ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఇషాన్ కిషన్... అయినా ఓపెనర్‌గా మయాంక్‌కి ఛాన్స్...

Published : Feb 27, 2022, 05:06 PM IST

India vs Sri Lanka 3rd T20I: టీమిండియా ఫ్యాన్స్‌కి, ముంబై ఇండియన్ ఫ్యాన్స్‌కి నిజంగా ఇది గుడ్‌న్యూస్. శ్రీలంకతో  జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో గాయపడి, ఆసుపత్రిలో చేరిన భారత యంగ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ డిశ్చార్జ్ అయ్యాడు...

PREV
19
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఇషాన్ కిషన్... అయినా ఓపెనర్‌గా మయాంక్‌కి ఛాన్స్...

 ఓపెనర్‌గా క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో లాహిరు కుమార బౌలింగ్‌లో 140+ కి.మీ.ల వేగంతో దూసుకొచ్చిన బంతి, భారత వికెట్ కీపర్ హెల్మెట్‌కి బలంగా తగిలింది... వైద్య సిబ్బంది వెంటనే గ్రౌండ్‌లోకి వచ్చి, ఇషాన్ కిషన్‌ని చెక్ చేశారు...
 

29

తిరిగి బ్యాటింగ్ కొనసాగించిన ఇషాన్ కిషన్, 15 బంతుల్లో 2 ఫోర్లతో 16 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత వెంటనే ఇషాన్ కిషన్‌ను హిమాచల్‌ప్రదేశ్‌లోని కంగ్రా ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు...
 

39

ఇషాన్ కిషన్ తల తిరుగుతుందని చెప్పడంతో అతన్ని ఐసీయూలో చేర్చి, తలకు అయిన గాయం తీవ్రతను తెలుసుకోవడానికి స్కానింగ్స్ నిర్వహించారు.  వైద్య పరీక్షల్లో ఇషాన్ కిషన్‌కి అయిన గాయం సీరియస్ కాదని తేలడంతో అతన్ని నార్మల్ వార్డుకి మార్చారు...

49

రిపోర్టులన్నీ నార్మల్ రావడంతో ఇషాన్ కిషన్‌ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. అయితే బయో బబుల్‌ను దాటి బయటికి వెళ్లిన ఇషాన్ కిషన్, నేటి మ్యాచ్‌లో బరిలో దిగడం లేదు.

59

అదీకాకుండా ముందు జాగ్రత్తగా వెంటనే మ్యాచ్ ఆడడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో ఇషాన్ కిషన్‌ను మూడో టీ20 నుంచి దూరంగా పెట్టాలని నిర్ణయం తీసుకుంది బీసీసీఐ...

69

ఇషాన్ కిషన్ గాయం కారణంగా తప్పుకోవడంతో మయాంక్ అగర్వాల్‌కి తుదిజట్టులో అవకాశం దక్కనుంది. ఇప్పటికే కెఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్‌ల రూపంలో ఇద్దరు టీ20 ఓపెనర్లు గాయపడడంతో నాలుగో ఆప్షన్‌గా మయాంక్ అగర్వాల్‌కి పిలుపు నిచ్చింది బీసీసీఐ...

79

టీమిండియా తరుపున 19 టెస్టులు, 5 వన్డేలు ఆడిన మయాంక్ అగర్వాల్, ఇప్పటిదాకా టీ20 మ్యాచులు మాత్రం ఆడలేదు. 

89

అయితే ఆల్‌రౌండర్‌గా జట్టులో చోటు దక్కించుకున్న వెంకటేశ్ అయ్యర్, ఐపీఎల్ 2021 సీజన్‌లో ఓపెనర్‌గా అదిరిపోయే పర్పామెన్స్ ఇచ్చాడు...
 

99

కేకేఆర్ ఫస్టాఫ్ పర్ఫామెన్స్‌కి, సెకండాఫ్ సూపర్ షోకి మధ్య గ్యాప్‌గా నిలిచిన వెంకటేశ్ అయ్యర్‌ను ఓపెనర్‌గా ఆడించే అవకాశం కూడా ఉంది.  

Read more Photos on
click me!

Recommended Stories