ఇషాన్ కిషన్ కంటే పృథ్వీషా బెటర్... టీ20ల్లో టెస్టు మ్యాచులు ఆడుతున్నాడంటూ...

Published : Feb 20, 2022, 08:20 PM ISTUpdated : Feb 24, 2022, 07:31 PM IST

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ద్వారా టీమిండియాలోకి వచ్చిన ప్లేయర్లలో ఇషాన్ కిషన్ ఒకడు. అయితే వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు ఇషాన్ కిషన్...

PREV
110
ఇషాన్ కిషన్ కంటే పృథ్వీషా బెటర్... టీ20ల్లో టెస్టు మ్యాచులు ఆడుతున్నాడంటూ...

మొదటి మ్యాచ్‌లో 42 బంతుల్లో 35 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, రెండో మ్యాచ్‌లో అయితే 10 బంతులు ఆడి కేవలం 2 పరుగులకే పెవిలియన్ చేరాడు...

210

మూడో టీ20లో రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి ఓపెనింగ్ చేసిన ఇషాన్ కిషన్, 31 బంతుల్లో 34 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...

310

ఈ సిరీస్‌లో మొత్తంగా 71 పరుగులు చేసిన యంగ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ స్ట్రైయిక్ రేటు కేవలం 85.5 మాత్రమే. టీమిండియా తరుపున టీ20ల్లో ఇది రెండో అత్యల్పం..

410

2010 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో మురళీ విజయ్ 83.8 స్ట్రైయిక్ రేటు తర్వాత టీమిండియా తర్వాత టీ20 సిరీస్‌లో అత్యల్ప స్ట్రైయిక్ రేటు ఉన్న టాపార్డర్ బ్యాటర్ ఇషాన్ కిషనే...

510

అంతేకాకుండా మొదటి ఏడు టీ20 ఇన్నింగ్స్‌ల తర్వాత ఇషాన్ కిషన్ స్ట్రైయిక్ రేటు 110 గా ఉంది. ఈ విషయంలోనూ అతి తక్కువ స్ట్రైయిక్ రేటు ఉన్న బ్యాటర్లలో టాప్ 4లో ఉన్నాడు ఇషాన్ కిషన్...

610

మురళీ విజయ్ మొదటి 7 టీ20 ఇన్నింగ్స్‌ల తర్వాత 98.4, శ్రేయాస్ అయ్యర్ 102, శిఖర్ ధావన్ 105 స్ట్రైయిక్ రేటుతో టాప్ 3లో ఉన్నారు...
 

710

వరుసగా అవకాశాలు ఇస్తున్నా ఫెయిల్ అవుతుండడంతో భారత యంగ్ ఓపెనర్ పృథ్వీషా పేరును తెరపైకి తెస్తున్నారు టీమిండియా అభిమానులు...

810

ఆరంగ్రేటం టెస్టులో 100కి పైగా స్ట్రైయిక్ రేటుతో సెంచరీ బాదిన పృథ్వీషా... భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌లా వీరబాదుడు ఆడడానికే ఎక్కువ ఇష్టపడతాడు...

910

టీ20ల్లో టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడుతున్న ఇషాన్‌ కిషన్‌కి బదులుగా టెస్టులను టీ20ల్లా ఆడే పృథ్వీషాకి చోటు ఇస్తే... టీమిండియాకి కావాల్సిన మెరుపు ఆరంభం అందిస్తాడని అంటున్నారు నెటిజన్లు...
 

1010

అయితే ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరుపున అదిరిపోయే మెరుపు బ్యాటింగ్‌ ఇన్నింగ్స్‌లతో మ్యాచులను గెలిపించిన ఇషాన్ కిషన్‌కి ఇంకొన్ని అవకాశాలు ఇస్తే, అతనిలో ఉన్న సిసలైన టాలెంట్ బయటికి వస్తుందని అంటున్నారు మరికొందరు అభిమానులు...

click me!

Recommended Stories