Rohit Sharma, Virat Kohli,
Cricket: ఒకప్పుడు టెస్ట్ క్రికెట్‌లో ప్రపంచంలోనే అత్యుత్తమంగా జట్టుగా కొనసాగిన భారత్ ఇప్పుడు అత్యంత అస్థిరమైన బ్యాటింగ్ లైనప్ తో ఇబ్బంది పడుతోంది. భారత్-న్యూజిలాండ్ టెస్టు సిరీస్ లో చాలా కాలం తర్వాత అత్యల్ప స్కోరును నమోదుచేసిన భారత్ జట్టు ఈ సిరీస్ లో వైట్ వాష్ కావడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. 11 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత్ తన మొదటి ఓటమిని చవిచూసింది. అలాగే, వరుసగా 18 సిరీస్ విజయాల జైత్రయాత్రకు ఫుల్ స్టాప్ పడింది.
Rohit Sharma Test
మరీ ముఖ్యంగా భారత్ పై టెస్టు క్రికెట్ లో గొప్ప రికార్డులు లేని న్యూజిలాండ్ చేతిలో భారత్ వైట్ వాష్ కావడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఇప్పటికీ ఈ విషయాన్ని భారత క్రికెట్ లోకం జీర్ణించుకోలేకపోతోంది. మరీ ముఖ్యంగా శ్రీలంకలో 0-2తో సిరీస్ వైట్‌వాష్ తర్వాత కివీస్ సిరీస్‌లోకి ఆడుగు పెట్టిన భారత్.. ఏవరూ ఊహించని విధంగా వరుసగా మూడు మ్యాచ్ లలో ఓడిపోయి చెత్త రికార్దును నమోదుచేసింది.
భారీ అంచనాలున్న స్టార్ ఆటగాళ్లు, సీనియర్ ప్లేయర్లు దారుణ ప్రదర్శనతో భారత్ ఓటమిలో కారణంగా ఉన్నారు. గత కొన్ని ఇన్నింగ్స్ ల నుంచి విఫలమవుతున్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ లు రిటైర్మెంట్ తీసుకునే సమయం వచ్చిందా? అనే ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయి.
Virat Kohli Rou Out
న్యూజిలాండ్ జట్టు గత ఏడు దశాబ్దాలుగా భారత్‌లో సాధించినన్ని టెస్టు మ్యాచ్‌లను రెండు వారాల్లోనే గెలిచింది. మరోవైపు బంగ్లాదేశ్‌ను 2-0తో వైట్‌వాష్ చేసిన భారత్ ఆత్మవిశ్వాసంతో ఉన్న భారత్.. కివీస్‌ను చిత్తుగా ఓడిస్తుందని భావించారు. కానీ అది జరగలేదు. వర్ష ప్రభావిత బెంగళూరు పిచ్‌పై మొదట బ్యాటింగ్ చేయడానికి రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయం భారత్ ను తీవ్రంగా దెబ్బకొట్టింది. భారత ఆటగాళ్లు 46 పరుగులకే ఆలౌటయ్యారు. అయితే, కీవీస్ మాత్రం అద్భుతం చేసింది.
టాస్‌లో రోహిత్ గందరగోళానికి గురికావడమే కాకుండా, అతని నిర్లక్ష్యపు షాట్ వికెట్ కోల్పోవడానికి కారణం అయింది. కొంత సమయం రోహిత్, జైస్వాల్ క్రీజులో నిలబడ్డ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఈ సిరీస్ లో విరాట్ కోహ్లీ స్పిన్ ఎదుర్కోవడంలో ఘోరంగా విఫలం అయ్యాడు. లెగ్ సైడ్ డౌన్ క్యాచ్‌తో డకౌట్ అయ్యాడు. ఐదుగురు భారతీయ బ్యాటర్లు తర్వాత డకౌట్‌గా ఔటయ్యారు, మిగిలిన వారిలో ఇద్దరు మాత్రమే 10 పరుగుల మార్కును అధిగమించగలిగారు. మొత్తంగా భారత స్వదేశంలో తన అత్యల్ప స్కోరుతో మ్యాచ్ ను కోల్పోయింది. ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్ బంతితో ప్రభావం చూపకపోవడం భారత్‌ను బాధించింది.
ఈ రెండు ఓటములు భారత బ్యాటర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయి. పూణేలో జరిగిన మ్యాచ్ లో అది స్పష్టంగా కనిపించింది. ఈసారి రోహిత్ టాస్ గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, కానీ న్యూజిలాండ్ పిచ్‌లో మొదట బ్యాటింగ్ చేసింది. భారత తొలి ఇన్నింగ్స్ లో అధిక్యం సాధించింది. కానీ, మొత్తంగా మ్యాచ్ ను గెలుచుకోవడంలో సక్సెస్ కాలేదు.
సాధారణంగా స్వదేశంలో ఆధిపత్యం చెలాయించే రవిచంద్రన్ అశ్విన్ మొదటి రెండు టెస్టుల్లో 43 సగటుతో కేవలం ఆరు వికెట్లు మాత్రమే సాధించాడు. మూడు పరాజయాల్లో గమనించదగినది సీనియర్ ఆటగాళ్లు పెద్ద ఇన్నింగ్స్ లను ఆడకపోవడం. ఇటీవలి పేలవమైన ఫామ్ ను కొనసాగిస్తున్న రోహిత్ తొలి రెండు టెస్టుల్లో కేవలం 62 పరుగులు మాత్రమే చేయగలిగాడు. చివరి మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ లలో కలిపి 29 పరుగులు చేశాడు. అతను తన చివరి ఎనిమిది ఇన్నింగ్స్‌లలో ఒక అర్ధ సెంచరీని సాధించగా, మొత్తం 104 పరుగులు మాత్రమే చేశాడు.
టెస్టు క్రికెట్‌లో కోహ్లి పతనం కొనసాగుతోంది. అతను మొదటి రెండు టెస్టుల్లో మూడుసార్లు స్పిన్ దెబ్బకు బలయ్యాడు. కేవలం 88 పరుగులు చేశాడు. మూడో టెస్టు మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ లలో కలిపి 5 పరుగులు చేశాడు. 2020 నుండి భారతదేశపు సీనియర్ మోస్ట్ బ్యాటర్ 33 టెస్టుల్లో కేవలం రెండు సెంచరీలు సాధించాడు. 15 హోమ్ మ్యాచ్ లలో ఒక్క సెంచరీ మాత్రమే సాధించాడు.
ఇక గత కొన్నేళ్లుగా భారత్ స్పిన్ అటాక్‌కు మూలస్తంభాలుగా ఉన్న అశ్విన్, జడేజాలు స్పష్టంగా తమ స్థాయికి తగ్గ ప్రదర్శనలు ఇవ్వడంలో విఫలం అవుతూనే ఉన్నారు. మూడు సంవత్సరాల తర్వాత తన మొదటి టెస్టు ఆడుతున్న వాషింగ్టన్ సుందర్, రెండు టెస్టుల్లో అశ్విన్, జడేజాలు కలిపి తీసిన వికెట్ల కంటే ఎక్కువ ఒక్క మ్యాచ్ లో తీశాడు. సుందర్ పూణె టెస్టులో ఏడు వికెట్లతో సహా 11 వికెట్లు తీశాడు.
అశ్విన్, జడేజాలు చెరో మూడు చొప్పున ఆరు వికెట్లు తీశారు. పూణె టెస్టులో జస్ప్రీత్ బుమ్రాకు వికెట్లు లేకపోవడం భారత్ కష్టాలను పెంచగా, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్ కూడా కివీస్‌ను ఇబ్బంది పెట్టలేకపోయారు. సిరీస్ ను క్లీన్ స్విప్ చేస్తుందని భారత్ పై అంచనాలు ఉండగా, ఏవరూ ఊహించని విధంగా టీమిండియాను న్యూజిలాండ్ వైట్ వాష్ చేసింది. రాబోయే ఆసీస్ సిరీస్ లో ఇదే చెత్త ప్రదర్శన చేస్తే నేరుగా ఈ ముగ్గురు స్టార్లు రిటైర్మెంట్ తీసుకోవడానికి ఇదే మంచి సమయమంటూ క్రికెట్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.