ఇషాన్‌కి ఇచ్చింది చాలు, ఇక రుతురాజ్‌కి అవకాశాలు ఇవ్వండి... శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌లో...

Published : Feb 24, 2022, 05:51 PM IST

ఐపీఎల్ 2020 సీజన్ ద్వారా వెలుగులోకి వచ్చి, ఐపీఎల్ 2021 సీజన్‌లో చరిత్ర లిఖించాడు యంగ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్. చెన్నై సూపర్ కింగ్స్‌కి ఐపీఎల్ 2021 టైటిల్ అందించిన రుతురాజ్, టీమిండియాలో మాత్రం అనుకున్నన్ని అవకాశాలు దక్కించుకోలేకపోతున్నాడు...

PREV
110
ఇషాన్‌కి ఇచ్చింది చాలు, ఇక రుతురాజ్‌కి అవకాశాలు ఇవ్వండి... శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌లో...

విరాట్ సేన, ఇంగ్లాండ్‌ టూర్‌లో ఉన్న సమయంలో శ్రీలంకలో పర్యటించిన భారత జట్టులో ఆరంగ్రేటం చేసిన రుతురాజ్ గైక్వాడ్, అక్కడ రెండు టీ20 మ్యాచులు ఆడాడు...

210

కృనాల్ పాండ్యా కరోనా బారిన పడడంతో అతనితో క్లోజ్ కాంట్రాక్ట్ ఉన్న 8 మంది ప్లేయర్లు జట్టుకి దూరం కావడంతో రుతురాజ్ గైక్వాడ్, దేవ్‌దత్ పడిక్కల్ వంటి కుర్రాళ్లకు అవకాశం దక్కింది...

310

శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో 21 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్, ఆ తర్వాతి మ్యాచ్‌లో 14 పరుగులు చేశాడు...

410

ఐపీఎల్ 2021 సీజన్ సెకండాఫ్‌లో దుమ్మురేపే పర్పామెన్స్ ఇచ్చి, అతి పిన్న వయసులో ఆరెంజ్ క్యాప్ గెలిచిన ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు రుతురాజ్ గైక్వాడ్...

510

సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీతో పాటు విజయ్ హాజారే ట్రోఫీలో నాలుగు సెంచరీలు బాది 600+ పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్, న్యూజిలాండ్‌ టీ20 సిరీస్‌కి ఎంపికైనా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు..

610

విండీస్‌తో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లకు ఎంపికైన రుతురాజ్ గైక్వాడ్, ఆఖరి టీ20 మ్యాచ్‌ మాత్రమే ఆడాడు. 8 బంతుల్లో ఓ ఫోర్‌తో 4 పరుగులు చేసి అవుట్ అయ్యాడు రుతురాజ్...

710

సూర్యకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్‌ గాయం కారణంగా జట్టుకి దూరం కావడంతో శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌లో రుతురాజ్ గైక్వాడ్‌కి అవకాశం ఇవ్వాలని అంటున్నాడు భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్..

810

‘శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌లో రోహిత్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి ఓపెనింగ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇషాన్ కిషన్‌, విండీస్ సిరీస్‌లో పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు...

910

కాబట్టి రుతురాజ్ గైక్వాడ్‌కి వరుస అవకాశాలు ఇచ్చి చూస్తే మంచిది. కనీసం రెండు, మూడు మ్యాచులైనా రుతురాజ్‌ని ఆడిస్తే అతని సత్తా అర్థమవుతుంది...’ అంటూ కామెంట్ చేశాడు వసీం జాఫర్...

1010

వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసిన ఇషాన్ కిషన్ 3 మ్యాచుల్లో కలిపి 71 పరుగులే చేశాడు. స్ట్రైయిక్ రేటు 85.54 మాత్రమే...

Read more Photos on
click me!

Recommended Stories