Rishabh Pant, Pant, cricket
రిషబ్ పంత్
రిషబ్ పంత్ 2016 నుండి ఢిల్లీ క్యాపిటల్స్‌తో కొనసాగాడు. అయితే, ఐపీఎల్ 2025 సీజన్ కు ముందు ఢిల్లీకి చెందిన ఫ్రాంచైజీ అతనిని ఇకపై కొనసాగించలేమని వదులుకుంది. రాబోయే ఐపీఎల్ ఎడిషన్ కోసం రిటైన్ చేసుకోలేదు. దీంతో పంత్ ఐపీఎల్ వేలంలో పాల్గొననున్నాడు.
27 ఏళ్ల భారత వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ ఐపీఎల్ 2025 మెగా వేలంలో కనిపించిన అతిపెద్ద పేర్లలో ఒకరు. బ్యాటింగ్, వికెట్ కీపింగ్ తో పాటు కెప్టెన్సీలో కూడా అతనికి అనుభవం ఉంది. కాబట్టి ఇతర జట్లకు మంచి ఎంపిక కూడా. రిషబ్ పంత్ ఐపీఎల్ లో 3284 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
arshdeepsinghh
అర్ష్ దీప్ సింగ్
ప్రస్తుత కాలంలో అత్యుత్తమ టీ20 బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ ఒకడు. అతను కొత్త బంతితో పాటు డెత్ ఓవర్లలో బాగా రాణించగలడు. 2024 టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అర్ష్‌దీప్ నిలిచాడు.
ఇప్పటి వరకు ఆడిన ఐపీఎల్ సీజన్లలో అద్భుత ప్రదర్శన చేశాడు. భారత జట్టులోకి వచ్చిన తక్కువ సమయంలోనే స్టార్ బౌలర్ గా ఎదిగాడు. పంజాబ్ కింగ్స్ అర్ష్ దీప్ సింగ్ ను రిటైన్ చేసుకోకుండా వదులుకున్నప్పటికీ.. ఈ గణాంకాలతో అర్ష్ దీప్ సింగ్ పై చాలా టీమ్‌లు దృష్టి పెట్టాయి.
KL Rahul
కేఎల్ రాహుల్
భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ కూడా రాబోయే ఐపీఎల్ 2025 సీజన్ కు ముందు వేలంలోకి రానున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా ఉన్న కేఎల్ రాహుల్‌ను లక్నో ఫ్రాంచైజీ ఐపీఎల్ 2025 సీజన్ కోసం అతన్ని రిటైన్ చేసుకోలేదు.
లక్నో టీమ్ వదులుకోవడంతో కేఎల్ రాహుల్ వేలంలోకి వచ్చాడు. 32 ఏళ్ల టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అయిన కేఎల్ రాహుల్ ఐపీఎల్‌లో ఇప్పటివరకు 132 మ్యాచ్‌లు ఆడి 4683 పరుగులు చేశాడు. రాహుల్‌కి కెప్టెన్సీలో లక్నో టీమ్ మెరుగైన ప్రదర్శనలు కూడా చేసింది. దీంతో అతని కెప్టెన్సీకి కూడా డిమాండ్ ఉంటుంది.
Shreyas Iyer
శ్రేయాస్ అయ్యర్
శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) 2024లో ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. అయినప్పటికీ అయ్యర్ ను కేకేఆర్ రిటైన్ చేసుకోకుండా వదులుకుంది. రెండు ఐపీఎల్ జట్లను ఫైనల్‌కు చేర్చిన ఏకైక కెప్టెన్ గా అయ్యర్ కు గుర్తింపు ఉంది. అంతకుముందు, అతను తన కెప్టెన్సీలో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లాడు.
శ్రేయాస్ అయ్యర్ కు మంచి బ్యాటింగ్ తో పాటు గొప్ప కెప్టెన్సీ కారణంగా అతనికి బాగా డిమాండ్ ఉంటుంది. ముంబైకి చెందిన కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ మిడిల్ ఆర్డర్‌లో అద్భుతమైన బ్యాటింగ్‌కు కూడా పేరుగాంచాడు. ఐపీఎల్ వేలంలో అతన్ని దక్కించుకోవడానికి జట్లు పోటీ పడే అవకాశముంది. శ్రేయాస్ అయ్యర్ ఐపీఎల్ లో 3127 పరుగులు చేశాడు. ఇందులో 21 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
Ishan Kishan
ఇషాన్ కిషన్
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్ వదులకున్న ప్లేయర్లలో భారత స్టార్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ కూడా ఉన్నాడు. దీంతో అతను కూడా వేలంలోకి వచ్చాడు. దూకుడుగా బ్యాటింగ్ చేసే స్వభావం ఉన్న టాప్ ఆర్డర్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ గతంలో ముంబైకి అద్భుతమైన విజయాలు అందించాడు.
కొన్ని బంతుల్లోనే మ్యాచ్ స్వరూపాన్ని మార్చగల సత్తా ఉన్న ప్లేయర్. ఐపీఎల్ 2022 మెగా వేలంలో ముంబై అతడిని రూ. 15.25 కోట్లకు కొనుగోలు చేసింది. అతడిని కొనుగోలు చేసేందుకు చాలా జట్లు పోటీ పడ్డాయి. ఇప్పుడు ఐపీఎల్ 2025కి ముందు ముంబై ఇండియన్స్ ఇషాన్ కిషన్ ను వదులుకోవడంతో అతని కోసం వేలంలో దాదాపు అన్ని ఫ్రాంఛైజీలు పోటీ పడే అవకాశముంది. గత సీజన్‌లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ 14 మ్యాచ్‌ల్లో 320 పరుగులు చేశాడు. మొత్తంగా ఐపీఎల్ లో ఇషాన్ 2644 పరుగులుచ చేశాడు. ఇందులో 16 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.