కిషన్‌కి ఇన్ని అవకాశాలు... రుతురాజ్‌ని పక్కనబెట్టి...

ఐపీఎల్ 2020 సీజన్‌లో 500+ పరుగులు చేసి ముంబై ఇండియన్స్ జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు యంగ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్...

214

ఐపీఎల్ 2021 సీజన్ ఫస్టాఫ్‌లో విఫలమై, తుదిజట్టులో చోటు కూడా కోల్పోయిన ఇషాన్ కిషన్... సెకండాఫ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 32 బంతుల్లో 84 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు ఇషాన్ కిషన్...

314

అయితే టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడి నిరాశపరిచిన ఇషాన్ కిషన్, ఆ తర్వాత చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు...

414

విండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో 42 బంతుల్లో 35 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, రెండో మ్యాచ్‌లో 10 బంతులాడి కేవలం 2 పరుగులకే పెవిలియన్ చేరాడు...

514

మూడో టీ20 మ్యాచ్‌లో 31 బంతుల్లో 34 పరుగులు చేసి అవుటైన ఇషాన్ కిషన్, మూడు మ్యాచుల్లో కలిపి 71 పరుగులు చేశాడు. యావరేజ్ విషయం పక్కనబెడితే, స్ట్రైయిక్ రేటు 85.5 మాత్రమే...

614

టీ20ల్లో ఓపెనర్‌గా వచ్చి 100+ స్ట్రైయిక్ రేటు కూడా లేకుండా పరుగులు చేస్తే, అది అట్టర్ ఫ్లాప్ పర్ఫామెన్స్ కిందే లెక్క...

714

అయినా ఇషాన్ కిషన్‌కి మరోసారి అవకాశం ఇచ్చాడు రోహిత్ శర్మ. శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో రుతురాజ్‌కి ఛాన్స్ వస్తుందని అంచనా వేసినా, ఇషాన్‌ కిషన్‌ వైపే మొగ్గు చూపాడు రోహిత్ శర్మ...

814

దీంతో ఇషాన్ కిషన్, ముంబై ఇండియన్స్ ప్లేయర్ కావడం వల్లే వరుసగా ఫెయిల్ అవుతున్నా కెప్టెన్ రోహిత్ శర్మ, అతనికి వరుస అవకాశాలు ఇస్తున్నాడని విమర్శిస్తున్నారు ఫ్యాన్స్...

914

ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఇషాన్ కిషన్‌ని రూ.15.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్. ఇంత భారీ మొత్తం చెల్లించిన ప్లేయర్, ఐపీఎల్ ఆరంభానికి ముందు ఫామ్‌లో లేకపోతే ఎలా?

1014

అందుకే ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభానికి ముందు జరిగే శ్రీలంకతో టీ20 సిరీస్‌లో ఇషాన్ కిషన్‌కి వరుస అవకాశాలు ఇచ్చి, ఫామ్‌లోకి వచ్చేలా రోహిత్ శర్మ జాగ్రత్త పడుతున్నాడని అంటున్నారు నెటిజన్లు...

1114

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ గెలిచి, ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ ఆలీ, విజయ్ హాజారే ట్రోఫీల్లో అదిరిపోయే పర్పామెన్స్ ఇచ్చిన రుతురాజ్ గైక్వాడ్‌కి సరైన అవకాశాలు దక్కలేదు...

1214

ఐపీఎల్ 2021 టోర్నీ తర్వాత రుతురాజ్ గైక్వాడ్ ఆడింది ఒక్కటంటే ఒకే ఒక్క టీ20 మ్యాచ్. ఇదే టైంలో వెంకటేశ్ అయ్యర్ 8 టీ20 మ్యాచులు ఆడాడు...

1314

రుతురాజ్ గైక్వాడ్ ముంబై ఇండియన్స్ ప్లేయర్ కాకపోవడం వల్లే అతనికి ఇషాన్ కిషన్‌కి దక్కినన్ని ఛాన్సులు రావడం లేదని అంటున్నారు ఐపీఎల్ ఫ్యాన్స్... 

1414

అయితే ఇషాన్ కిషన్‌లో ఉన్న సత్తా గురించి బాగా అవగాహన ఉన్న రోహిత్ శర్మ, ఐపీఎల్ కోసమే మాత్రమే కాకుండా టీ20 వరల్డ్ కప్ 2022 నుంచి కూడా దృష్టిలో ఉంచుకుని... అతనికి వరుస ఛాన్సులు ఇస్తున్నాడని అంటున్నారు ‘హిట్ మ్యాన్’ ఫ్యాన్స్...

Read more Photos on
click me!

Recommended Stories