IPL 2022: ఐపీఎల్ సంప్రదాయానికి చెక్.. సీఎస్కేను కాదని.. తొలి మ్యాచ్ ఆ జట్ల మధ్యే..

Published : Feb 27, 2022, 01:30 PM IST

IPL 2022: క్రికెట్ అభిమానులకు కనువిందు చేయడానికి ఐపీఎల్-15 సీజన్ త్వరలోనే ప్రారంభం కానున్నది. మార్చి 26 నుంచి ప్రారంభం కాబోయే ఈ సీజన్ లో తొలి  మ్యాచ్... 

PREV
16
IPL 2022: ఐపీఎల్ సంప్రదాయానికి చెక్.. సీఎస్కేను కాదని.. తొలి మ్యాచ్ ఆ జట్ల మధ్యే..

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2022 మార్చి 26న ప్రారంభం కానున్నది.  అయితే గతంలో  ఉన్న సంప్రదాయాన్ని ఈసారి ఐపీఎల్ నుంచి మార్చుతున్నారు. 

26

సాధారణంగా  గత సీజన్  విజేతలు, పరాజితుల మధ్య తొలి మ్యాచును నిర్వహిస్తారు. ఆ ప్రకారం ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్.. తొలి మ్యాచ్ ఆడాల్సి ఉంది. 

36

కానీ ఈసారి మాత్రం తొలి మ్యాచు ముంబై ఇండియన్స్-కోల్కతా నైట్  రైడర్స్ మధ్య జరుగనున్నది.  మార్చి 26న వాంఖడే వేదికగా జరుగబోయే  ఈ మ్యాచుతో 2022 సీజన్ ప్రారంభం కానున్నది. ఐపీఎల్-14 సీజన్ విజేత చెన్నై సూపర్ కింగ్స్.. రెండో  మ్యాచు ఆడనున్నది.  

46

ఐపీఎల్-15కు సంబంధించిన  మొత్తం షెడ్యూల్ ను  మరో 48 గంటల్లో విడుదల చేయనున్నది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)..  ఈ మేరకు  మహారాష్ట్ర ప్రభుత్వం కూడా లీగ్ కు పూర్తి సహాయ సహకారాలు అందించనున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. 

56

ఈ కింద పేర్కొన్న వేదికల్లో ఐపీఎల్-15 సీజన్  అంతా జరుగనున్నది. ముంబై లోని వాంఖడే స్టేడియంలో 20 మ్యాచులు.. డీవై పాటిల్ స్టేడియంలో 20 మ్యాచులు.. బ్రబోర్న్ స్టేడియంలో 15 మ్యాచులు.. పూణెలోని ఎంసీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో 15 మ్యాచులు  జరుగనున్నాయి. 

66

లీగ్ మ్యాచులు (70) అన్నీ ఈ నాలుగు వేదికల్లోనే జరుగుతాయి. ప్లే ఆఫ్స్ మ్యాచులు మాత్రం ఎక్కడ జరుగుతాయనేదానిపై ఇంకా స్పష్టత  లేదు.  త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడవుతాయి.

click me!

Recommended Stories